
వృక్షనివాళి శతకము
1*
శ్రీలుజిందునాత్మనిశ్చలమతియైన
ధర్మవర్తనంబుధరణిగలుగు!
చపలమతియుహీనచరితుడేయగువృక్ష
దేవతాకృజ్ఞతేనివాళి!
2*
అంతరంగవైరులార్గురిచేఖైది
తానెయగును, వానిదరుమమేలు!
పుడమిమ్రానుజన్మపుణ్యంబుకదతరు
దేవతాకృజ్ఞతేనివాళి!
3*
అనువుగానిపనులఅధికముజూపక
దైవప్రేమబంచుదారివెంట-
పెద్దదిక్కుగాగప్రేరణొసగుతరు-
దేవతాకృజ్ఞతేనివాళి!
4*
అదుపులేనిమనసుపొదుపులేనిమనిషీ
కాగిదంపుపులియెకలిమిలేక!
భువిపరోపకారబుద్ధినేర్పునుచెట్టు
దేవతాకృజ్ఞతేనివాళి!
5*
స్వయమునితరుసేవచాయింపనోపక
స్వంతపనులకితరశ్రమనుదోచి
శాశ్వతంబుగానిసంపదలాశింత్రు!
దేవతాకృజ్ఞతేనివాళి!
6*
పగటికలలుపనులపగలుశగలెగాని
తోటివానిప్రేమతోడజూచు
బుద్ధిలేనిబ్రతుకుబుద్బదమేవృక్ష
దేవతాకృజ్ఞతేనివాళి!
7*
దుష్టచింతనమదిదురితమేపరనింద
తానెగొప్పపరులతప్పుతడక-
పాడుకర్మజోలిపట్టనివటవృక్ష
దేవతాకృజ్ఞతేనివాళి!
8*
కల్మికన్నమేలుకల్మిడిజీవనం
లేమికన్నకీడులేకిగుణమె!
కినుకమానిమాటక్రియజూపుఫలవృక్ష
దేవతాకృజ్ఞతేనివాళి!
9*
మగువకొప్పునున్నమల్లెజూచియుమెచ్చు
ఇంటచెట్టుబెట్ట-ఇష్టపడరు!
గడ్డిపోచదర్భగాగమెప్పొందదా?
దేవతాకృజ్ఞతేనివాళి!
10*
మంచిమనసులేదుమర్యాదసైపరు
చెట్టుకన్న-గొప్పచుట్టమనును!
మాటలాడగల్గిమానెనుమరితరు-
దేవతాకృజ్ఞతేనివాళి!
11*
తనకృతజ్ఞతొకటెతారకమంత్రము
ప్రేమశక్తివరము-రామరక్ష!
వేదగురునివలెనె-వేదికైనతరవు
దేవతాకృజ్ఞతేనివాళి!
12*
ధన్యవాదిగాకధరజన్మమేవృధా
ప్రేమధనముకొలదిపెద్ధబ్రతుకు-
పాఠమయ్యెచూడపావనమగువృక్ష-
దేవతాకృజ్ఞతేనివాళి!
13*
శాస్త్రవేత్తకైన-సామాన్యుకైనను
పరులసహకరింపుపనులసొంపు!
స్వార్థమసలులేనిసహజీవియగువృక్ష-
దేవతాకృజ్ఞతేనివాళి!
14*
మేలుమరవనట్టిమేటిమానవనీతి
సర్వజనులసుఖముశాస్త్రవృద్ధి
తీరుతెన్నులప్రతీకయేయగువృక్ష-
దేవతాకృజ్ఞతేనివాళి!
15*
మత్తుచిత్తులేదుమర్యాదదప్పదు
మేలుమాటనిలుపుమేటిబ్రతుకు!
పరులప్రీతిగాంచిపరవశించుతరువు
దేవతాకృజ్ఞతేనివాళి!
16*
తానుబాగుపడుచుతదితరక్షేమంబు
దలచిపూచికాచితరచుపంచు
మనిషిమించుకీర్తిమ్రానుదేకదభువి-
దేవతాకృజ్ఞతేనివాళి!
17*
నిజముప్రేమదోచునిస్వార్థకామమై
ఫలముజూడజన్మపావనమ్ము!
ఈసుమానిప్రేమనిరవొందజేసెడు
దేవతాకృజ్ఞతేనివాళి!
18*
ప్రేమలన్నివిశ్వప్రేమరూపమునెత్తు
ధరణిసృష్టివృద్ధిదైవప్రేమ!
స్వచ్ఛమైనప్రేమచరితార్థకమువృక్ష-
దేవతాకృజ్ఞతేనివాళి!
19*
నేరవృత్తివృద్ధినేరీతిసాధ్యము
ప్రేమరహితకర్మపెంపుగనదు!
మాతృప్రేమనీదిమహికీర్తిగనువృక్ష-
దేవతాకృజ్ఞతేనివాళి!
20*
గోటిసుఖముగోరికొండంతఘోరము
పూనునరులకెట్లుపుణ్యగతులు!
నీపరోపకారనీతిమేలగువృక్ష-
దేవతాకృజ్ఞతేనివాళి!
21*
ప్రేమమరచియీసుపెంపొందచరియించు
మనిషికన్ననడవిమ్రానుమిన్న!
అనుచుజనులుభక్తినర్చింత్రునినువృక్ష-
దేవతాకృజ్ఞతేనివాళి!
22*
కట్టులేనిమనసుకడకునసంతృప్తి-
తనివిదీరులోపెతనువువీడు!
మరలబుట్టినిన్నుమరవకదరిజేరు
దేవతాకృజ్ఞతేనివాళి!
23*
తామసాననాత్మతాపంబుతెలియదు
రాజసానసమయరహితసుఖమె!
సాత్వికంబెమేలుసాక్షివీవేవృక్ష-
దేవతాకృజ్ఞతేనివాళి!
24*
ఆత్మదెలియసుంతనారాటమేలేదు
పుణ్యధనముగూర్పపుడమిజన్మ!
గాగమరలబుట్టిగాసిజెందుటెతరు
దేవతాకృజ్ఞతేనివాళి!
25*
జాగృతమునదెలియుజన్మప్రయోజనం
మాయతెరలుదొలుగమనసునిలుచు! నిల్పకున్నజన్మనిప్పచ్ఛరమెతరు
దేవతాకృజ్ఞతేనివాళి!
26*
కోర్కెలూరుచెలిమెకొంటెమనసుజూడ
వెన్నపూసెకఠినమన్నశిలయె!
మనిషితలచుకొన్నమదినిల్పినినుబోలు
దేవతాకృజ్ఞతేనివాళి!
27*
పట్టుబట్టిమనిషిపంచేంద్రియంబుల
గెల్వకున్నమనసునిల్వకుండు!
భువిపరోపకారబుద్ధెట్లుగనుతరు
దేవతాకృజ్ఞతేనివాళి!
28*
పట్టుదలగభక్తిపథమందుమరలించి
మచ్చికగనుదైవమందునిలిపి-
ఆత్మనెఱుకపరచనానందబ్రహ్మమే
దేవతాకృజ్ఞతేనివాళి!
29*
ఆత్మవెలుగుగాంచనరిషడ్వర్గంబు
లొంగిమనసుమాయలుడుగుదారి
దైవకృపనుగల్గుదారినీవేదిక
దేవతాకృజ్ఞతేనివాళి!
30*
పుణ్యసంచితముగపుడమిమానవజన్మ
ధన్యవాదబుద్ధిదనరెనేని-
జన్మసార్థకముగసద్గతిగనువృక్ష-
దేవతాకృజ్ఞతేనివాళి!
31*
బుద్బుదంబుజన్మబుద్ధివివేకంబు
గురునికృపనుపొందిగుట్టుదెలిసి
సాగిపోవజన్మసార్థకమగువృక్ష-
దేవతాకృజ్ఞతేనివాళి!
32*
బ్రతుకువేగమందుభ్రమవీడిమనలేక
శిథిలమైనమనసుచింతజెందు
చింతమాన్పుభక్తిచింతనధరవృక్ష-
దేవతాకృజ్ఞతేనివాళి!
34*
భువివివేకభక్తిపుష్పించుఫలియించు
మనసువృక్షమగుచుమర్మమెఱిగి
అంటువీడియాత్మవెంటసాగునుతరు-
దేవతాకృజ్ఞతేనివాళి!
35*
పరమగురులనుడులుపరిశీలనముజేసి
సాగుచుండుశిష్యసాధనములు-
ఆత్మమరలదైవమందుజేరెడుదాక
దేవతాకృజ్ఞతేనివాళి!
36*
పోవుజీవిరాదుపోవుటకేరాక
సూత్రధారియాజ్ఞపాత్రవిధిగ-
జగతినాటకంబుజరిగిపోవునుసదా
దేవతాకృజ్ఞతేనివాళి!
37*
వాస్తవంబుధన్యవాదమేప్రార్థన
ప్రేరణొసగెకృష్ణప్రేమశక్తి
గలిగెశాపముక్తిగంధర్వులకు – వృక్ష
దేవతాకృజ్ఞతేనివాళి!
38*
పుడమినమ్మిపెరిగిపుష్పించుఫలియించునీదుజాతిపాఠ్యనీతిజనులు
జాగృతంబునొంద-జన్మరహితముక్తి!
దేవతాకృజ్ఞతేనివాళి!
39*
ఫలములిచ్చుకొఱకుపలుమార్లుపూచేవు
ఉపకరించుపుణ్యతపముగాగ
సకలమొసగిజన్మసాయుజ్యమందేవు
దేవతాకృజ్ఞతేనివాళి!
40*
జన్మరహితముక్తిజాగృతముననాత్మ
జన్మజన్మలీదుజగతియందు
నరునిచివరిజన్మనలరించునీస్ఫూర్తి
దేవతాకృజ్ఞతేనివాళి!
41*
ఆత్మలోపలపరమాత్మదీపించగా
మనసుకన్నుదెఱచిమహిమగాంచు
కోర్కలుడుగముక్తికోరియుతపియించు!
దేవతాకృజ్ఞతేనివాళి!
42*
మంచియోడిచెడుగుమరిరాజ్యమేలగా
మాయికులదెజోరు-మాటపనుల-
సాటివారిమిగులసాధింత్రు, కదతరు-
దేవతాకృజ్ఞతేనివాళి!
43*
మనిషిదీటుగమరమనిషిజనాభతో
లాభమేమియాత్మలబ్ధిఇహమె!
పరమువీడిబుట్టుమరమనిషిగ – వృక్ష
దేవతాకృజ్ఞతేనివాళి!
44*
మార్పులేనిమనసుమాయలదయ్యమే
ఊహలేనిజడత-ఉలికిపాటు!
మొప్పెబ్రతుకువెనకముందాడుకర్మలన్
దేవతాకృజ్ఞతేనివాళి!
45*
కృషియులేదుఋషులకృషికావ్యములతోడ
పనియులేదుదురలవాట్ల- మనిషి-
మరణమగుటకన్నమరమన్షియేనయం!
దేవతాకృజ్ఞతేనివాళి!
46*
భువిపరోపకారబుద్ధిసుంతయులేక
ఉపకరింపకధనమపహరించు
పరులపీడనంపుబ్రతుకీడ్చుగద?వృక్ష
దేవతాకృజ్ఞతేనివాళి!
47*
పాత్రధారిననక-సూత్రధారిగనక-
నిష్క్రమించుదాకనీది-నాది
యనుతగాదలబడియలమటింతురువృక్ష
దేవతాకృజ్ఞతేనివాళి!
48*
దైవభీతిలేనిదారిలోవిజ్ఞాన
శాస్త్రనీతిదైవసామ్యమనక-
ధర్మమెట్లుజెల్లుధరలోనగనతరు
దేవతాకృజ్ఞతేనివాళి!
49*
బుద్ధిజీవిమనిషిభువిజీవకోటుల
సేమబాధ్యుడంద్రు-చెట్టునయము!
నీతిధర్మవిధులనినదింపఫలమేమి?
దేవతాకృజ్ఞతేనివాళి!
50*.
కలిమిగలుగధాతకరుణార్ధ్రహృదయుడౌ
దానఫలముబొందుతానుగాక!
లేమినేమియిచ్చుసోమరియైచను
దేవతాకృజ్ఞతేనివాళి!
51*
ప్రజలుపూజలందుఫలపుష్ఫపత్రముల్
తోయమున్నభక్తిదోవసాగు!
దైవకృపనుబొందుదారిలోనీయాది!
దేవతాకృజ్ఞతేనివాళి!
52*
ఉర్విమూడుబాళ్ళునుదకంబుతోనిండె
చెట్టుచేమలట్లెచెలగవలయు
అడవిలేకబ్రతుకులాగమాగముకదా
దేవతాకృజ్ఞతేనివాళి!
53*
నీరుమూడుబాళ్ళునిండుతిండియెమేలు
పుష్టిగలుగుచెట్టుపుట్టలున్న-
సుకృతంబుసహజప్రకృతిసిద్ధాంతము
దేవతాకృజ్ఞతేనివాళి!
54*
యాదిజేసిమ్రొక్కియాదాద్రినరసింహు
భద్రతొసగరామభద్రుగొలుతు
పరగనిన్నుదలతుబ్రతుకగాపచ్చగా
దేవతాకృజ్ఞతేనివాళి!
55*
దివ్యసృష్టియందుజీవచరాచర
నివహముండువృక్షనిధులుమెండు
సత్వమొసగుప్రకృతిసమతుల్యతనుగూర్చు!
దేవతాకృజ్ఞతేనివాళి!
56*
భూమిపెరుగదుతరులేమిభరింపదు
ప్రాణవాయులేకప్రాణిమనదు!
ప్రకృతికలుషమొందువికృతేవిళయంబు!
దేవతాకృజ్ఞతేనివాళి!
57*
అడవివలనలబ్ధినరయకనరికేయ-
బీడుగాయెడారిభీతిగొల్పు!
మంచినీరుగాలిమాటయేమిగలదు!
దేవతాకృజ్ఞతేనివాళి!
58*
మొక్కవంగు-చెట్టుమొదలూరుదాకను
కొమ్మవిరుగురెమ్మకొట్టువడును
మరలకోలుకొనునుమహవృక్షసంతతి
దేవతాకృజ్ఞతేనివాళి!
59*
కోట్లచెట్లనాడుకొద్ధిజనాభయే
దొంగకైననేడుదుంగకరువు
టీకుటాకులొందుటేకుబంగారమే
దేవతాకృజ్ఞతేనివాళి!
60*
స్వర్ణకల్పవృక్షసంతతివృక్షముల్
కొల్లలుండెనేటిపల్లెలందు
మరలచెట్లుబెంచుమర్యాదప్రభలెను!
దేవతాకృజ్ఞతేనివాళి!
61*
క్షీరజలధిమథనశ్రీలుకల్పతరువు-
కామధేనుభువికికదలివచ్చె!
దేవుడిచ్చెభువికిదివ్యకానుకచెట్టు!
హారతిగొనుహరితహారవీర!
62*
మనసుగలిగియుబహుమతులన్నిమరిచియు
చెట్టుగొట్టనేర్చిచేటుబొందె
చెట్టుకాన్కలిచ్చుగుట్టునువివరించు
హారతిగొనుహరితహారవీర!
63*
వనములేకబ్రతుకువారెవ్వరుధరజీ
వనముముడియుబడియెవనముతోడ
నాడునేడువనమెనాగరికపునాది!
హారతిగొనుహరితహారవీర!
64*
చెట్టునాశ్రయించిచెలగునాశ్రమవిద్య
జీవనమ్ముగాదెపావనమ్ము!
వేదికయ్యెచెట్టువేదబోధలకెల్ల!
హారతిగొనుహరితహారవీర!
65*
వనములేకబ్రతుకువారమేపుడమిని
ప్రాణవాయువెట్లుప్రజలకందు!
ధనముకన్నపచ్చదనముతక్కువగాదు!
హారతిగొనుహరితహారవీర!
66*
ప్రకృతిపురుషశోభపరిశుభ్రవాయువుల్
చల్లదనముకడుపుచల్లబడగ
పచ్చతోరణనిధివెచ్ఛాలుమూలికల్
హారతిగొనుహరితహారవీర!
67*
నాటికథలుదెలిసినేటిసైన్సుదలచి
చెట్లునాటగపదిపుట్లఫలము!
పరిసరాలచెట్లుప్రగతిమార్గపుమెట్లు!
హారతిగొనుహరితహారవీర!
68*
స్వచ్ఛభరతభూమిసమశీతలోష్ణముల్
పచ్చదనమువెంటవెచ్చదనము!
చెట్లునాటకున్నచెడుసమతుల్యతల్
హారతిగొనుహరితహారవీర
69*
చెట్టునరికిభువినిచేసేదినరకమే
అడవిలేకబ్రతుకుఆగమగును!
చెల్లునామరేదిచెల్లుబాటగువనరు!
హారతిగొనుహరితహారవీర!
70*
తరతరాలుగడిచెతరులపైసభలెన్నొ
జరిగెమార్పులేనిజరుగుబాటు!
జాలమేలవృక్షజాలమ్ముపెంచగా
హారతిగొనుహరితహారవీర!
71*
చెట్టుపుట్టమ్రొక్కిచేరెడునీరిచ్చి
అలికిశుభ్రపరచియవనిజనులు
కనకదుర్గతల్లికడుభక్తిమ్రొక్కేరు
హారతిగొనుహరితహారవీర!
72*
చెట్టుబెట్టిమనిషిచేయెత్తిమ్రొక్కెడు
నియమగతులు-శుభమునిచ్చుకథలు!
తోటబెంచిపండ్లతోపల్లెమురిసేను..
హారతిగొనుహరితహారవీర!
73*
నాటిచరితదారినాటించెవృక్షాలు
ప్రభుడుదీవెనొసగెబాటసారి!
సతతహరితనీడచల్లగాపయనించె!
హారతిగొనుహరితహారవీర!
74*
ఛాత్రలోకమెల్లజాతీయసేవలో
భాగముగనుచెట్లుబహుగబెంచ-
పూనుకొనిరిపుడమిపులకించిదీవింప!
హారతిగొనుహరితహారవీర!
75*
గొప్పచదువుజదివిగొప్పగాజీవించు
టొప్పుచెట్లునాటిమెప్పుబొందు
మాటక్రియనుజూపమార్గదర్శకమగు!
హారతిగొనుహరితహారవీర!
76*
చెట్టుచుట్టరికముచేతసంతృప్తియే
పెరుగుతోటిపోటిప్రేరణొసగు
నారునీరుబోయనరలోకబాధ్యతే!
హారతిగొనుహరితహారవీర!
77*
ప్రజలుపనులసాగ-ప్రభుతసాయముజేయ
యాగమట్లునాటుసాగుచెట్టు
మొక్కదశనురక్షమొదటిజయంబగు!
హారతిగొనుహరితహారవీర!
78*
చెట్టుబెట్టిప్రగతిమెట్టుజేరుటవిధి
బ్రతుకెడారిమాటభ్రమలమూట!
చేతలందువెలయుచేతనత్వపుబాట!
హారతిగొనుహరితహారవీర!
79*
ఎన్నిబ్రతికియతికిపెరిగెనెన్నిటతన
వంతుపోషణమ్మువరుససాగె!
నంతఘనతసుకృతనామసార్థక్యమౌ!
హారతిగొనుహరితహారవీర!
80*
చెట్టుబెంచుపనులుచేపట్టితదపరి
పరులకంటగట్టుప్రతినవృధయె!
మంటిపనులకైనఇంటివాడేతగున్
హారతిగొనుహరితహారవీర!
81*
నీతిధర్మబోధనిలయమేవృక్షము
వేదబోధజేయువేదికయ్యె!
ఆశ్రమాలువెలసె-అక్షయంబుగనాడు!
హారతిగొనుహరితహారవీర!
82*
రామచంద్రుడడవిరాకాసివృక్షాల-
నేరివేసిచెడువివేరుపరచి
సాత్వికముల, పర్ణశాలచుట్టునుబెంచె!
హారతిగొనుహరితహారవీర!
83*
చెడుగులంకసీతచెరసాలగనశోక
వృక్షమయ్యెధర్మరక్షయయ్యె!
దండకాటవిదురితరహితంబయ్యెను!
హారతిగొనుహరితహారవీర!
84*
బుద్ధదేవుచేతబౌద్ధంబువిలసిల్ల-
సాక్షమయ్యెబోధివృక్షమహిమ!
వేదపుటలచెట్టుపేర్లుకోకొల్లలు!
హారతిగొనుహరితహారవీర!
85*
పంచతంత్రకథలు-పలుపురాణములెల్ల
విటపినాశ్రయించివిస్తరించె!
కవులవర్ణనలకుకావ్యవస్తువులయ్యె!
హారతిగొనుహరితహారవీర!
86*
నీరుతిండినిద్రనిరతమారోగ్యము..
పంచవటియుపేరుగాంచెనాడె!
ధర్మబోధవెలసెధరణితరింపగా
హారతిగొనుహరితహారవీర!
87*
నీతిరీతిమనిషినిలువుటద్ధముచెట్టు
మంచిమనసుకుపమ! మహినిభూత
హితవెసత్యమనగపూరించెపెనులోటు!
హారతిగొనుహరితహారవీర!
88*
మేటిసామెతలందుమేదినివృక్షాలె-
మంచివానిబోల్చుమాటలందు-
చెప్పుకొంద్రుజనులుచెట్టంతమనిషనీ!
హారతిగొనుహరితహారవీర!
89*
చెట్టుచెట్టుగలిసిచెమ్మనుగలిగించు
మనిషిమనిషిగలిసిమంచిపనులు-
చేయనొకరికొకరుచేదోడువాదోడు!
హారతిగొనుహరితహారవీర!
90*
మనసులేకికన్నమ్రానుమాకేమిన్న
నీతిరహితుకన్నకోతినయము!
చేటుబుద్దికన్నచెట్టుఘనంబగు!
హారతిగొనుహరితహారవీర!
91*
కొట్టుకొలదిచిగురుకొల్లగాపనిబడి-
విరువమ్రోడుబెరుగువిరివిగాను
పూలుపండ్లుతేనెపుష్కలమ్ముగనిచ్చు!
హారతిగొనుహరితహారవీర!
92*
లక్ష్యపెట్టకున్నరక్షణతనవిధి
వంతుప్రకృతిసేవసంతువృద్ధి!
పలుపదార్థములనుపంచిపెట్టునుచెట్టు!
హారతిగొనుహరితహారవీర!
93*
చెట్టుచేమలేకకొట్టుకుపోయేటిపుడమిమేటవేయుపుట్ట-చెట్టు-
గల్గుచోటమట్టిఘనసారవంతమౌ
హారతిగొనుహరితహారవీర!
94*
చెట్లునాటుపనులుచేపట్టివ్రతముగా
సాగిపోవభవితచాలమేలు!
మనిషిమ్రానుపూజమాధవుండునుమెచ్చు!
హారతిగొనుహరితహారవీర!
95*
కొమ్మవిరిచిపట్టికోరిమహోత్సవం-
చేయనొప్పునెట్లుచెట్లునాటు-
మొక్కలూరేగింపుమోదంబుగూర్పదా?
హారతిగొనుహరితహారవీర!
96*
నారుబోసిపెంచినీరున్నరేవున
నాటవలయు- చెట్టునరికిరేని-
మొట్లునాటిచిగురుపెట్టించబహువింత!
హారతిగొనుహరితహారవీర!
97*
కల్పవృక్షజాతికడగొట్టుసంతతుల్
కలుషహరములయ్యెకలియుగాన!
లబ్ధిగూర్చుచెట్లెలక్షలజాతులు!
హారతిగొనుహరితహారవీర!
98*
చెట్టులేకవానగొట్టదుభూమిపై
పచ్చగబ్రతుకెట్లుపల్లవించు?
చెట్టుచేమమబ్బుచెమ్మగిల్లి-కురియు!
హారతిగొనుహరితహారవీర!
99*
పచ్చదనమెపత్రవెచ్చమునుభయత్ర-
ప్రాణవాయుమనకుపరగతనకు
బొగ్గుపులుసుగాలినిగ్గుదేలగమేలు!
హారతిగొనుహరితహారవీర!
100*
పత్రహరితపుష్టి-పరగసూర్యకిరణ-
జన్యయోగమొందుజగతిలబ్ధి-
పుడమిలవణజలమెగుడిచిసంపదలిడు!
హారతిగొనుహరితహారవీర!
101*(సంపూర్ణం)
చింతమిగిలెదారిచింతతోపులలేమి!
మావితోటఎండమావియయ్యె
వటముమఱ్ఱివేపపటదర్శనములయ్యె!
హారతిగొనుహరితహారవీర!
102*
ఒక్కచెట్టుగొట్టినొక్కించుపనులందు
చెట్ట్లుపదియుపెంచుచేష్టమేలు!
తప్పుదిద్ధుకొనగతాత్సారమదియేల?
హారతిగొనుహరితహారవీర!
103*
చాలగలవుమనకుసాంప్రదాయేతర
ఇంధనాలువంటయింటిచెఱుకు
వాడనేల?నితరవనరులున్నవిపెక్కు!
హారతిగొనుహరితహారవీర!
104*
రక్షజేయువిధులరాణించెకదవృక్ష
శాస్త్రప్రజ్ఞజన్మసార్థకముగ-
ఒక్కవిత్తనానమొక్కలువేవేలు!
హారతిగొనుహరితహారవీర!
105*
చరితసృష్టిజేసెహరితహారముకోట్ల-
మొక్కనాటువడియె-మొక్కవోని
ఆశయమ్ముగాగనందించవలెనీరు!
హారతిగొనుహరితహారవీర!
106*
ధరణికీర్తి-ప్రాణధాతగాఫలరుచుల్
కోరినంతయాకుకూరపుష్టి-
తీగజాతిసేవతేగమెన్నగలేము!
హారతిగొనుహరితహారవీర!
107*
బుద్ధిజీవిమనిషిభూరుహములకన్న
ప్రేమమూర్తియైనపేరుకీర్తి!
దైవప్రార్థనగకృతజ్ఞుడైమనవలె!
హారతిగొనుహరితహారవీర!
108*
శుభముసతతహరితశోభితకృషికెల్ల
వృక్షసేవలుభయరక్షశుభము!
శాంతిసుఖము-శుభముశతకాభిమానికి!
హారతిగొనుహరితహారవీర!