
వావిలాలశివనివాళి శతకము
(ఆ.వె.)
1*
శ్రీనగేశ! గౌరిచిత్తాబ్జసంచార!
మారవైరి!హర! కుమారజనక!
రాజశేఖర! నటరాజ! రాజరాజేశ్వరా
వావిలాలశివనివాళిగొనుమ!
2*
బ్రహ్మవిష్ణురూప! బ్రహ్మాండములుకుక్షి
గతములనగనెఱిగిగణపతయ్య-
చుట్టుతిరిగిమ్రొక్కిగుట్టుగాగెలుపొందె!
వావిలాలశివనివాళిగొనుమ!
3*
నెమలినెక్కితిరిగియెచ్చోటగాంచిన
నగ్రజుండెముందునడువనోడి
విషయమెఱిగిపొగడెవేమారుఅగ్రజు!
వామదేవశుభనివాళిగొనుమ!
4*
ముదముజెందెవంతమూషికగమనుండు-
తెలివిబలిమికీర్తికలిమిపొందె-
విశ్వపూజధర్మవిధులందు-తొలిపూజ!
వావిలాలశివనివాళిగొనుమ!
5*
పెద్ధబుద్ధిగలిగిఇద్దరుకొమరులు-
దేవతలనుగాచితేజమొప్ప-
దుష్టదానవాళిదునిమిరక్షకులైరి!
వావిలాలశివనివాళిగొనుమ!
6*
ఆదిదంపతులుగనాదర్శసంసార
సరణిజూపిపుడమిసంస్కరింప-
నయముజయముగూర్చునాగరికతయయ్యె!
వావిలాలశివనివాళిగొనుమ!
7*
తండ్రియనగశివుడెతల్లిపార్వతిపుత్రు
లిద్దరుతమకీర్తివృద్ధిజేసి-
మహినిసామ్యతగనుమార్గదర్శకులైరి!
వావిలాలశివనివాళిగొనుమ!
8*
దిక్కుమ్రొక్కునీవెదీనదయాళువై
అడిగినట్టివరములందజేసి-
బోల- శంకరునిగపొందితివిఖ్యాతి!
వావిలాలశివనివాళిగొనుమ!
9*
వరములీయతమరువధియింపహరిశత్రు-
గర్వముడుగజగతిపర్వమయ్యె!
మహినికలుషబుద్ధిమారదేమాత్రము!
వావిలాలశివనివాళిగొనుమ!
10*
ధరణిసాగుదేవదానయుద్ధంబు-
మంచిచెడుగమనిషిమనసునందు-
జరుగుచుండునంద్రుజగతినెపుడు!
వావిలాలశివనివాళిగొనుమ!
11*
శ్రీయుమేశ!భక్తచిత్తాబ్జసంచార!
సకలలోకకుక్షి – సర్వజీవ-
జీవనపరిపాల! దీవించికాపాడు!
వావిలాలశివనివాళిగొనుమ!
12*
చివరిదాకనీవెజీవిబంధువుసదా-
నందగౌరినాథ! నాదబ్రహ్మ!
డమరుకాక్షరములెయమరబాషలుకదా!
వావిలాలశివనివాళిగొనుమ!
13*
నీదుమరుపుగలుగనిలుచునాదేహంబు
చూపుదప్పనాత్మనోపగలదె!
ఆత్మదెలియగపరమాత్మనీగుడియిదే!
వావిలాలశివనివాళిగొనుమ!
14*
ఎఱుకగలుగనాత్మనెరుగసౌలభ్యమే
ఆత్మనెరుగతత్వమంతుజిక్కు!
మనసునిలుచుదాకమర్మంబుబోధించు!
వావిలాలశివనివాళిగొనుమ! 25*
15*
మిగతపనులనన్నుమిగులబాధించేవు!
చిన్ననాడెభక్తిచిగురువేయు
దారినడిపిమరొకదారిసాగింతువా?
వావిలాలశివనివాళిగొనుమ!
16*
కుడికిమ్రొక్కియెడమగుడినినుసేవించి
బడికివోయివచ్చిభజనసాగి-
గడిపియుంటిజరనుగడపనీభారమే!
వావిలాలశివనివాళిగొనుమ!
17*
సర్ఫమున్నదన్నసాహసించియునభి
షేకజలముదెచ్చిసేవలందు-
మసలిపెర్గితిననుమరచుటన్యాయమా?
వావిలాలశివనివాళిగొనుమ!
18*
ఎక్కడుంటెనేమి?దిక్కునీవనినమ్మి-
కొలిచిధీమవెంటకోర్కెలడిగి
పొందియుంటినట్లెబ్రోవగామ్రొక్కెద!
వావిలాలశివనివాళిగొనుమ!
19*
నీవులేనిజీవినినుగాననితలము-
గలద! సకలభాగ్యగరిమనీవె!
ఇపుడెగంటినిన్నుఈచిత్రపటమున!
వావిలాలశివనివాళిగొనుమ!
20*
వెనుకనుండితట్టివెన్నంటునీశక్తి
వెలుగుతిరిగిచూడతొలుగుననియు-
భయమెముందటడుగుబలమునీదేసుమా!
వావిలాలశివనివాళిగొనుమ!
21*
విడువు-మన్నపామువిడకబుస్సనిలేచు!
పట్టుమన్నకప్పపండ్లునూరు!
ఊరకున్నబేలనూరెల్లగొట్టేరు!
వావిలాలశివనివాళిగొనుమ!
22*
ఆగిపోయెపెద్దఆర్జనవిద్యలు!
దూరవిద్యనాడుదుర్లభమ్ము!
బాహ్యఛాత్రవిద్యబహుయాతనగసాగె!
వావిలాలశివనివాళిగొనుమ!
23*
ఫలముదక్కెననిరిపారంబుముట్టిన-
ముడిచదువులకొలువుమురిపెమేది?
శిగయునింపికొలువ-శిక్షణావశ్యకం!
వావిలాలశివనివాళిగొనుమ!
24*
బ్రతుకలేకతుదకుబడిపంతులనిబ్రత్క
నేర్వుమనిరిసరియె! నేమిమిగిలె!
పెద్దరికముతోనెపిత్రార్జితముడొల్లె!
వావిలాలశివనివాళిగొనుమ!
25*
ఉండిలేమినీదుఅండదండలుపర-
ఊరియాదరణలుఉప్పువేసి
పొత్తుగూడుబ్రతుకుపొసగించిబ్రతికించె!
వావిలాలశివనివాళిగొనుమ!
25*
తోటివారితోనెతొలగెనైశ్వర్వము-
మాటలయజమానిదాటివిడిచె!
తరచపేడనిసుకతక్కెట్లెఇటునటు!
వావిలాలశివనివాళిగొనుమ!
26*
మల్చుకుంటినాల్కమరికూర్మమైబ్రత్కు-
ముడుచుకొంటి-సంతుమూతిముడువ
చేతులెత్తితినినుచేయెత్తిమ్రొక్కితి!
వావిలాలశివనివాళిగొనుమ!
27*
అదుపుపేరసాగెనసమర్థజీవనం
పొదుపుపేరయెదిగియొదగమనచు-
బేలబిరుదమిచ్చిప్రేలిరిమాయకుల్
వావిలాలశివనివాళిగొనుమ!
30*
ఐననేమిభక్తివైనమెర్గినతెల్గు-
బాషగురువునైతిపట్టభద్ర-
విషయజానపదపువిద్యఫిలాసఫీ!
వావిలాలశివనివాళిగొనుమ!
31*
అసలుహానినరగృహచ్చిధ్రముల్భువి
నాడునేడురేపునకముకాల-
బ్రతుకుదెరువుచరితబహుధచర్చింపగ!
వావిలాలశివనివాళిగొనుమ!
32*
చిన్ననాటిసుఖముచెరిచెజీవనబాట
నోర్వలేనితనపునొవ్వుగూర్చె!
పిదపవల్లెవేతప్రీతిపాత్రంబయ్యె!
వావిలాలశివనివాళిగొనుమ!
33*
తెల్పవైతివీవుతేలికమరుపని
నడుపవైతివయ్య-నయపుబాట!
పారతంత్ర్యమందుభక్తెట్లుసాగునో
వావిలాలశివనివాళిగొనుమ!
34*
పిరికివాడెతమకుప్రియభక్తుడాయేమి
నష్టజాతకుజేసినమసుకవిత
పొందితీవుహితవుపూరింతువెప్పుడు!
వావిలాలశివనివాళిగొనుమ!
35*
ఏకముగనుకష్టమేకరవుబెట్టితీ-
ఏబదిశతకాలనెలమినిచ్చి-
తత్ఫలంబుతమకెతగసమర్పణజేతు!
వావిలాలశివనివాళిగొనుమ!
36*
మరవనునినునుత్తమాటవరుసకైన
ఆటకోయిలతనమునైనవిడువ!
సతతహరితభక్తిసాగింతుహరిహరా!
వావిలాలశివనివాళిగొనుమ!
37*
తనువుదూరమైతెమనసుదగ్గరభక్తి
కవితగుడినినిన్నుగాంచిమ్రొక్కి
తగినపద్యమందెతాత్పర్యమూహింతు!
వావిలాలశివనివాళిగొనుమ!
38*
అవనికనులజూచియనుకొన్నదొక్కటీ
అయినదొక్కటయ్యెఅసలుబ్రతుకు
పగటికలయె! నిజముపరగనీలోకమే
వావిలాలశివనివాళిగొనుమ!
39*
పండ్లుదింటివివిధఫలవృక్షములనెక్కి
యాడుకొంటినిన్నెపాడుకొంటి
పల్లెనుండినన్నువెల్లగొట్టకుమంటి!
వావిలాలశివనివాళిగొనుమ!
40*
అన్నిజేసికల్తినాగముజేతువా!
చల్లజేసివెన్నచాలదీసి-
నేతిదీపకాంతినినుమ్రొక్కవీలేది?
వావిలాలశివనివాళిగొనుమ!
41*
వెలయుగుళ్ళురెండువెల్గెనుప్రాకార-
మందుతూరుపుముఖమైనవగుచు!
నడుమభక్తజనమునమ్రప్రదక్షణల్
వావిలాలశివనివాళిగొనుమ!
42*
రెండుకంబములనుజెండాలుగంటలు
ప్రీతిగొల్పసాగుపిల్లలాట
సేదదీరతీర్థసేవప్రసాదముల్
వావిలాలశివనివాళిగొనుమ!
43*
దేవనంబివారుతిరుమలవారును
బ్రాహ్మణగురువరులు! ప్రజలకోర్కె-
ఊరుపెద్దలుసమకూర్చుకైంకర్యముల్
వావిలాలశివనివాళిగొనుమ!
44*
తరతరాలప్రజలదానతపంబుగా
సాగెపూజవృద్ధిసాగెయజ్ఞ-
యాగబూనికలునుయత్నసత్ఫలములై
వావిలాలశివనివాళిగొనుమ!
45*
కల్లకపటమెచట?కలనైనచొరబడు
మాటలేనినాటిమహితభక్తి-
కనులగాంచుభాగ్యగరిమనాదేసుమా!
వావిలాలశివనివాళిగొనుమ!
46*
మొదటతేజయుతమెమోక్షపుర్షార్థమై
సాగుధర్మకర్తసఫలయశము!
నేడుమరలభక్తినెదుగుచుండిరిజనుల్
వావిలాలశివనివాళిగొనుమ!
47*
ధాతలున్నసాగుదరిదాపునభివృద్ధి
దానగుణమువెంటధరశుబంబు!
దానతపమెకలినిదాటించుచుక్కాని!
వావిలాలశివనివాళిగొనుమ!
48*
గొప్పయత్సవముగ గోకులాష్టమిసేవ!
పర్వదినపుపూజపలురకాల
దీక్షనిష్ఠతైలదీపాళిశివరాత్రి!
వావిలాలశివనివాళిగొనుమ!
49*
భక్తికొంచమైనపలముఘనంబుగా
నీకటాక్షవీక్షనిఖిలశుభము!
బాల్యయాదినేటిబ్రహ్మమోదపునాది!
వావిలాలశివనివాళిగొనుమ!
50*
వరముగాదెనాటివస్త్రకార్కానయు
ప్రభుతబడియునిష్ఠపరులయునికి
వివధములనులోకవిజ్ఞానమందించె!
వావిలాలశివనివాళిగొనుమ!
51*
తెలుగ,వెలమ,రెడ్లుదేశముఖ్యాదులు
వృత్తిపనులవారిచిత్తభక్తి!
శ్రమయుదానములనుసాగెసేవోత్సవం!
వావిలాలశివనివాళిగొనుమ!
52*
పండుగుదినమందుపరగనూరేగింపు
గణపతోత్సవాలఘనతభజన-
భ్రాంతిదొలగమదియెశాంతినికేతనం!
వావిలాలశివనివాళిగొనుమ!
53*
పనిగమారెనేపంతులులేనిది-
మనస-వాచ- జనులమనుగడెసగ-
నిన్నుగొలిచెతండ్రినినదించెనీసూక్తి!
వావిలాలశివనివాళిగొనుమ!
54*
ఏదిమిగిలెచరిత-ఏకశిలానగర-
మేది?కాకతీయమేధశిల్ప-
రచనగాక-సాక్షిరామప్పగుడికీర్తి!
వావిలాలశివనివాళిగొనుమ!
55*
శ్రీసతీశ! జీవిజీవిననీయున్కి-
ముదలలేకచీమకదలదంద్రు-
పుణ్యధనమెమాదిపుడమినీసొమ్మగు!
వావిలాలశివనివాళిగొనుమ!
56*
కాశిచుట్టుగుడివికాసంబుబోలియు
దక్షణాదికాశిదనరువేము
లాడచుట్టునృత్యలాస్యంబునీకృప!
వావిలాలశివనివాళిగొనుమ!
57*
కాకతీయప్రభులకరుణతిక్కనచేత
భారతాంకితంబుపరగగొనిన
ఆదిదేవశంభుహరిహరనాథేశ!
వావిలాలశివనివాళిగొనుమ!
58*
శంభుదేవశరణు! సాంబదిగంబర!
అంబుధీషుధిమముఆదుకొనుము
సతతహరితసస్యశామలముగబ్రోవు!
వావిలాలశివనివాళిగొనుమ!
59*
నిష్ఠనొక్కప్రొద్దునీరాత్రిశివరాత్రి
తైలదీపకాంతిదనరుగుడుల-
దివ్యభక్తిభజనదీపోత్సవముజర్గు!
వావిలాలశివనివాళిగొనుమ!
60*
వామభాగమందువామదేవుడనీవు
కుడినివాసుదేవగుడియువెలయ-
చిత్తభక్తిఫలముశివకేశవార్పితం!
వావిలాలశివనివాళిగొనుమ!
61*
భూతనాథ! చితివిభూతినేమేచ్చేవు!
అష్టసిరులుమాకునందజేసి-
చివరిదశనుమిగిలిజీవాత్మనంపేవు!
వావిలాలశివనివాళిగొనుమ!
62*
రాకపోకమ్రోగురాజేశనీనామ
భిక్షసాగుబ్రతుకుబెదురుమాని
దిక్కులేనివేళదిక్కైయ్యిబ్రచేవు!
వావిలాలశివనివాళిగొనుమ!
63*
సుకృతమునుగూర్చుసూత్రధారివినీవు
దుష్కృతంబులణచుధూర్జటివని-
మదినినమ్మిభక్తిమార్గానజీవింత్రు!
వావిలాలశివనివాళిగొనుమ!
64*
నీదునీతిధర్మనియతిగీతార్థమై
దేవిగీతయయ్యె! దేవదేవ!
వెడలెకృష్ణగీతవిశ్వరూపమునెత్తె!
వావిలాలశివనివాళిగొనుమ!
65*
మేరుధనువుగాగమేటినారాయణా
స్త్రంబునెక్కువెట్టిశత్రుత్రిపుర
ములనుగూల్చిలోకములనుగాచినదేవ!
వావిలాలశివనివాళిగొనుమ!
66*
దురితరాక్షసాళిదునుమాడరౌద్రివి
సజ్జనాళిబ్రోచుశంకరుడవు!
పాపికైనముక్తిపదమునందించేవు!
వావిలాలశివనివాళిగొనుమ!
67*
సేమమొసగునీదుశివరాత్రిదర్శనం
కల్మశహరమగుకలియుగాన
నీదుభక్తజనులనివహంబుతరియించు!
వావిలాలశివనివాళిగొనుమ!
68*
పాపులైనతుదకుపరివర్తనులుగాగ
ముక్తిగనిరిభక్తిమూలకముగ
నీపురాణమహిమనినదించుకథలందు!
వావిలాలశివనివాళిగొనుమ!
69*
అవతరించి-ముగ్గురాచార్యులుగభక్తి
నుద్ధరించిజనులనూరడించి-
భక్తినిష్టదైవపథముసాగించిన
వావిలాలశివనివాళిగొనుమ!
70*
తరతరాలభక్తితరచకృతజ్ఞతే
ప్రార్థనముగసాగెపథములందు
పేరువేరుదైవప్రేమశక్తియునొకటే!
వావిలాలశివనివాళిగొనుమ!
71*
స్త్రోత్రపాఠములనుసోమయాజులుపురో
హితులభక్తిపూజసతముసాగ
తీరుతెన్నువృద్ధితిర్మలవారిది!
వావిలాలశివనివాళిగొనుమ!
72*
ఋష్యశృంగకొలువురూపింపగశతఘ
టాభిషేకములుతటాకపూర్ణ-
వర్షపాతలబ్ధిహర్షదాయకజలం!
వావిలాలశివనివాళిగొనుమ!
73*
ఊరుమేలుకొఱకెనూత్నధ్వజస్తంబ
ముద్ధరింపుసేవశ్రద్ధభక్తి
విధులసాగుదీక్షవివిధకైంకర్యముల్
వావిలాలశివనివాళిగొనుమ!
74*
కష్టజీవులెదిగికాంచిరియభివృద్ధి
బయటబ్రతుకుదెరువుబలపడంగ
కన్నయూరియాదిఉన్నవూరునసేవ!
వావిలాలశివనివాళిగొనుమ!
75*
నరులసేవయేగనటరాజనీసేవ!
భువిపరోపకారబుద్ధిశుద్ధి
తమరియాజ్ఞసాగుతరతరాలవిధిగ!
వావిలాలశివనివాళిగొనుమ!
76*
దానమెకలిమాయదాటించునావగా
నావికుడవునీవెనాగభూష!
పూర్ణసిద్ధిగూర్చుపుణ్యమెచుక్కాని!
వావిలాలశివనివాళిగొనుమ!
77*
చితియుబూడిదన్నశివభక్తులకుశుభం!
సిరులెశవభక్తిచిత్తరుజలు!
సిరివిభూతిపండెచివరకుమిగిలేది
వావిలాలశివనివాళిగొనుమ!
78*
చేయిజరచిభజనచేసియునోరార
నీదువేయిపేర్లనెలమిమ్రొక్కి
ధన్యవాదవందనాలుసమర్పింతు!
వావిలాలశివనివాళిగొనుమ!
79*
పరమపూజ్యచరిత! పరమేశ్వరాహరా!
తేగమూర్తివిషమెతీపియనుచు!
కంఠమందుజేర్చికాపాడుశాంతినీ!
వావిలాలశివనివాళిగొనుమ!
80*
చిన్నకష్టమునకెచిటపటలాడేము!
తల్లియొప్పెవిషముదాగువేళ-
ఏకదృష్టి-మీకులోకకళ్యాణమే!
వావిలాలశివనివాళిగొనుమ!
81*
క్షేమసహజముసమశీతోష్ణమండలం!
పుడమిభారతమాతపుణ్యభూమి!
మూడుమార్లుతానమొనరింపనదినీళ్ళు!
వావిలాలశివనివాళిగొనుమ!
81*
పుడమివృక్షసిరులుపుష్కలముగజలం
పలురకాలపండ్లుపౌష్టికములు-
సేద్యవైద్యసేమసేంద్రియపంటలున్
వావిలాలశివనివాళిగొనుమ!
82*
ఎవరితిండివారికేర్పరించేబ్రహ్మ-
సమతమమతమతముసమ్మతంబు
వెంటనిష్టబ్రతుకువేదికవేదమై!
వావిలాలశివనివాళిగొనుమ!
83*
వెలయుధర్మవిధులువేదోక్తసంపదల్
పరిధిలోనెమానవత్వదీప్తి!
గాకకలినికల్తికలుషరసాయనం!
వావిలాలశివనివాళిగొనుమ!
84*
నరసురాసురలునయమొందగాభక్తి
నిన్నుగొలిచికీర్తినెదుగుచుంద్రు!
అదుపుదప్పధర్మహానికారకశిక్ష!
వావిలాలశివనివాళిగొనుమ!
85*
గతపుయుగపుజనులగడనగాదుష్కర్మ
పిదపజన్మననుభవించిజనిరి!
కలుగు – శిక్షలిపుడెకలిజన్మదుడుకులన్
వావిలాలశివనివాళిగొనుమ!
86*
మంచిసానుకూలమందించుప్రతికూల
మగునుచెడ్డగానమంచిబెంచి-
ప్రేమశక్తినీదుప్రేరణబొందేము!
వావిలాలశివనివాళిగొనుమ!
87*
బోధనీతిక్రియనుబోల్చిసాగించగా
నీదుయాజ్ఞకలినినీతిదప్పి
నడువనీదుభక్తినంటదునడవడి!
వావిలాలశివనివాళిగొనుమ!
88*
ధనముదైవమంచుతపనచెందకకీర్తి-
ధనమునీదుదీప్తిదనరుననెడి-
సత్యమెఱుగమేలుశాశ్వతసుఖశాంతి!
వావిలాలశివనివాళిగొనుమ!
89*
ధనపునిల్వనిడగతత్కాలమేవిద్య
నేర్పిధనముపొందునేర్పుగూర్ప-
జాలుతరతరాలుజాగృతమగువీలు!
వావిలాలశివనివాళిగొనుమ!
90*
సంపదేలమంచిసంస్కారమిడమేలు
పెద్దవలెనుపెంచివృద్ధదశను
చిన్నవారితోడచిందేయవీలగు!
వావిలాలశివనివాళిగొనుమ!
91*
పరమశివుడనీదుప్రాపుదాపునవిశ్వ
పండితాళిపుణ్యబాటలెరిగి-
యెఱుకగల్గిమనెడుఏర్పాట్లుగావించె!
వావిలాలశివనివాళిగొనుమ!
92*
పరమపూజ్యపాదపరమతసహనంబు
మాకునేర్పియాత్మమర్మగతుల
నైకమత్యభావమందించిబ్రోచితో
వావిలాలశివనివాళిగొనుమ!
93*
ఆత్మపుట్టుచుండునవనినెచ్చోటైన
తనువువస్త్రమట్లుదాల్చివిడిచి
తిరిగిజగతిపుణ్యతీర్థయాత్రలుజేయు!
వావిలాలశివనివాళిగొనుమ!
94*
కలుగుదోవలెల్లకైలాసగిరివైపు
సాగునంద్రుజగతిచరితకరులు!
తరచజన్మదరలతనవారెపరవారు!
వావిలాలశివనివాళిగొనుమ!
95*
గౌరిశుభములిచ్చుగంగమ్మదీవించు
ప్రకృతిమాతగొడుగుబట్టిబ్రోచు!
నీదులయముదాకనిర్భయమీసృష్టి
వావిలాలశివనివాళిగొనుమ!
96*
ఎవరికెవరుబ్రతుకునెడబాటుసహజము
ఎక్కడున్ననీదుచక్కిభక్తి
బంధముండుజనులబట్టినొక్కటగట్టు!
వావిలాలశివనివాళిగొనుమ!
97*
దక్షయజ్ఞవేదిదరినందరునుమ్రొక్కి
పసులమనగనీవుపశుపతిగను
పేరుగాంచితివటప్రేమశక్తినిబంచి!
వావిలాలశివనివాళిగొనుమ!
98*
పాండుమధ్యమునకుపాశుపతమునిచ్చి
పాపులెదగకుండపరగబ్రోచి
లయముదాకబ్రతుకలాలింపుబాడితో
వావిలాలశివనివాళిగొనుమ!
99*
అలరుశాంతిదేశమణ్వస్త్రధారిగ
స్వార్థపరులుజడువసాగు – సకల
రాజ్యమైక్యసమితిరాజిల్లుశాంతితో
వావిలాలశివనివాళిగొనుమ!
100*
బ్రతుకవలయునిండుబ్రతుకునీయానతి-
అతుకవలయుభక్తిహితవుమిగత-
అతుకులన్నివీడనానతిచ్చెనుగీత!
వావిలాలశివనివాళిగొనుమ!
101*
రామయననిదెపుడురాగమెత్తగరాదు
వ్రాతప్రతులరాఘవాయటంచు-
పరగజానపదులుప్రార్థింత్రుపాటలన్
వావిలాలశివనివాళిగొనుమ!
102*
ఊరువాడమ్రోగుఉయ్యాలపాటలు
బ్రతుకునిచ్చుయమ్మపార్వతిగను
రాగమెత్తిపాడరంజిల్లునీగుడి!
వావిలాలశివనివాళిగొనుమ!
103*
పాటలందునీదుపలుపురాణాద్భుత
నీతిధర్మవిధులునివ్వటిలగ-
భక్తిపూరితముగభాసిల్లునీగుడిన్
వావిలాలశివనివాళిగొనుమ!
104*
శంభుదేవరనినుశతకానవర్ణించి
చెప్పబూనికృతినియప్పజెప్పి
బయటబడితిమనసుభారంబుదీరగా
వావిలాలశివనివాళిగొనుమ!
105*
కోరితప్పుదిద్ధుకొనిచదువుకొనగ-
సుముఖులైరిభజనసమితిగురులు-
అంకితంబుగొనుముఆరాధ్యదైవమా!
వావిలాలశివనివాళిగొనుమ!
106*
శివుడ!వెంకటయ్యసీతమ్మమాతల్లి
గాంచిరినినుగొల్చిఘనచరిత్ర!
వారిసుతుడభక్తపంతులుసత్యనన్
వావిలాలశివనివాళిగొనుమ!
107*
కోరికోరియలసికోర్కెలుడిగెనీవె
గూర్చవలయుమిగతకూర్పుభవిత
స్వాస్థ్యమొప్పుసుఖముశాంతిజీవనవిధి!
వావిలాలశివనివాళిగొనుమ!
108*
మంగళంబునీదుమహిమాన్వితములకు!
మంగళంబుభజనసంగములకు!
మంగళంబుశతకమననాత్మకులకెల్ల!
వావిలాలశివనివాళిగొనుమ!