
శ్రీ వేములవాడ రామశంభొ శతకము
(సీసార్ధములు)
1*
శ్రీశైల నిలయేశ! ఈశ దయాపాత్ర
ధీభక్తి గుణ హిత! దివ్యగురుడ!
వైశిష్ట్య వైష్ణవ వరద! రామానుజ
మతసామ్య సద్బోధ మార్గ చరిత!
(గీ.)
సకల కులవైష్ణ వాన్వయ సమతయోగి!
రాజ వేములాడేశ! రామశంభు!
2*
బసవ మతంబు శైవాచారవైశిష్ట్య
పథముచాటగ మంచి ఫలముదొరికె?
నిమ్నకులగురుల నీతిదాయక బోధ
ఐక్యతెసగె జాతి సఖ్యతెసగె!
(గీ.)
దేశ శాంతి దీపమువెల్గి తేజరిల్లె!
రాజ వేములాడేశ! రామశంభు!
3*
యోచన బహుల ప్రయోజనంబుగ సాగె
అతికెను మది పరమాత్మ సిద్ధి!
వీరత్వమున మతం-వీలుగానిది యయ్యె
జీవిని శివుడుండు ఠీవి మెఱసె!
(గీ.)
ఈక్ష్య భక్తసంరక్ణణ-ఇహపు శాంతి!
రాజ వేములాడేశ! రామశంభు!
4*
రామశివ గీతివిరాజిల్లె జనపద
పల్లెపాటలతోట పల్లవించె!
త్యాగమార్గంబుగా సాగెను నీభిక్ష
రాజుపేదలకైన తేజమొసగె!
(గీ.)
అందరొకటె! సద్భక్తి చందగతుల!
రాజ వేములాడేశ! రామశంభు!
5*
శిష్టయవ్వారము స్థిరచిత్తమగు భక్తి
గ్రామదేవత భక్తి గలుమ వెలుగు!
నిశ్చల తత్వంబు నిచ్చు జీవనముక్తి
దానికోసమె భక్తి దారులన్ని!
(గీ.)
మంచికోసమె గల్పించు మనుజ జన్మ!
రాజ వేములాడేశ! రామశంభు!
6*
ప్రతియుపకృతి చేత పరమపుణ్యము గల్గు-
పరనిందలీసుల పాపలబ్ధి!
అక్షర కోట్లుగా అభిమానులుండరా-
కృతులు వెలువరించు కోర్కె చేద?
(గీ.)
ఏల నైరాశ్య నరులకీ ఏవగింపు!
రాజ వేములాడేశ! రామశంభు!
7*
అన్ని జేరియు పూర్ణమయ్యె సాహితి మూట-
కొన్నిటిన్ ద్రోయగా కొఱతగలుగు!
దైవాజ్ఞ చేకృతుల్ దాపుజేర్చిన చాలు-
ఇహపు తాపములుడ్గి హితవు గలుగు!
(గీ.)
భక్తి బలవంతముగరుద్దు బాటగాదు!
రాజ వేములాడేశ! రామశంభు!
8*
మారలేదు నరుడు మాయకరోనతో
ప్రకృతి కాలుష్య ప్రభావమణిగె!
మాటబాటలభద్రమగు కట్టడియుగల్గె-
వ్యక్తిగత శ్రద్ధ నియమాళి వాక్కు మెఱసె!
(గీ.)
లోక కల్యాణ కారకాలోచనముగ-
రాజ వేములాడేశ! రామశంభు!
9*
చిత్త శుద్ధిని తత్వ వేత్తమాటాలించి-
నీనిరాడంబర నియతి మెదిలి-
విత్తశుద్ధిని దాన విధుల సంభావించి-
మెదలిన జాతికి మేలుగలుగు!
(గీ.)
మందు జాగ్రత్త జీవితమందు సుఖము!
రాజ వేములాడేశ! రామశంభు!
10*
పంచదారను వీడి పంచజేరిన చీమ
చెఱుకు పిప్పినింపు జెందు పగిది-
సుఖలాలస చేత సులభక్తిని వీడి
నరజాతి తత్కాల నయము నెంచు!
(గీ.)
నాద బ్రహ్మమా! నీగీత నయము జయము!
రాజ వేములాడేశ! రామశంభు!
11*
శ్రీద!హరి హృదయ! నరుల-చిత్త వృత్తి
సఖ్య భక్తియోగంబున సంస్కరించి
సమతయోగాన దేల్చిన సత్యదేవ!
రాజ వేములవాడేశ! రామశంభు!
12*
గీత వెలయించి ధర్మముల్ చేతనముల
సర్వ సమతసమన్వయ సారమలది-
జగతి రక్షగురుండవై చెలగి నావు!
రాజ వేములవాడేశ! రామశంభు!
13*
బాల్యమున కంసుదునుమాడ పల్లె జేరి
చెరను విడిపించి తలిదండ్రి సేమమొసగు
సకల మధురాధిపతివి, కంసారి శరణు!
రాజ వేములవాడేశ! రామశంభు!
14*
వైరసులవంటి రాకాశి వైరవృత్తి
నరులగానని పద్ధతి దురిత వితతి!
వంచి సంరక్ష జేసిన వాసు దేవ!
రాజ వేములవాడేశ! రామశంభు!
15*
నిగ్గు దేలెను క్రమముగా నీదులీల-
నుగ్గు నుగ్గు-బకశకట బుగ్గి, దనుజ-
గర్వంబు ఖర్వమే గరుడ గమన!
రాజ వేములవాడేశ! రామశంభు!
16*
కోతబడె ధర్మ మని గీత కొత్త నేమి
చక్ర కవఛంబుగాజేసి వక్ర బుద్ధి-
దులిపి వేసిన శ్రీహరి దురితనాశ!
రాజ వేములవాడేశ! రామశంభు!
17*
పాతబడె నీతి యవినీతి పలుకరించె
ధర సనాతన ధర్మంబు దారి మరలె!
సంస్కరింపగ తరలుమో సాధు హృదయ!
రాజ వేములవాడేశ! రామశంభు!
18*
పాతరోతాయె నవవింత పరవశించె!
కరొన పిప్పాయె జగమంత కలతనొందె!
మందుటీకాలసమకూర్చి మహిని బ్రోవు-
రాజ వేములవాడేశ!రామశంభు!
19*
రాతి కట్టడే కోట పురాతనమున
రమ్య రాణింపు బతుకు పురాణ నీతి-
ఇంపు సొంపుగ సమనాయ సంపదొసగె!
రాజ వేములవాడేశ! రామశంభు!
20*
కట్టడులు మీరి చెలగాట కావరమున
పుట్టలనుగెల్కి విషకణ పుట్లు గుప్పి-
సర్వమానవహననంబు సాగె సామి!
రాజ వేములవాడేశ! రామశంభు!
11*
శ్రీద!హరి హృదయ! నరుల-చిత్త వృత్తి
సఖ్య భక్తియోగంబున సంస్కరించి
సమతయోగాన దేల్చిన సత్యదేవ!
రాజ వేములవాడేశ! రామశంభు!
12*
గీత వెలయించి ధర్మముల్ చేతనముల
సర్వ సమతసమన్వయ సారమలది-
జగతి రక్షగురుండవై చెలగి నావు!
రాజ వేములవాడేశ! రామశంభు!
13*
బాల్యమున కంసుదునుమాడ పల్లె జేరి
చెరను విడిపించి తలిదండ్రి సేమమొసగు
సకల మధురాధిపతివి, కంసారి శరణు!
రాజ వేములవాడేశ! రామశంభు!
14*
వైరసులవంటి రాకాశి వైరవృత్తి
నరులగానని పద్ధతి దురిత వితతి!
వంచి సంరక్ష జేసిన వాసు దేవ!
రాజ వేములవాడేశ! రామశంభు!
15*
నిగ్గు దేలెను క్రమముగా నీదులీల-
నుగ్గు నుగ్గు-బకశకట బుగ్గి, దనుజ-
గర్వంబు ఖర్వమే గరుడ గమన!
రాజ వేములవాడేశ! రామశంభు!
16*
కోతబడె ధర్మ మని గీత కొత్త నేమి
చక్ర కవఛంబుగాజేసి వక్ర బుద్ధి-
దులిపి వేసిన శ్రీహరి దురితనాశ!
రాజ వేములవాడేశ! రామశంభు!
17*
పాతబడె నీతి యవినీతి పలుకరించె
ధర సనాతన ధర్మంబు దారి మరలె!
సంస్కరింపగ తరలుమో సాధు హృదయ!
రాజ వేములవాడేశ! రామశంభు!
18*
పాతరోతాయె నవవింత పరవశించె!
కరొన పిప్పాయె జగమంత కలతనొందె!
మందుటీకాలసమకూర్చి మహిని బ్రోవు-
రాజ వేములవాడేశ!రామశంభు!
19*
రాతి కట్టడే కోట పురాతనమున
రమ్య రాణింపు బతుకు పురాణ నీతి-
ఇంపు సొంపుగ సమనాయ సంపదొసగె!
రాజ వేములవాడేశ! రామశంభు!
20*
కట్టడులు మీరి చెలగాట కావరమున
పుట్టలనుగెల్కి విషకణ పుట్లు గుప్పి-
సర్వమానవహననంబు సాగె సామి!
రాజ వేములవాడేశ! రామశంభు!
31*సీ.
కర్కకాయ వగరు కడిగిన బోవదు!
ఎక్కువగుచు- గొంతుగుక్కపట్టు!
మలెవడు వెసనాలు మరచుట సాధ్యమా?
గుండెపొరలదాగి కొండలగును!
(గీ)
తరుగు నాయువు-తనుతళ్కు తరలి పోవు!
రాజ వేములవాడేశ! రామ శంభు!
____________________________________
32*సీ.
ఆత్మవిడగ దేహ అతుకుదొల్గును జన్మ
జననమరణపాత్ర జగతి కేళి!
తరతర వారసత్వ తత్వతాల్మియె తృప్తి!-
పుణ్యఫలమె ముక్తి పూర్వకంబు!
(గీ)
మంచియే పుణ్యమై పాపమగును చెడుగు!
రాజ వేములవాడేశ! రామశంభు!
___________________________________
33*సీ. దూషణ-భూషణ- దూరజీవనరక్ష-
వైరసు కణజాల వైరిఘటన!
తరతరాలయాస్తి తాతతాలిమి తృప్తి –
పుణికి పుచ్చుకొనగ పూత చరిత!
(గీ)
తల్లి మూలకు బడిననే పిల్ల గెలుచు!
రాజ వేములవాడేశ! రామశంభు!
____________________________________
34*సీ.
ఉన్నదీ ఊపిరి ఉదయాన మెలకువ-
బతికియుంటిమింక భ్రమలు బాపు!
వర్తమానమునందె వర్తన పదివేలు
గతముమరలరాదు – భవితలేదు!
(గీ)
ఇంపు జీవితం- ఈక్షణ సంపదగును-
రాజ వేములవాడేశ! రామశంభు!
__________________________________
35*సీ.
మనసునిలుపు శాంతి తనువురక్షణ రేఖ
సంయమన సుఖమె సకల శాంతి!
దోషరహిత గుణ దోవ హితముగూర్ప-
భువిపరోపాకార బుద్ధి వృద్ధి!
(గీ)
ఈవిచే పుణ్య ఫలపక్వమింపు గూర్చు!
రాజ వేములవాడేశ! రామశంభు!
____________________________________
36*సీ.
వాద వివాదాల-వలననైక్యతజెడు-
సానుకూలప్రేమ శక్తి తోడ-
అందరిమేలునే ఆశించి పనిజేయ
అందును సత్ఫలవిందు ముందు!
(గీ)
సాగు నైతిక జీవనం-చాలమేలు!
రాజ వేములవాడేశ! రామశంభు!
___________________________________
37*సీ.
వినక చెడినచోట ఈసు విద్వేశాలె!
కనగ అనగ- విని కదలవశమె!
నీతిరహితుకంటె కోతియే పదివేలు-
విశ్వసింపక మనుగడ విజయమేది?
(గీ)
నమ్మకము-తృప్తి గలిగించు నాగభూష!
రాజ వేములవాడేశ! రామశంభు!
___________________________________
38*సీ.
చెడుకన్న మంచియే చేరె విశ్వమునందు
వివిధావతారాలు విష్ణువెత్తె!
తారకాసురుజంప-మేరువు విల్లుగా
నారాణనాస్త్రమే నడిపె కథను!
(గీ)
తారకము రామ మంత్రమై తరలె తమచే!
రాజ వేములవాడేశ! రామశంభు!
____________________________________
39*సీ.
రామబాణముచేత రావణు ద్రుంచగా
హన్మంతుడై నీవె అందిరాగ-
లంక గాసియునయ్యె లబ్ధవిజయంబుగా
సీతమ్మ చెరవీడె! చిద్విలాస!
(గీ)
శక్తి యుక్తి భక్తియు నీదె! సర్వమీవె!
రాజ వేములవాడేశ! రామశంభు!
____________________________________
40*
వావిలాలగుడినివాసుడా! మమ్మేలు-
శంకరుండ! భువి శుభంకరుండ!
స్థిరచిత్త మునుగూర్చు శివకేశవానామ!
పాప తిమిరహర! పావనాంగ!
(గీ)
ఆశ వదలించి ఇచ్చేవు అక్షయంబు!
రాజ వేములవాడేశ! రామశంభు!
41*సీ.
ఇల్లునిల్లంతయు ఇలవేల్పు భక్తులై
హద్దులోన బతుకు పద్ధుగొంద్రు!
దుర్వ్యసనాదుల దూరబోకుండగా
దేవర నైవేద్య సేవనిధులు!
(గీ)
తీర్థ విహారాలు-తీరుబడి శోభలు!
రాజ వేములవాడేశ! రామశంభు!
42*సీ.
పండుగ పబ్భాలు దండివేడుక ముద్దు
ముచ్చట సాగింత్రు ముదమువెంట
ధైర్యము పొందేరు-దైవానతిని గొని
నిత్యజీవన రద్ధి నిబ్బరింత్రు!
సేమమెంచి యేర్పడెజాత్ర నేమ విధులు!
రాజ వేములవాడేశ! రామశంభు!
43*సీ.
సచ్చినట్టు బతుకు సంతోషమేముంది
హద్ధు దాటగ నీవె అడ్డుకొనుము!
పెద్దబోనపు జాత్ర పేరోలగముసాగు!
సతతమానందాబ్ధి శాశ్వతంబు!
(గీ)
వరుస మొక్కుకాన్కలముడ్పు- వసుధ జల్లు
రాజ వేములవాడేశ! రామశంభు!
44*సీ.
నాటిమాటమొదట నరసింహకోటంచ
పిదప నీ సేవాళి ప్రీతిగొలుప!
ముదిని తలిదండ్రి మురిసేటి ముచ్చట్లు-
గ్రామదేవతకొల్పు-గలుమ పూజ!
(గీ)
పల్లెపల్లె భక్తినిమునిగి పరవశించు!
రాజ వేములవాడేశ! రామశంభు!
45*సీ.
హరిజగన్ మోహిని అవతారమును బూనె
అన్నిలోకాలకు తల్లి గౌరి!
నీలోన సగభాగ మిచ్చి మెచ్చగజేరె-
ఆదిదాంపత్యము నమరె భువికి!
(గీ)
గణపతి, కుమార గణనాయకత్వమమరె!
రాజ వేములవాడేశ! రామశంభు!
46*సీ.
ఇన్ని తీర్ల పురాణ- హితవుగల్గించియు
సాకినావు జనుల సంతులట్లు!
పరులకైననడుగు వరములందించేవు-
బోలా శివుడనెడు భూరి కీర్తియెనీది!
(గీ)
దురిత నాశక! సుకృత వేదోక్తి రక్ష!
రాజ వేములవాడేశ! రామశంభు!
47*సీ.
దేశదేశాదుల దేలుదైవీగుణ
తేజంబు తద్దేవ తీరుతెన్ను!
మంచినే మతమార్గమనిబోధ సాగించు-
చెడుగు దానవ విషగుణ పిడుగు పాటు!
(గీ)
గమ్యమొకటె దారుల తారతమ్యమెసగె!
రాజ వేములవాడేశ!రామశంభు!
48*సీ.
దాపునే మహనది ధన్యమానేరుగా
నీదుసేవలందు నింపు జలము!
ప్రాపుగా నాంపల్లి వరనారసింహుడు-
ప్రజల దీవించగా భక్తి మయము!
(గీ)
అడుగు నడుగున హరిహర! ఆత్మ బంధు!
రాజ వేములవాడేశ! రామశంభు!
49*సీ.
నాడు నాకలి మంట నయముగా చల్లార్చ
కాశినుండి దక్షిణ కాశి- కదలివచ్చి-
నందిజాతినిపంచి నయసేద్యమందించి
జనులసాదితివట జగతి ఈశ!
(గీ)
నేడు నీకాన్క జనభక్తి కోడె మ్రొక్కు!
రాజ వేములవాడేశ! రామశంభు!
50*సీ.
ఉన్నవి క్షేత్రంపు- కొన్ని విశేషాలు-
శివరాత్రి కళ్యాణ శోభ మరియు-
ఏడలేనికోడెలగట్టు ఏడుగడయు-
దాతృత్వ గుణ సత్ర దాన వసతి!
(గీ)
ఎదిగి వచ్చెను యాదాద్రి మెట్టదాక!
రాజ వేములవాడేశ! రామశంభు!
51*సీ.
అవసరమగు భావమదిచిత్తమున దేలు
యోచన యోజన నొనరనిమ్ము!
గతభవితలు వద్దు కథలజీవనరద్దు-
తక్షణ కర్తవ్య తపనబెంచు!
(గీ)
జరను వైద్యము బాల్యాన చదువు నొసగు!
రాజ వేములవాడేశ! రామశంభు!
52*సీ.
కౌమార యవ్వన కాలానుగుణమైన
ఎదుగుదలనుగూర్చి ఏడుగడగ-
మొదట మనుజుజేసి పిదప నన్నిటదేల్చు-
కట్టు- కర్తవ్యతల్ కట్డడించు!
(గీ)
ఆత్మ దర్శింప వరమిమ్ము ఆదియోగి!
రాజ వేములవాడేశ! రామశంభు!
53*సీ.
పుట్టి మెట్టినదాది పూజతోనాగిన
విజ్ఞతాయె మాది విమలచరిత!
సద్దుమణిగెనంత నాధ్యాత్మికపుశోధ
నుద్ధరించుము శివా! ఊర్ధ్వదృష్టి!
(గీ)
వంద పైబత్కు నాహార చందమొసగు-
రాజ వేములవాడేశ! రామశంభు!
54*సీ.
పచ్చికూరలు పండ్లు ప్రాణశక్తిదములు-
మధ్యాన్నముడికిన మంచి కూడు!
ప్రకృతి వనరులు బాసిన పతనదశయే
కృత్రిమాలను కల్మశ కొట్టునాపు!
(గీ)
అవని అనుకరణపు తిండి పరిహరించు!
రాజ వేములవాడేశ! రామశంభు!
55*సీ.
చేయవల్సిన పని చేతిబెత్తెముజేసి
జరుగుబాటు సాగ జరను నడిపి-
మంచి బతకునడ్పి పెంచాలి పిల్లల-
వారి సౌష్ఠవవృద్ధి వసుధమేలు!
(గీ)
తేజమొప్పగ వారసు తేజి నడుపు!
రాజ వేములవాడేశ ! రామశంభు!
56*సీ.
మట్టిముద్ధగ నరు మహితదైవీగుణం
ఉట్టిపడదు గాలినూది బంతి-
స్పందనం జాగృతివందనం స్వీకృతి
మునులదీక్షయె రక్ష! ముందటడుగు!
(గీ)
సౌఖ్యమదియేమి సుఖశాంతి సంపదనక!
రాజ వేములవాడేశ! రామశంభు!
57*సీ.
మాటలవాకులు చేత చెడాకులు
కల్తివారాశియే కలుగు జగతి!
గరళ గళమరల కబలించు కల్మశం-
పుణ్యసుధలుగూర్చి పుష్టి నొసగు!
(గీ)
దైవి గుణగణమిడి మమ్ము దయను బ్రోవు!
రాజ వేములవాడేశ! రామశంభు!
57*సీ.
ఆకులలముదిన్న అఖిలమ్ము సేమమై
పంచభక్షి నరుడు పదటగలసె!
వైరసాక్రమించె ధైర్యంబుదాజెడె-
పశుపతి! సంస్కార పదవి నుంచు!
(గీ)
ఏది గొప్పయో వేగమే ఏర్పరించు!
రాజ వేములవాడేశ! రామశంభు!
58*సీ.
ఏమితుచ్ఛ సుఖము ఎగబడి జీవింప
ఫలితమెల్లను తుద పతన దశయె!
అంతమాత్రమునకె వింతనూత్నములేల-
పాతలో సత్కృతి పంచిపెట్టు!
(గీ)
సంచితార్థాలలోమంచి చాలబెంచు!
రాజ వేములవాడేశ! రామశంభు!
59*సీ.
గతసమీక్షను మంచి వెతకిసంధానించి
వర్తమానపుమంచి వాసిగాంచు-
నీదుయోగాత్మక నిధిని ప్రభాసించు-
జగతిసత్సంగమై జాగృతొందు!
(గీ)
సగము బతుకాయె మాజన్మ సామి శరణు!
రాజ వేములవాడేశ! రామశంభు!
60*సీ.
మంచియేనిండవలె మానసమున
వంచనలు తొల్గి పోవలె మనుషులందు-
భక్తి యే ప్రేమ మదిమైత్రి మారురూపు!
శక్తివేనీవుగా సాగు జగతి మేలు!
(గీ.)
చీకు చింత విషయచెత్త ముడులు బాపు –
రాజవేములవాడేశ!రామశంభొ!
61*సీ.
చేవజచ్చినవేళ-చెప్పేది నిర్వేద
ఊసుగాక గలదొ-ఉపకరింత!
ఉరికి సంపాదించి ఊడ్చిపోసే చెత్త
కలిమిబలిమి వెంట కలిసిరాదు!
(గీ)
ఉండిలేములనున్న నుంచు తృప్తి –
రాజవేములాడేశ ! రామశంభు!
62*సీ.
కదన జీవననౌక కలిమికే బయలెల్లు-
నీతిమాటవినగ రోతజల్లు!
స్వార్థమొప్పగనూహ స్వాస్థ్యంబు మృగయమౌ
(గీ)
భవితనారోగ్యభాగ్యమే ప్రజలకిమ్ము!
రాజవేములాడేశ! రామశంభు!
63*సీ.
ప్రజలనగాసంతు ప్రభులునీపోలిక
నిష్ఠబూనియేలు నీతిఝరులు!
గాక నేమిమిగులు గాసియై చనుజాతి
లేకిగుణగణంబు లెక్కదప్పు!
(గీ)
బతుకు పైయాశ నిలబెట్టి బలమొసంగు!
రాజవేములాడేశ! రామశంభు!
64*సీ.
పాపికేల విధుల పాటింపు పుణ్యాల
పుట్టకేల మధువు తెట్టెసోకు!
ఎవరి బతుకువారె ఎదుటనే తెల్లారె!
మిగిలియున్నవాడె-మెచ్చెనిన్ను!
(గీ)
మదిని సౌజన్యమమరించి మమ్ముబ్రోవు!
రాజ వేములవాడేశ! రామశంభు!
65*సీ.
ఆదరమున బిల్చె యాదాద్రి దైవమే-
శివుడ- శ్రీశైలమల్లేశ శరణు!
దుస్తార సంసార విస్తార కడలిలో
ప్రాయంబు తొలగె నిన్ ప్రస్తుతింతు!
(గీ)
వైద్యనాథ! పరబ్రహ్మ-విద్య దెలుపు!
రాజవేములాడేశ! రామశంభు!
66*,సీ.
కటుకుతిండిగుడువ కణజాల కీడగు
మరలకణోత్పత్తి మరలతిండి!
కలుగు ప్రకృతితిండియే కణము నిలుపు!
కణమైదురోజులు కదలి బతుకు-
(గీ)
శతము బ్రతికుండు నరదేహమతుకు నాత్మ!
రాజ వేములవాడేశ! రామశంభు!
67*సీ.
వనిని సీతామాత వండితినగనేర్పె-
పొద్దు మాపు మధ్య పొసగనేక-
భుక్తమయ్యె, ఫలమాకు భోజనాలె
దానవాళిమారె-మరలమానవతకు!
(గీ)
పవనపుత్రుని తిండి యే ప్రాణ శక్తి!
రాజ వేములవాడేశ! రామశంభు!
68*సీ.
పంచ గవ్యము రుజలబాపి బ్రోచె!
మరణభీతిని మాన్పించె మనుగడంత-
గోవుపంచామృత గోప్యమై భారత
వైద్యసంపూర్ణత సాధ్యమయ్యే!
(గీ)
నాటి సూక్తులు మెరసెనీనాటికైన!
రాజ వేములవాడేశ! రామశంభు!
69*సీ
బహుధ ముసలితోడు భార్యభర్తలకేడు
గడ-పరస్పర సంసేవ గలుగమేలు!
గాకనెవరు రొష్టు గనియోర్చువారలూ
నీదునామ స్మరణీయం తృప్తి!
(గీ)
యువతగాదన్న వృద్ధుల భవిత గలద?
రాజ వేములవాడేశ! రామశంభు!
70*సీ.
రాయనేమి మిగిలె రానిదే సగపాలు-
చదువనేమి మిగిలె చట్టుబండ-
పొద్దుమాపులు విద్య పొడగించునా జీవి
సుఖశాంతి జీవన సూత్రమిదియ?
(గీ)
సైన్సు నాధ్యాత్మికము వేద శాస్త్ర పటిమ!
రాజ వేములవాడేశ! రామశంభు!
71*సీ.
శతశతికి నడిపించు శంకరా! శుభకర!
కాలసేపమె-జనాకర్శణమ్ము!
వాస్తవ సద్భక్తి వైశిష్ట్యం మగుదారి-
విశ్వగుట్టెఱుంగ వీలుగలుగు-
(ఆ. వె)
ఎఱుకగల్గినంత చుఱుకగు తరియింపు!
రాజ వెముల వాడ- రామశంభు!
72*సీ.
తరతర ప్రకృతియే తనువిచ్చె మనువిచ్చె
తిండిగూర్చె-నరుడె తిష్టవేసి
సైన్సుపేర విషము సంధింపు సాగించె
మాయికుండను పేర- మంచివంచె!
(ఆ. వె.)
మంచి విజ్ఞతొసగి మాయలనెడబాపు-
రాజ వెముల వాడ-రామశంభు!
73*సీ.
కొవ్వుమెక్కియు రిక్త కొవ్వుగరుగదీయు
యంత్ర వైద్యఘటన తంత్రగతుల-
ఇతరధర్మ మనక సతతకల్మినిగోరి
నడమంత్రముగ మరణమ్మదేల?
(ఆ. వె.)
బతుకుగడుప తగిన భద్రతిండిని గూర్చు!
రాజ వెముల వాడ-రామశంభు!
74*సీ.
వాస్తవమునకాస్త వసియించు మంచియే
కల్లలందు చెడుగు-నిల్లుగట్టు!
దానిలో-సత్సంగ ధర్మంబుసాగున-
భక్తి వెక్తిగతపు భద్రతొసగు!
(ఆ. వె.)
ఆదరించి చేర్చు ఆధ్యాత్మిక బాట!
రాజ వెముల వాడ-రామశంభు!
75*
ఆశ్రమముల జరయె అదృష్టజాతకం-
చీకుచింతలుమరుపు- చిత్తశాంతి-
నిన్నుభక్తి దలచు నియమాళియలవడు!
స్వాస్థ్యమలరుచుండు- సామిశరణు!
(ఆ. వె.)
వెసనమంట కుండ- వెసగరక్షిచుంచుమో-
రాజ వెముల వాడ-రామశంభు!
76*సీ.
వినక చచ్చిరి హరి! విష తాగుబోతులై
ఉన్నవారు రుజలుగొన్నవారె!
పుడమి సంతుబొగిలె పుట్టుయనాథలై
వారి సేవలనల్గు వారె హితులు!
(ఆ. వె.)
ప్రతియుపకృతి సేయ- వరదానమిడి బ్రోవు!
రాజ వెముల వాడ-రామశంభు!
77’సీ.
చపలబుద్ధికి భక్తి సాధ్యమా? జరిగేది
జరుగు ననుచు శసాగు ధర్మబోధ!
వలయుదానినియెంచి వరదానమీయుమా!
సేమమొందు పుడమి చీమగూడ!
(ఆ. వె.)
జీవి జీవ కణము దీపించు నీదీప్తి-
రాజ వెముల వాడ-రామశంభు!
78*సీ.
రామ తారక మంత్ర రమ్యసాధననీది-
పావనాత్మ జ్ఞాన పథము నీది!
ఎటుల విన్న వింతు- ఎకసక్కె విషయాలు-
కలినియణచి శుభ కాన్కలొసగు!
(ఆ. వె.)
వసుధ బాగుజేయు వరదానములనిమ్ము!
రాజ వెముల వాడ రామశంభు!
79*సీ.
సూక్మమోక్షము భక్తి శుభముల సత్రమే
లక్ష్యమెఱుగకున్న లబ్ధి లేదు!
భిక్ష లారోగ్యముల్ భక్ష్యపంచకరాజి
హద్దుమీరి శాంతి రద్ధగు జగతినీ-
పద్దు సాగ జేయు భక్తి బాట!
(ఆ. వె)
మితము హితము నరుల మేధశోభింపగా!
రాజ వెముల వాడ-రామశంభు!
80*
సాగితేనేనని-సాగకున్నను నీవె-
తేగరహిత వాక్కు దేలెనేడు!
ఆగడాల పలుకు లన్నిమాన్పి-
సాగ నిమ్ము భక్తి సత్యవాక్కు!
(ఆ. వె.)
విశ్వసించికున్న విషమసమస్యలే!
రాజ వెముల వాడ – రామశంభు!
81*సీ.
బావితరములందు భక్తిదాయక కృతి
బలువైనకొమ్మగు భ్రమనుమాన్పు!
ఈక్షణం నిజజీవనేచ్ఛ సాగింపగా
ఆధ్యాత్మకము గొప్ప అద్దమగును!
(ఆ. వె.)
వైద్య సేద్య దారి వసుధ వృద్ధియగును-
రాజ వెముల వాడ-రామశంభు!
82*సీ.
వీరబ్రహ్మము మాట వికసించు సద్భక్తి
శరణుజొచ్చిన కల్కి కరుణ జూచు!
అధికజనాభాల ఆర్థిక సవరింపు-
ప్రకృతయాహారంబు పంచిపెట్టు!
(ఆ. వె)
జరుగు ఘోర వైరి జతనవైరసు నణచు-
రాజ వెముల వాడ – రామశంభు!
83*సీ.
అలనాటి వాదాలు ఆయువు వేదాలు
అందుబాటునవైద్య బంధు పటిమ-
ఇంటింట దట్టించు-హితకార్యముపకృతి-
తనువు నూరేడులు తలుకులీను!
(ఆ. వె.)
ఆత్మపక్వమొందు-దాకమావిధికదా-
రాజ వెముల వాడ-రామశంభు!
84*సీ.
కలికాల విషభావ కల్మశందొలగితే
విశ్వశాంతపు నీతి విలువబెరుగు!
ప్రేమ దైవమనగ లాభమ్ము జగతికి-
విషపు విద్వేష- క్రోధాలు విడిచి చనను!
(ఆ. వె)
సానుకూలయోచనలిమ్ము సత్య ప్రియుడ!
రాజ వెముల వాడ-రామశంభు!
85*సీ.
పాపమంటు పనుల ప్రతికూల వర్తన
నర్తనాలు సాగె నరుల జాతి-
మిగతజీవులయట్లు మిడకదు, గెలుకుచూ
కరొన బారిబడియు కలతజెందె!
(ఆ. వె.)
కొమ్ము విరిగె-చెడుగు కొమ్ము గాయగ మాన్పు-
రాజ వెముల వాడ-రామశంభు!
86*సీ.
ఎవరుజెప్పిరి నాకు నెఱుక- గూర్చెడు భక్తి-
తండ్రియానతి తాత తపనె సామి!
నాకునేనె గురుడ-ననిహేళనలుజేయ-
మంచిజరిగెను నీదు పంచదొరికె!
(ఆ.. వె.)
తృప్తి గలిగె ముక్తి తృష్ణయు చెలువొందె!
రాజ వెముల వాడ-రామశంభు!
87*సీ.
మంచినెంచి సాగి మార్గదర్శకమందు
మంచి సేకరణలో మనుగడంత-
శతకాల వచియించు పథకానగడిపితి!
స్వీయోద్ధరణబూను చిత్తమిమ్ము!
(ఆ. వె.)
భూష దూషలొక్క బుట్టలో దొక్కించు!
రాజ వెముల వాడ-రామశంభు!
88*సీ.
కన్నకలలు పండె-కవితాత్మగని మది
నిమ్మలించి కృతుల నిగ్గుదేలె!
నీస్తోత్రపారాయణీయమై శతకాళి-
డిజిటలు ప్రచురణ రాజివెలిగె!
(ఆ. వె.)
ఇంక విశ్రాంతి దయసేయు హినకులేశ!
రాజ వెముల వాడ-రామశంభు!
89*సీ.
కరుణజూపిననాడు కవినైతి ఫవినైతి
కానికాలమునను కలతబడితి!
దినమొక్క తీరున దిద్దుకొంటిని భక్తి-
దేశకాలపు పాత్ర తేజమీవె!
(ఆ. వె.)
విద్య గురుడనైతి వెతలుతలమోసితి! !
రాజ వెముల వాడ-రామశంభు!
90*సీ.
ఏమిగల్గును ఠీవి ఎంతయునార్జింప
పుడమినెట్టులగల్గు ఈవి బుద్ధి!
భూమిపై బతుకులే బుద్బుద ప్రాయాలు-
వట్టిచేతుల చక్ర వర్తి జనడె?
(ఆ. వె.)
చెడుగు టక్కు డెక్కు చింతయే వింతగు!
రాజ వెముల వాడ-రామశంభు!
91*సీ.
లంబజ లిఖితుడు లాలిపాటలు వీడి
ఏలజేసెను సృష్టి ఎరుగ లేను!
ధ్యానలింగాకార! ధర్మాధిదేవర-
సృష్టిలయము నీకు నిష్టమాయె!
(ఆ. వె)
మార్పులేకున్న గలుగదీ-మాయసృష్టి
రాజ వెముల వాడ-రామశంభు!
92*సీ.
సుస్థితిని గల్పింప సూర్యనేత్రుడ నీవు
అవతార మెత్తేవు ఆదివిష్ణు!
ధరనుద్ధరింపగా ధర్మసంస్థాపన
దామోదరా నీదె- దండికీర్తి
(ఆ. వె)
ఆదిపరమ బ్రహ్మ అవతార త్రైమూర్తి-
రాజ వెముల వాడ-రామశంభు!
93*సీ.
మంచి నుడివె పుణ్యమార్గపురాణాలు-
మారుమూలలదాగె-మర్మమేమొ!
చెలరేగుచుండెనూ చెడుదోవ దౌష్ట్యమ్ము
తీర్పుకోసమె బత్కు తీరుచుండె!
(ఆ. వె.)
నరుడు భయభక్తి విదలించె-నళిననయన!
రాజ వెముల వాడ-రామశంభు!
94*సీ.
నీభక్తి సడిలేక నీతిధర్మముడొల్ల
అవినీతికి మందు అవని- నీతె!
తేగమ్ము లేకున్న తెగిపోదు జన్మమ్ము-
సన్యాస సత్కీర్తి సచ్చుపుచ్చె!
(ఆ. వె)
కామజనన మరణ కాలీయమర్ధన
రాజ వెముల వాడ-రామశంభు!
95*సీ.
కరొనఘాతిగా నరలోక గాసియై
మూల్గెజగతిశాంతి మొక్కబోయె!
అధికాల్ప వృష్టితుఫాను దెబ్బల జన
సాగరాలుప్పెన సోగుచుండె!
(ఆ. వె.)
మరల మామూలు కాలాన్ని మాకొసంగు!
రాజ వెముల వాడ-రామశంభు!
96*సీ.
శుభమిమ్ము పాఠక శ్రోతల కభయమ్ము
శుభము సౌవిమర్శ సూచకులకు!
కవిపండి తాళికి భువిరాజ పోషక-
ప్రజకెల్ల వందన ప్రవచనాలు!
(ఆ. వె.)
అందరికి మ్రొక్కుసంతతానందినైతి-
రాజ వెముల వాడ-రామశంభు!
97*సీ.
శతకాల హరియని గతకాలముననన్ను
కుతుక నొక్కి ననిస్తి శతక లహరి!
హితకాల మగుజన హితకృతులతోడ-
పథకాలనాశింప పాటిగాదు!
(ఆ. వె.)
కవిగ గుర్తింపు చాలదా? కాన్కలేల!
రాజ వెముల వాడ-రామశంభు!
98*సీ.
శివకేశవానీకు చిత్తాబ్జ హారతీ!
హరిహర నాథుడ! ఆత్మముడుపు!
కోటిదండాలతో కోడెమొక్కులు నీకు-
దక్షిణగుడి పూజ సాక్షి దేవ!
(ఆ. వె.)
జన్మరహిత మోక్షమునిమ్ము జగతినాథ!
రాజ వెముల వాడ-రామశంభు!
99*సీ.
సందేహమే లేదు – సకలబోధయు సాగు
సందోహములందు, సజ్జ నాత్మ-
సత్య దీప్తియె, వెల్గు సత్వగుణమె-
సాత్వికత్వమె నినుజుట్టి సంచరించు!
(గీ.)
ఏడుగడనీవె! ధర్మార్థ పేటినీవె!
రాజ వేములాడేశ! రామశంభు!
100*సీ.
యగయుగపు ధర్మ సుగమఘటన నీదె!
సాగు సమదృష్టి సాహితంబు-
దుష్ట రక్షణ జర్గు-శిష్ట రక్షణ చూపు-
సాగగా త్రైమూర్తి శక్తి రూపు!
మానవత ధర్మపూర్ణమౌ మాటనీదె!
రాజ వేముల వాడేశ! రామశంభు!
101*సీ.(సంపూర్ణం)
ఆధ్యాత్మికాధార మైన విధుల
నీవె నిల్చిగావగ జనుల్ నిష్ఠగొనుచు-
తరలి పోదురు సన్ముక్తి తావులరసి-
భువిని బడిగుడి దీక్ష బూనుకొంద్రు!
(గీ.)
సకలమును నీవె నీలోన సకల సృష్టి!
రాజ వేములవాడేశ! రామశంభు!
102*సీ.
రామచంద్ర దురిత రాక్షస సంహార!
సాధుహృదయ! శరణు సారసాక్ష!
రామేశ్వరనివాస! రమనీయ గుణకోశ!
భద్రతనిడు వీరభద్ర రుద్ర!
(గీ.)
అందుకే భారతాంకితం హరిహరుండ!
రాజ వేములవాడేశ! రామశంభు!
103*సీ.
శింగోటమున నరసింగరూపమునీవె!
జగతియంతట నీవె జంగమయ్య!
విశ్వ సృష్టి స్థితి విషలయంబును నీదె-విశ్వకళ్యాణపు విధులు నీవె!
(గీ.)
విడిగ నినుగొల్చుజనపద విధులు నీవె!
రాజ వేములాడేశ! రామశంభు!
104*సీ.
ఆధార చక్రాన అమ్మరూపున సగం
అలరించు కీర్తి అవనియందు!
కామదహనకేళిగాముక్తి మార్గాన్ని
కట్టుజేసిన దేవ గరళ కంఠ!
(గీ.)
ధీర మునులకు యోగాలు దెల్పినావు-
రాజ వవేములాడేశ! రామశంభు!
105*సీ.
వడ్లుబెరుగుగల్పి వడ్డించినట్లుగా
క్రొత్తపాతలుబట్టె కుత్తుకలను-
ఏది మంచియో చెడగేదొ-ఏర్పడంగ-
చెత్త బతుకులీడ్చె చిత్త భ్రమలు!
(గీ.)
మనిషి కర్తవ్యమును దీర్చి మరరలదిద్దు!
రాజ వవేములాడేశ! రామశంభు!
106*సీ.
నీదు నామాళియె- నిధిగాగ శతశతి
కృతులు జేయగ నీదు కూర్మిపేర్మి-
శతక సప్తతిన్ నుడివితిన్ సతతభక్తి-
స్వీయముక్తికై నాకృషిన్ స్వీకరించు!
(గీ.)
త్యాగ గుణధామ! శివరామ తామ్రవర్ణ!
రాజ వేములవాడేశ! రామశంభు!
107*సీ.
మంగళముదేవ!మమ్మేలు రామసింహ!
మంగళము నీకు మానిత సుగుణ సాంద్ర!
మంగళముగొనుమ! హరిహర! మంగళాంగ!
మంగలకర! రుగ్మతల్ మాన్పరమ్ము!
(గీ.)
భక్తి నీరాజనము గొని భద్రతొసగు!
రాజ వేములవాడేశ! రామశంభు!
108*సీ
శుభముగల్గునుగాక-శ్రోతపఠితులకు-
శుభము సుకవి వృషభులకెల్ల శుభము శుభము!
శుభము భరతమాత శోభిత సిరులకు-శుభము జనులకెల్ల సుఖముశాంతి!
(గీ.)
శుభము సర్వేజనాస్సుఖినోభవంతు!
109*సీ
రావణ సంహార! భావి బమ్మ హనుమ-
శివునాంశ జన్మించె-చిత్రముగను-
రామదూతగ మారె రామేశ్వరమునందు
శివుని గొల్చిపుణ్యాత్ముగ చెలగినావు!
అందుకే తెల్గు భారత అంకితంబు! రాజ వేముల వాడేశ! రామశంభు!
110*సీ.
శింగోటమున నరసింగరూపము నీవె!
జగతి సంచారపు జంగమయ్య!
విశ్వ సృష్టి స్థితి విషయంబులును నీవె-
విశ్వ కళ్యాణపు విధులు నీవె!
(గీ.)
విడిగ గొల్చుటకే నుతుల్ వెలసె సామి!
రాజ వవేములాడేశ! రామశంభు!