top of page
శ్రీశ్రీరాజరాజేశ్వరస్వామివారినీరాజన శతకము
(తే.గీ.)

1*

శ్రీహరిహరధనాథ! శ్రితజనమందార!

పార్వతీశ్వర! త్రిపురారి! ప్రమధనాథ!

వేదవేద్య-వేములవాడవేల్పువైన-

రాజరాజేశనీకునీరాజనాలు!

2*

దక్షవాటిక, దక్షణకాశి, తమరివిడిది-

వెలసెవేములవాడగావేల్పులెల్ల-

నిన్నుజేరికొల్వగ-భక్తినిఖిలజనుల-

రాజరాజేశనీకునీరాజనాలు!

3*

నిఖిలమతములువెలుగొందెనీదుకరుణ-

మేలుగోరువారలకెల్లమేలుకొలుపు!

పల్లెపల్లనీభిక్షలోపరవశించె!

రాజరాజేశనీకునీరాజనాలు!

4*

అన్నికులములుమతములునిన్నుగొలువ-

నిత్యజాతరసాగెనోనీలకంఠ!

ప్రజలసద్భక్తినీభిక్షప్రమదవరద!

రాజరాజేశనీకునీరాజనాలు!

5*

భాస్కరహరిహరక్షేత్రపాలనేత్ర!

కోడెమ్రొక్కులుప్రత్యేకజోడుసేవ-

భక్తయోగులదరిజేరుభర్గ! శర్వ!

రాజరాజేశనీకునీరాజనాలు!

6*

కోడెమ్రొక్కులునందీశుగొల్చువిధము

భిన్నమేకమైమదిపుణ్యప్రీతిగూర్చు-

నీదుగుడిశాంతినిలయమునిత్యముదము!

రాజరాజేశనీకునీరాజనాలు!

7*

కామదహనంబు, పిదపనేకనులపంట!

నీదుకళ్యాణజాతరనిశ్చయముగ!

నిచటజరుగువిశేషమునేటిదాక!

రాజరాజేశనీకునీరాజనాలు!

8*

కాశినెలకొన్నదేవరా! కదలుమనగ-

నారదునికోర్కెమన్నించినందినెక్కి-

తరలివచ్చితివందురుతాతలంత!

రాజరాజేశనీకునీరాజనాలు!

9*

క్షామమున్దీర్పవచ్చినకామవైరి-

కాంక్షతోడనుదక్షణకాశిజేయ-

వెలసితివి, మమ్ముపోషింపవేములాడ!

రాజరాజేశనీకునీరాజనాలు!

10*

తల్లిరాజేశ్వరీమాతతరలివచ్చె-

వెంటతనయులు, వేంచేయ, వేడ్కగూర్చె!

నందిబలగమ్మునడిపించె, నాగభూష!

రాజరాజేశనీకునీరాజనాలు!

11*

కురిసె,నెలమూడువానలుకొల్లలుగను

పైరుపచ్చలువిలసిల్లె, పసిడిపంట!

నందిబలగమ్మురైతుకానందమొసగె!

రాజరాజేశనీకునీరాజనాలు!

12*

ఇంద్రుడునుతొల్లివృత్రాసురేంద్రుజంపి

బ్రహ్మహత్యపాతకుడయ్యె! పాపహరణి-

ధర్మగుండములోమున్గితానమాడె!

రాజరాజేశనీకునీరాజనాలు!

13*

పుణ్యకోనేటితానాలుబూనిజేయ-

ముక్తినొందిరి, రాజులు, మునులు, ప్రజలు!

సద్గతినిబొందిరెందరోచంద్రమౌళి!

రాజరాజేశనీకునీరాజనాలు!

14*

దక్షయజ్ఞహవిస్సుచేతక్షణంబె-

కిరణరహితుడైశశియునీకీర్తిదెలిసి-

మరలదీపింపగాతపమాచరించె!

రాజరాజేశనీకునీరాజనాలు!

15*

పుణ్యకోనేటితానంబుధన్యమనగ-

జేసి, ఫలమొందుకతననీక్షేత్రమునకు

భాస్కరక్షేత్రమనిపేరుబడసెనాడు!

రాజరాజేశనీకునీరాజనాలు!

16*

త్రేతమునరాముడిచటప్రత్యేకనిష్ఠ-

పుడమిజాతనుగూడిపూజజేయ-

వచ్చెవనవాసకాలపువసతిబొందె!

రాజరాజేశనీకునీరాజనాలు!

17*

ద్వాపరంబునద్వారకదరలివచ్చె-

కృష్ణపరమాత్మదర్శించికృపనుబొందె!

పాండవులువచ్చిదర్శింపఫలముగలిగె!

రాజరాజేశనీకునీరాజనాలు!

18*

పూతపౌరణికాధారపూర్వకముగ

వాక్కులైతిహ్యములుగాగ, వరలుచుండు-

నను, పల్కుబడిజనులనాల్కలందు!

రాజరాజేశనీకునీరాజనాలు!

19*

మాళవనరేంద్రుడును, మున్నుబాలహత్య

పాపమైకుష్ఠుబాధింపపడియుమ్రొక్కె-

నంతరోగవిముక్తుడైసంతసించె!

రాజరాజేశనీకునీరాజనాలు!

20*

పాపపరిహారముగమ్రొక్కిఫలముబొంది-

రెందరోచరితపుటలందునుందురనగ-

శాసనాధారములుదొరుకసాగెనింక!

రాజరాజేశనీకునీరాజనాలు!

21*

రాజపట్టముగోల్పడిరాజులంత

డాయవచ్చియు, ధర్మగుండానమునిగి

ముడుపుచెల్లింపప్రజలంతమురినారు

రాజరాజేశనీకునీరాజనాలు!

22*

రాజధానియైచాళుక్యరాజులేల-

వేములాడచాళుక్యులైవెలిగిరంత

సహనసంపన్నజీవనశైలిగలుగ!

రాజరాజేశనీకునీరాజనాలు!

23*

రాజుమారినమతములరాహమారి-

సమ్మతముసాగినానీదుసాక్షిగానె-

జైన, శాక్తేయ, వైష్ణవశైవవిధులు!

రాజరాజేశనీకునీరాజనాలు!

24*

తల్లిసంస్కతమైవృద్ధిదనర-ద్రవిడ

బాష, కౌటుంభసాహితీబలపడంగ-

తర్కవైయ్యాకరణదీప్తితత్వసిద్ధి!

రాజరాజేశనీకునీరాజనాలు!

25*

బాష్యకారులసిద్ధాంతభావగరిమ!

సగుణ, నిర్గుణోపాసనల్సాగిపోయె!

జానపద-విజ్ఞనమ్మకజతయుగుదిరె!

రాజరాజేశనీకునీరాజనాలు!

26*

లలితకళలనారాధించి, లభ్ధిబొంది

తీర్థయాత్రసంస్కృతిపుణ్యతీర్థమయ్యె!

కవులనిలయమైపదహారుకళలుజిందె!

రాజరాజేశనీకునీరాజనాలు!

27*

నేటికినికీర్తిగాంచెమానేటికెరట-

గీతసంగీతములుపాండితేతరులకు!

జానపదకంఠమేళలజాగృతములు!

రాజరాజేశనీకునీరాజనాలు!

28*

ఎవ్వరేమన్ననీభక్తినివ్వటిల్లె!

సంబరములందునీనిరాడంబరంబె!

దర్ఫమేదైననిచటకందర్ఫహరమె

రాజరాజేశనీకునీరాజనాలు!

29*

దక్షణాదికాశిగ, నాటిదక్షవాటి

వెలయుసర్వధర్మవిచారవేదికయ్యె!

అంబరపుసంబరమునిరాడంబరంబె!

రాజరాజేశనీకునీరాజనాలు!

30*

వైరమేదిహరిహరమేవైనమొప్ప!

సర్వమతధర్మసిద్ధాంతసారమంత-

జానపదమునవడవోయజనులకందె!

రాజరాజేశనీకునీరాజనాలు!

31*.

జాగృతినిగూర్చు-శివరాత్రిజాగరణలు

బిలువబల్కుదైవమునీవు-బిల్వపూజ!

క్షేత్రమైజానపదభక్తిసేవసాగె!

రాజరాజేశనీకునీరాజనాలు!

32*

పార్వతీపరమేశ్వరాభక్తిభిక్ష-

గొప్పతనమయ్యె! గౌరవమొప్పెబ్రతుకు

దీనులకుభక్తిభద్రతదిట్టమయ్యె!

రాజరాజేశనీకునీరాజనాలు!

33*

రేయిబవలుసాగె, శివపురాణకథలు

మనసుపైముద్రవేసియు-మనిషిదిద్ధె!

బసవమతమానవతనైక్యపథమువెలసె!

రాజరాజేశనీకునీరాజనాలు!

34*

వరుస,శాసనాధారాలవంగిపర్రు-

వెలసె ‘వేములవాడ ‘గా, వేంగిపర్రు-

వెలిగె, శాతవాహనకాలవేల్పువనగ!

రాజరాజేశనీకునీరాజనాలు!

35*

వేయినోళ్ళనీలీలలువేడ్కగూర్చె!

చరితతొలిప్రొద్ధుగాసహస్రాబ్ధిచర్ఛ-

బలముచేకూర్చెసంగనభట్లకృషియు!

రాజరాజేశనీకునీరాజనాలు!

36*

త్రవ్వకాలనాధారాలుత్రవ్విచూడ-

నాటిలెంబులవాటికేనేటి ‘వెముల-

వాడ’ గాపేరుమారినవాస్తవంబు!

రాజరాజేశనీకునీరాజనాలు!

37*

వెలయులేములవాడగావేయినోళ్ళ

మ్రోగివేములవాడగామోదమొసగె!

లేమ-లేమలనూహనీలీలసాగె!

రాజరాజేశనీకునీరాజనాలు!

38*

తెలియఎములాడ-ఎముడాలతీరుతెన్ను-

అక్షరమ్ములవ్యతస్థసాక్ష్యమలరు! నేటిఎముడాలజాతరమేటియయ్యె!

రాజరాజేశనీకునీరాజనాలు!

39*

భీమకవి, పంపకవికృతుల్ప్రీతిగొల్ప

రాజరాజుచేగుడియునిర్మాణమయ్యె!

రుద్రులకృషిచేపలుపునరద్ధరణలు!

రాజరాజేశనీకునీరాజనాలు!

40*

నాటివైభవశ్రీనేడుచాటెననగ

గోచరించును, గుడిమెట్టగోపురంబు!

సకలజనజాగరణకర్తసాంబమూర్తి!

రాజరాజేశనీకునీరాజనాలు!

41*

విధిగబద్ధిగభూపతివేడ్కమేర

వెలసెభీమేశ్వరాలయం-వెడలుదారి

వెంటబద్ధిపోచమ్మకొలువుండెప్రజలబ్రోవ!

రాజరాజేశనీకునీరాజనాలు!

42*

వేడ్కతినునవేశివునినైవేద్యమనగ

స్వామిగొల్చియుపోచమ్మసాకవోసి,

జనులవెల్లువసాగగాజరుగుయాత్ర!

రాజరాజేశనీకునీరాజనాలు!

43*

భక్తితోశివపార్వతుల్పల్లెపల్లె –

తిరిగిచేయుప్రచారాలతీరుతెన్ను-

దీక్షభిక్షగానుభయత్రదివ్యఫలము!

రాజరాజేశనీకునీరాజనాలు!

44*

చెడునుద్రోసివేయుటభక్తిచేతనంబు-

గానితీరుకుమంచియుగలుగునెట్లు!

నీతినియమపూర్వకజోగినీవ్యవస్థ!

రాజరాజేశనీకునీరాజనాలు!

45*

పావనముసోమవారపుభక్తినిష్ఠ!

నీనిరాడంబరత్వమేనిత్యదీక్ష!

పట్టువీడనిసద్భక్తిపవిత్రభిక్ష!

రాజరాజేశనీకునీరాజనాలు!

46*

కరువుదీర్చగానీభక్తికల్పతరువు!

కష్టములుబాపునీదీక్షకామధేను!

పట్టుజాలనిమోటారుబండియాత్ర!

రాజరాజేశనీకునీరాజనాలు!

47*

జనులుమెచ్చేటిశివరాత్రిజాగరణలు-

మాఘబహుళచతుర్ధశిమాపటేళ-

జరుగునీపెండ్లిజూడగజనులతపన!

రాజరాజేశనీకునీరాజనాలు!

48*

దేశమంతటశివరాత్రిదేవళముల-

జరుగునీపెండ్లిసంబరం-జనులకిచట-

కామదహనంబుతదుపరికార్యక్రమము!

రాజరాజేశనీకునీరాజనాలు!

49*

రామనవమికళ్యాణము, సామరస్య-

మలరు, హరిహరాత్మకముగనఖిలజనుల-

శోకముడిగిజీవనశాంతిసుఖములెసగ!

రాజరాజేశనీకునీరాజనాలు!

50*

వెలయుతమగుడిచుట్టున్నవేల్పుగుడులు-

భక్తికేదారములు, జన్మముక్తిదములు!

జనులనడపించునానందజనకనిధులు!

రాజరాజేశనీకునీరాజనాలు!

51*

నీగుడిసత్యవ్రతనేమనిష్ఠవెలయు

ముదముముక్కోటియేకాశిముక్తిప్రదము –

శంకరజయంతి-గీతార్థసభలుశక్తి!

పూజలున్, జ్ఞానయజ్ఞముల్పుణ్యమొసగు!!

రాజరాజేశ! నీకునీరాజనాలు!

52*

వెలసె,నగరకేదారేశ,వేణుగోప-గుడియు,

మహలక్ష్మి,దుర్గయుగొప్పప్రభలు-

మహిశమర్ధినియు, ఉమేశమందిరాలు!

రాజరాజేశనీకునీరాజనాలు!

53*

బాలరాజేశ, విఠలేశ, బాలత్రిపుర-

సుందరి, యనంతనాథునిమందిరములు-

వెలసె, రామాంజనేయనివేశ్మములును!

రాజరాజేశనీకునీరాజనాలు!

54*

జనులు-సాగుబాటలఘనస్వాగతములు

నిర్మితతోరణాలుజూడనింపుసొంపు-

మహ్మదీయదర్గాగుడిమరొకదిక్కు!

రాజరాజేశనీకునీరాజనాలు!

55*

శిలలు-శిల్పాలు,నపురూపచిత్రకళలు-

గలవు, భీమేశ్వరునిగుడివెలయమ్రోగు!

నాదబ్రహ్మసంగీతామానందమొసగు!

రాజరాజేశనీకునీరాజనాలు!

56*

దీపధూపనైవోద్యముల్తీర్థములును

సాంస్కృతికకార్యక్యమములుసాగుచుండు!

ఊరు- ఊరంతశివరాత్రియూయలూగు!

రాజరాజేశనీకునీరాజనాలు!

57*

భక్తితోదేవినవరాత్రిపబ్బములును,

నిండుదనమునూరేగింపుపండుగలును

దాపుదత్తతక్షేత్రముల్దనరుచుండు!

రాజరాజేశనీకునీరాజనాలు!

58*

వివిధధర్మశాలలుసత్రవిడిదివసతి

విస్తరించెధాతలవస్తువితరణములును!

బోనములునన్నదానపుభోజనాలు!

రాజరాజేశనీకునీరాజనాలు!

59*

ఐదువందలసత్రాలు-వైశ్యసత్ర-

మందువందలాదిగదులు – చందమరయ

ఇంద్రలోకమ్ముతలపించునంద్రుజనులు!

రాజరాజేశనీకునీరాజనాలు!

60*

తీర్థయాత్రికులుగవచ్చు – నిరుగుపొరుగు

జిల్ల-రాష్ట్ర-విదేశీయులెల్లరాక-

పోకలరవాణయేజర్గుపొద్దుమాపు!

రాజరాజేశనీకునీరాజనాలు!

61*

ఉచితభోజనసదుపాయమొనరజేయు

నెందరోసత్రములుగట్టనెంచినారు!

వంటగదులును-కళ్యాణమంటపాలు!

రాజరాజేశనీకునీరాజనాలు!

62*

ఎందరోయాత్రికులుజేరు – ఎములవాడ

ఎచటలేనియాచారాలునిచటచూడ-

వినగవింగడంబగునిత్యవిధులుసాగు!

రాజరాజేశనీకునీరాజనాలు!

63*

దేవళంబులనతిపెద్ధదేవళంబు-

వెలసె, తెలఁగాణభక్తులవేల్పు –

నిలయ-మనగ, విలసిల్లెనెముడాలయనెడుపేర!

రాజరాజేశనీకునీరాజనాలు!

64*

కరిమినగరుజిల్లాకీర్తిసిరులసిల్ల-

వెలసెనెముడాలరాజన్నవేల్పుకరుణ-

సేయునట్టిసామాజికసేవనిధుల!

రాజరాజేశనీకునీరాజనాలు!

65*

ధాతనిరతాన్నదానముల్దనరుచుండ-

పెక్కునారోగ్యపథకముల్పేరుకొనగ!

సాహితీ-సాంస్కృతములుసాగెనేడు!

రాజరాజేశనీకునీరాజనాలు!

66*

తెలుగుసంస్కృతిస్ఫూర్తితోవెలయుద్రవిడ-

బాషసంస్కృతిజతగల్గెభక్తికృతుల-

కళలు! కవిపండితులకీర్తికాంక్షదీర!

రాజరాజేశనీకునీరాజనాలు!

67*

రాకపోకల-రాజన్నరక్షభిక్ష-

ప్రస్తుతింతు! శివమహిమవస్తువుగను-

కవితహారతినాయెదకదలిమ్రోగ-

రాజరాజేశనీకునీరాజనాలు!

68*

ఎందరోమహనీయులు-అందరికిని-

వందనాలునర్పించియు, చందముగను

దేశి-యుపజాతిపద్యముతేటగీతి-

రాజరాజేశనీకునీరాజనాలు!

69*

క్రోధికోపించు, ననిభీతికొంతమాని-

ఎదుటికువిమర్శజంకును – పదటగలిపి,

భక్తిప్రాధాన్యకృతిజేతు! ప్రణతి! శరణు!

రాజరాజేశనీకునీరాజనాలు!

70*

భీమకవిగానుపండితభీతిగలదు-

పంపకవికవిగాను-తిట్టుసహింపగలను!

మాయలేనియమాయకమనినషినేను!

రాజరాజేశనీకునీరాజనాలు!

71*

వావిలాలకంకితమైనజీవులైన

వెంకటయ్యసీతమ్మలవేడ్కసుతుడ!

సత్మనారాయణుండనోనిత్యసేవ్య!

రాజరాజేశనీకునీరాజనాలు!

72*

సుమతిశతకంబు – బద్దెనసుకృతమనిరి!

వెలయువేమన్నశతకంబువేదమనిరి!

భక్తిశతకంబునీయిచ్ఛభద్రమనిరి!

రాజరాజేశనీకునీరాజనాలు!

73*

పూర్వపరమెన్ననావింతబుద్ధివినదు!

మార్గమునుమార్చిసాగగామనసువినదు!

భక్తకవితనుప్పొంగగాబలమొసంగు!

రాజరాజేశనీకునీరాజనాలు!

74*

నాది – నీదన్న, కాదన్న, వాదపటిమ-

చేత, చేయువిమర్శకుచేతులెత్తి-

మ్రొక్కి, నాభక్తిప్రకటింతుమోదమొసగు!

రాజరాజేశనీకునీరాజనాలు!

75*

ధ్యానముననిన్నునిలిపినిదానముగను-

నీదుప్రస్తుతికవితనునిష్ఠజేసి-

అంకితముజేతు, దోషంపుజంకుమాన్పు!

రాజరాజేశనీకునీరాజనాలు!

76*

రామనామంబుజపియించురాజమౌళి!

రామచంద్రపూజితపాదరామలింగ!

పాహి! కాళేశ్వరేశ్వరా! పాపనాశ!

రాజరాజేశనీకునీరాజనాలు!

77*

ధర్మముగనర్థమార్జించి-దైవభక్తి-

ధర్మయుక్తమౌకామమున్దనరపొంది-

మోక్షమాశింపగాబ్రహ్మమోదమలరు!

రాజరాజేశనీకునీరాజనాలు!

78*

ధర్మదశలక్షణంబులును-దానగుణముపుడమివర్థల్లజేయగ, పుణ్యమతుల

ధైర్యసాహసంబునలక్ష్మి-దరికిజేరు!

రాజరాజేశనీకునీరాజనాలు!

79*

మానసికశాంతినిడును, క్షమాగుణంబు-

సహనసత్వంబు-సమకూర్ఛుసాధనంబు!

ఓర్పునేర్పున, జీవింపనోపువిధము!

రాజరాజేశనీకునీరాజనాలు!

80*

దమము,సంయమనముగూర్చు,దారియందు-

మనుజులింద్రియనిగ్రహమందిబ్రతుక-

వలయు, సద్వాక్కులేవసుధనిధులు!

రాజరాజేశనీకునీరాజనాలు!

81*

క్షేమమునుగూర్చుభువినస్తేయబుద్ధి!

ప్రాప్తమున్నంతలోతృప్తిపడుటె, సుఖము!

పరులసొత్తునకాశింప, పాపమగును!

రాజరాజేశనీకునీరాజనాలు!

82*

విహితమెఱిగినగలుగుపవిత్రబుద్ధి!

శుచియు, శుభ్రతపాటించుసూత్రగతుల-

చిత్తశుద్ధినినీపూజజేయవలయు!

రాజరాజేశనీకునీరాజనాలు!

83*

శమములేనిదేయోగముసాధ్యపడదు!

మనసుభక్తిమట్టుకుగట్టి, మనుటమేలు

బాహిరంతరశత్రులబాధదొలుగు!

రాజరాజేశనీకునీరాజనాలు!

84*

చేతనత్వంబుదీపింపసేమమొసగు-

కలుగునాధ్యాత్మికవిధిత్రికరణశుద్ధి!

గనగవిజ్ఞానతరువుపైజ్ఞానఫలము!

రాజరాజేశనీకునీరాజనాలు!

85*

కర్మతేజమైధీశక్తిగలుగుభువిని-

మందగించెనాసోమరిమార్గమగును!

చిత్తమప్రమత్తతభక్తిజిలుగువెలుగు!

రాజరాజేశనీకునీరాజనాలు!

86*

సత్యసంపన్నతేనిజసంపదగును!

అంగవైకల్యమునుగౌరవంగగాంచి-

యాదరింపగసత్మరియాదయగును!

రాజరాజేశనీకునీరాజనాలు!

87*

మనసుగెల్వనిభక్తిదుర్మార్గమగును!

లోనిశత్రులుమదిగెల్వలొంగియుంద్రు!

దురలవాటులదూరుటదురితమగును!

రాజరాజేశనీకునీరాజనాలు!

88*

పక్షపాతబుద్ధినిమాని – పరగధర్మ-

దారిజీవింపవలె, జన్మధన్యముగను!

నీతిధర్మంబునిలబెట్టురీతిమేలు!

రాజరాజేశనీకునీరాజనాలు!

89*

శాంతిజీవనసమృద్ధి-సౌమ్యబుద్ధి-

కోపమణచుసంయమనమేగొప్పతనము!

ధర్మదశలక్షణములిట్లుదనరుచుండు!

రాజరాజేశనీకునీరాజనాలు!

90*

పరగ,ప్రాణము,ధన,మాన,భంగమందు-

సూత్రమధిగమించుటధర్మసూక్ష్మమగును!

నీదుయానతిధర్మమైనివ్వటిల్లు!

రాజరాజేశనీకునీరాజనాలు!

91*

తెలిసినదిప్రాతక్రొత్తగుతెలియకున్న-

నాగరికవాక్కువింతయేనాడు-నేడు!

పల్లెపట్నమౌపట్నంబుపల్లెగాగ!

రాజరాజేశనీకునీరాజనాలు!

92*

లవణమన్నమాకలిదీర్చె-లక్షలున్న-

నక్షపట్నాలుమారె! సాపేక్షముగను

వీధిబోనాలపల్లెలువిస్తరించె!

రాజరాజేశనీకునీరాజనాలు!

93*

వరదసాగిపోవు-గతమువర్తమాన

మత్తడినిదుంకు, మరమ్మత్తు, మనిషివంతు!

గొలుసుచెఱువుసేద్యపుపంట, గొప్పబ్రతుకు!

రాజరాజేశనీకునీరాజనాలు!

94*

వానవలెవచ్చుచునుబోవు-వరద, సిరులు-

కల్మిలేములనీభక్తికలుగమేలు!

చిత్తముననాత్మగనకున్నచెత్తమేను!

రాజరాజేశనీకునీరాజనాలు!

95*

తలచిరి,మ్రొక్కులిడిరి,తాత-తల్లి-తండ్రి!

కొడవటంచ-వేములవాడ, కోరితిరిగి-

బ్రతుకుయాత్రసాగించిరి, బలగమెదుగ!

రాజరాజేశనీకునీరాజనాలు!

96*

మొదట, ఇలవేల్పునరసింహుపదములంటి-

పిదపనీమ్రొక్కుచెల్లగ-ప్రీతివెంట-

నాటినడిగుంపుసంసారనావసాగె!

రాజరాజేశనీకునీరాజనాలు!

97*

వాహనాలుమారియు, నుపవాసమైన-

ప్రజలుబారులుదీరిన-ప్రక్కకొదిగి-

వేచినీదర్శనముజేసి, వేడ్కగనిరి!

రాజరాజేశనీకునీరాజనాలు!

98*

కోరికలయుప్పెనే, మదితీరికేది?

తీరెనా-వ్యాధి-వైద్యమైతిరుగుమనసు!

జన్మచాలనియాపేక్షజగతిబ్రతుకు!

రాజరాజేశనీకునీరాజనాలు!

99*

బ్రతుకుకలగభావింపగాపదిలమగును!

కష్టమే, సుఖశాంతిగ-ఇష్టమొసగు!

ధర్మవర్తనసాగింపధైర్యమొసగు!

రాజరాజేశనీకునీరాజనాలు!

100*

రంగుటద్దాలరక్తివిరక్తిగాగ-

స్వార్థమునువీడసర్వంబుచక్కబడగ!

బ్రహ్మవిద్యవివేకమైబ్రతుకుసాగు!

రాజరాజేశనీకునీరాజనాలు!

101*

తెలుగుచోళ-చాళుక్యులతేజమయ్యె!

కవులువేములాడనభక్తికలముద్రిప్ప-

వెలసె, సారస్వతాబ్ధిత్రివిక్రమముగ!

రాజరాజేశనీకునీరాజనాలు!

102*

కలదు,భవిషోత్తరపురాణగ్రంధమందు-

గాంచుమందురు-రాజేశ్వరఖంఢమందు-

ఆత్మశోధింతు-నీకైపరాత్పరుండ!

రాజరాజేశనీకునీరాజనాలు!

103*

ఎవ్వరేమన్నచరితలునివ్వటిలిన-

కవనకథమారి, లయమైనకవులకాంక్ష-

నిన్నువీడునా?సద్భక్తినెన్నుదిశల!

రాజరాజేశనీకునీరాజనాలు!

104*

మరలభువిసూర్యుగలియుటేమర్మ-లయము

నాత్మపరమాత్మలింగైక్యమదియె-యనగ-

నింకనేదియేమైననీలెంకచాలు!

రాజరాజేశనీకునీరాజనాలు!

105*

గతముముప్పాలుగడచెను, గరళకంఠ!

భవితనుప్పెనవేయునీభావజలధి-

వర్తమానంబుసద్భక్తివర్తనంబు!

రాజరాజేశనీకునీరాజనాలు!

106*

చుట్టుశుభమున్నవచ్చునేచుట్టమైన!

మంచియేప్రేమశక్తిగమైత్రి-భక్తి,

నిశ్చలాత్మీయ! పరమాత్మ! నీలకంఠ!

రాజరాజేశనీకునీరాజనాలు!

107*

భక్తిమానేటికెరటాలపథకమయ్యె!

శతకశతిజేయబూనెద-శక్తికొలది!

హరిహరాద్భుతరూప! సహస్రనామ!

రాజరాజేశనీకునీరాజనాలు!

108*

శుభముశతకపాఠకమైత్రిశుభయశంబు!

శుభముముఖపుస్తకపుభక్తిసూక్తములకు!

శుభముశతకార్చనలుగొను – శుభకరుండ!

రాజరాజేశనీకునీరాజనాలు!

Contact
  • Facebook
  • Twitter
  • Instagram
Written By
Sri Satyanarayana Tirunahari 
               M.A , M. Phil (Retired Lecturer in Telugu)
Hyderabad.
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

Designed and developed by
Ravi kiran Tirunahari     
Copyright © 2022 kavitirunahari.com All Rights Reserved.
bottom of page