
వావిలాలరాఘవానివాళి శతకము
(ఆ.వె.)
1*
శ్రీధరాతనూజచిత్తాబ్జభ్రమరమా!
దశరథవరపుత్రదనుజవైరి!
వరద! విశ్వమానవాదర్శచారిత్ర!
వావిలాలరాఘవానివాళి!
2*
పతితపావనజనవాక్యపాలక! రాజ
రామరమ్యసుగుణధామబ్రోవు!
ఖాదికారుకానకనకలిపిగ్రంధమే!
వావిలాలరాఘవానివాళి!
3*
సజ్జనాళిమైత్రిసాగింపశనివార
భజననిహపరంపుబాటవేసి
కార్యకర్తశ్రమకుకలిగించెవిశ్రాంతి!
వావిలాలరాఘవానివాళి!
4*
పల్లెపట్నమునొకముల్లెగట్టినయట్లు
పామరులకువిజ్ఞప్రతిభగూర్చె!
పాపహరముభక్తిప్రాకారమైనిల్చె!
వావిలాలరాఘవానివాళి!
5*
పత్తిపంటనేకిపరగదారపుకండె
లబ్దిచిలుపరంగులద్ధిఖాది
నూలునేత – వస్త్రజాలువారదెనాడు!
వావిలాలరాఘవానివాళి!
6*
ఎందరిశ్రమఫలముచెందునేకముగాగ
అన్నికార్మికములైక్యశక్తి-
మంచిబెంచుసిరిసమైక్యజాతీయతే!
వావిలాలరాఘవానివాళి!
7*
పశ్చిమమునరామభధ్రవంతెన, గుడీ
దక్షణముననీవుదాపు-కృష్ణ
వామదేవునిగుళ్ళు’వరభక్తిలోగిళ్ళు!
వావిలాలరాఘవానివాళి!
8*
గొలుసుకట్టుచెఱువుగొప్పకట్టయుమహ
నేటవరదజేర్చునేర్పుమీర -మరలనింపుకాల్వమరలింపుప్రాజెక్టు!
వావిలాలరాఘవానివాళి!
9*
ఉత్తరదిశనూరపోషమ్మనెలవుండె
అక్కలార్గురుమధునమ్మగద్దె!
పిల్లిగుండ్లువంటపిక్నికుల్సరదాలు!
వావిలాలరాఘవానివాళి!
10*
సారసాక్షసాధుసంసారులనుగాచి
చాడికోరుగుణముసద్దుమణగ
ఊరునుద్ధరించుఉత్తరరహదారి!
వావిలాలరాఘవానివాళి!
11*
మంచినీరుకరువెమత్తడిదుంకగా
తేటనీరునుమరునాటికందు-
పగిదినీదుకరుణఫలవృక్షహారముల్
వావిలాలరాఘవానివాళి!
12*
ముందుముందుకాలముందిమంచినిబెంచు
చుందుమనుచుతృప్తిజెందిపితయు
నిన్నుజేరినాకునీనీడజూపించె!
వావిలాలరాఘవానివాళి!
13*
ముందటూరుమంచెముదముచంకనుసంచె!
సంచితార్థపుణ్యసంపదెసగ-
భరతమాతయొడినిభద్రతనీనీడ!
వావిలాలరాఘవానివాళి!
14*
దూరమున్నమైత్రిదూరభారముగాదు!
ధనమెమైత్రికడ్డుదానగుణము
గలుగుమైత్రినిచ్చికాపాడుదైవమా!
వావిలాలరాఘవానివాళి!
15*
ధనమునడుగువారెదరిజేరిఇంకను
పీడనకలవాటువీడరైరి!
ఇచ్చుకొంటిమరలపుచ్చుకోసందేది!
వావిలాలరాఘవానివాళి!
16*
ఋణముదీరునీదురూపవర్ణనజేయ!
గుణముమారిమంచిగుదురుకొనగ
సాగుపద్యకవితనీగుణగానమై
వావిలాలరాఘవానివాళి!
17
బాల్యభక్తిమైత్రిభావింపనొకతీరె!
పిదపధనముహెచ్చుపిచ్చిగాని
జరమునీడ్వభక్తిజనమైత్రినొకటగు!
వావిలాలరాఘవానివాళి!
18*
నాడుశ్రమయువృత్తివిద్యప్రోత్సాహమే
నేడురోబొకొఱకునెదురుచూపు
సమయమునకుతిండిస్వస్థతకస్రత్తు!
వావిలాలరాఘవానివాళి!
19*
ధవళవస్త్రధారిధనికుడయ్యెనునాడు
రంగుబట్టగట్టరమ్యమయ్యె
కల్గుమార్పులననుకరణతత్కాలమే
వావిలాలరాఘవానివాళి!
20*
ఎంచుకొన్నబ్రతుకెకొంచమైననతృప్తి
కానిబ్రతుకెట్లుగలుగు-భక్తి
భక్తిపరిధితృప్తిబడయుటసుళువగు!
వావిలాలరాఘవానివాళి!
21*
చేసెమెట్టకృషియుశెంభన్నగద్దెపై
నదినిగలియునీటినాపియేట
యత్నమొక్కపంటెయాసంగిపండదు
వావిలాలరాఘవానివాళి!
22*
చెలకసుద్ధరాళ్లెచెల్లదుపంటకు
రేగడైనకాల్వరేపుమాపు!
కొసకునమ్మిజేసెకూతుళ్ళపెండ్లిళ్ళు!
వావిలాలరాఘవానివాళి!
23*
చివరిదశనుశనియెచీకాకుబరచెనా
ఉన్నపేరులేమినున్నతీరు
బ్రతికిచెడినబాధభరియించెమత్పితా!
వావిలాలరాఘవానివాళి!
24*
నీదురథముపైననిల్చియూరేగెను!
ఎదురువచ్చియంపెఏకదంతు!
ఖాదిగౌరవింపకడుతృప్తిప్రకటించె!
వావిలాలరాఘవానివాళి!
25*
ఎవరికెవరుతుదకుఎఱుకగల్గిననాత్మ
జన్మజన్మనీదిసంచితార్థ
పుణ్యగడనకొలదిపుట్టిగిట్టునుకదా!
వావిలాలరాఘవానివాళి!
26*
జన్మతలమువీడచాయించనితండ్రి
తప్పకుండనీదుదర్శనేచ్ఛ-
బాసిజనకనిండుబ్రతకునర్పణజేసె!
వావిలాలరాఘవానివాళి!
27*
అంతమాత్రమైనఅనుసరింపక
నెఱపజాలనైతినిపుడుతండ్రి-
లేనివాడతల్లిలేవలేనిస్థితి!
వావిలాలరాఘవానివాళి!
28*
సంపదొసగుసంతుసంతోషమునుగూర్చు
సులభమైనభక్తిసూచిదెలిపి-
స్వస్థతొసగుతుదకుసాయుజ్యమందించు!
వావిలాలరాఘవానివాళి!
29*
మెచ్చివ్రాయునాడుమెఱవనిపద్యంబు
అలసిభక్తినుడువకలసివచ్చి-
ముద్రబడుచుబ్రహ్మమోదసూచికయయ్యె!
వావిలాలరాఘవానవాళి!
30*
తప్పుదోషమంద్రుతగచిన్నపొరపాటు
పరికరానదిద్ధుబాటులిడక-
కరముదెప్పుచుంద్రుఘనవిమర్శకులుంద్రు!
వావిలాలరాఘవానివాళి!
31*
కలిసిబ్రతుకకున్నకలిమేదొలేమేదొ
తెలియకుండబ్రతుకుతెల్లవారు!
చెడితిమన్ననెవరుచేయూతనిడరారు!
వావిలాలరాఘవానివాళి!
32*
అతుకుపడెడుదాకనతికించుసాలీడు
గూడుగట్టునట్లుగుట్టెరింగి-
జరుపవలెజతనముజయమొందిమనుదాక!
వావిలాలరాఘవానివాళి!
33*
భక్తిగలుగశక్తియుక్తిగలుగభుక్తి
భుక్తితోనెనరుడుబూనుపనుల-
నార్జితసుకృతిగపునర్జన్మరహితమౌ!
వావిలాలరాఘవానివాళి!
34*
బంధమున్నభవమెభవముతోబంధముల్
సన్యసింపనట్టిచక్కి-నెట్లు-
ముక్తిదోవకఠినముడిసడలదుకదా!
వావిలాలరాఘవానివాళి!
35*
అన్నిదెలిసిబ్రతుకఅడవిమేలనిపించు
సత్వరితఫలమురసాయనములె!
మ్రగ్గెసేంద్రియాలుమరమానవులసృష్టి!
వావిలాలరాఘవానివాళి!
36*
రోతగానిక్రొత్తరోబోలలోకమే
యెదురుకోలుజరుపనెసగుచుండె!
మీటదప్పియుద్ధమాటదలపెట్టునో?
వావిలాలరాఘవానివాళి!
37*
గతముకొఱకునేడ్వగతియించుభవిష్యత్తు!
వర్తమానమెనిజవర్తనమ్ము!
దయనుజూపినేడెదరిజేరివరమిమ్ము!
వావిలాలరాఘవానివాళి!
38*
మునుపునెంచుయాది – ముందుకర్తవ్యమ్ము!
నేది?ముఖ్యమంద్రునేర్పుమీర-
కట్టుచుంద్రుమేడగతపునాదులమీద?
వావిలాలరాఘవానివాళి!
39*
మనిషిచరితవర్తమానానగిలకొట్టి
భవితవెన్నదీసిభద్రమనక-
కాచినేతిరూపుగానిల్వసుకృతంబు!
వావిలాలరాఘవానివాళి!
40*
సాగనిమ్ముభక్తిసంసారసాగర
నావగాగనీవెనావికునిగ-
ముక్తితీరమునకుముదమిచ్చివెనుదట్టు!
వావిలాలరాఘవానివాళి!
41*
వ్యసనవేడ్కదురలవాటైనదురితంపు
కర్మలందుముంచికాటగలుపు
మరలమరలజన్మమంచింటబడుదాక!
వావిలాలరాఘవానివాళి!
42*
గతముగతమెజలముకట్టతెగియుదాటె
ఏటగలియుగానియెదురురాదు!
తెగకముందెవెరవుతెలిసితేపదివేలు!
వావిలాలరాఘవానివాళి!
43*
తెలియవచ్చెబ్రతుకుతెర్లైనతదుపరి
వయసునుడుగునతుకువడదుమనసు
పాలవిరుగుపెరుగుపటువనేతినిడదు!
వావిలాలరాఘవానివాళి!
44*
నిల్వనీటనాచునిలువదాపరిశుభ్ర
పడెడుపారునీరుపగిదిబ్రతుకు-
అవనిజుట్టినపుడెఆత్మదర్శనలబ్ధి!
వావిలాలరాఘవానివాళి!
45*
కాలమనెడునీటకదలిరానునుపగు
రాయివలెనుబ్రతుకరాణకెక్కు
గతులదొర్లజేసిహితవుతీరిచిదిద్దు!
వావిలాలరాఘవానివాళి!
46*
స్వాతిముత్యమెంతస్వచ్ఛమోతెల్సియు
మాయకంబుగానిమనుగడేల?
దుడుకెమేలటంచుదురితులైదెప్పేరు!
వావిలాలరాఘవానివాళి!
47*
పరుగుపందెమందుపడిగెల్చుజీవుడే
చేరుగమ్యమునకుచెందుముక్తి!
నడుమరాలునరపునర్జన్మగానుగే!
వావిలాలరాఘవానివాళి!
48*
నారసింహనీకుహారతిశతకంబు
నాడెయిస్తిమదినినమ్రతెసగ!
వరుససాగెరామభద్రాద్రిశతకంబు!
వావిలాలరాఘవానివాళి!
49*
వేములాడవేల్పువేల్పురాజేశ్వర-
స్వామికర్పణమునివాళిశతియు
మరలమరలనిడినమరితృప్తిగగనమే!
వావిలాలరాఘవానివాళి!
50*
ద్వారకమయినిలయుదర్శించిశతకాళి
నంకితమిడిమ్రొక్కినయముజయము-
లొసగమంటికృపనులొసగులుసవరించి!
వావిలాలరాఘవానివాళి!
51*
తొలుతహనుమభక్తిదోవసాగించగా
నీప్రతిష్టజరుపినిత్యసేవ-
సాగజేసెఖాదిసంస్థవరంబుగా
వావిలాలరాఘవానివాళి!
52*
భక్తిగుడులు- బడి-గుబాలించెచదువులు
ఉన్నతోన్నతముగనూరిజనుల-
మూర్తిమత్వమెసగెముందడుగువేయించె!
వావిలాలరాఘవానివాళి!
53**
ముందుతరముమార్గమునుజూపివెలుగొంద
పిదపతరమువెలిగెప్రీతివెంట-
నొనరనీదుభక్తినోచిరిజనులంత!
వావిలాలరాఘవానివాళి!
54*
క్రొత్తపాతకలిసికొసమెఱుంగులుజిందు
తగినవృద్ధిగల్గుదారిభక్తి
చిగురుదొడ్గిమొక్కచెట్టైఫలింపదా!
వావిలాలరాఘవానివాళి!
55*
శ్రీశవెంకటయ్యసీతమ్మలప్రథమ-
సుతుడనీదుశతకసుమముగూర్చి
అంకితముగనిచ్చిఆత్మదర్శించితీ!
వావిలాలరాఘవానివాళి!
56*
ఆర్తజనుడనీదుఆరాధనలుజేసి
స్వాస్థ్యమొందుచుంటిసామిశరణు!
మ్రొక్కుదీరెబ్రహ్మమోదంబుదయసేయు!
వావిలాలరాఘవానివాళి!
57*
అందుకొనుడుశుభమునాబాలగోపాల
మెల్లజనులకింకమేలుమేలు!
మదికితృప్తిమీరుమరవకదీవింప!
వావిలాలరాఘవానివాళి!
58*
ఖాదిరామచంద్ర! కల్గించితివివృత్తి
పనులునమ్మిబ్రతుకుప్రజల-
కష్టచరితమార్చికాపాడితివితండ్రి!
వావిలాలరాఘవానివాళి!
59*
నాటుచరఖమారెనీటుగాదారమున్
దీయుయంత్రచరఖతేజమొసగె
బ్రతుకువేగమునకుబదులిచ్చెకొంతైన!
వావిలాలరాఘవానివాళి!
60*
కరువుకాలమందుకష్టించెమాతల్లి
నడిపెచరఖవంటనడుప
నోపిముద్దనింతనోటికందించెను!
వావిలాలరాఘవానివాళి!
61*
శ్రీశ!సీతామనోహర!శేషశాయి!
నందనందన! సచ్చిదానందకృష్ణ!
ప్రీతివర్ధనహరిహర! ప్రేమమూర్తి!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
62*
కంససంహారహరిహర! హింసదూర!
దుష్టకాళీయమర్ధనదురితనాశ!
సకలమునిజనసేవితచరణకృష్ణ!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
63*
నీతికోవిద! యోగీశ! గీతధాత!
జయముశ్రీకృష్ణపరబ్రహ్మజగతిగురుడ!
కామజనక! జగత్పిత! కర్మయోగి!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
64*
నీరజాక్షశ్రీహరినవనీతచోర!
వేణుగానలోలాకృష్ణవేదవేద్య!
పాహివసుదేవనందనపరమపురుష!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
65*
బాల్యమునపెక్కురాకాసిబలులజంపి
గోటగోవర్ధనమునెత్తిగోడుగుబట్టి
గాచితివిగోకులముఇంద్రుగర్వమణచి!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
66*
జనులునీలీలలుమరువజాలకుంద్రు!
ఆటపాటలదుష్టులనణచివేసి
చేసిచూపితోమాటలుచేతలందు!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
67*
ద్వాపరాంతానకలిమాయదారిచేష్ట
లణచకృష్ణావతారంపులబ్ధిగాగ
ధర్మపునరుద్ధరణజరిగెదనరెనీతి!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
68*
రాజనీతిదురంధర! రాజలోక
దౌష్ట్యమునుబాపిధర్మాత్ముదయనుబ్రోచి
నిలుపగాధర్మధేనువునిన్నుగోరె!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
69*
దండనముజేసితివిదుష్టదంతవక్త్రు!
జచ్చెశిశుపాలుడువినకచక్రధారి!
సమసెభీముచేతనుజరాసంధనృపుడు!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
70*
కుంతికొడుకులగెలిపింపక్రూరలైన
కౌరవాదులుతుదముట్టకదనఘటన!
విశ్వవిజయమందెనుపాండువిజయుడంత!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
71*
సాక్షముగనిల్చెనేటికిశంభుగద్దె
దేవతలపంపుపొలములైతేజరిల్లె!
భద్రతనుగూర్చెనటసత్యభామచెఱువు!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
72*
కాల్వమొగిలిపూబంధమైకలిమినొసగె!
పరగవందురుపొలములపంటబండె!
తుదకునొకపంటనక్కలతూమునీట!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
73*
ఏటివాలునవరదయుమెట్టపొలము!
బండ్లతోనేటినీటికైప్రజలపరుగు
వేసవినిసాగెగగనమైవెలితిగానె!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
74*
చెఱువుతీర్థమందరికందుచెలిమెనూరు!
మాతబ్రతకమ్మగణపనిమజ్జనాలు!
కడకుతరుగుచువచ్చెభూగర్భజలము!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
75*
చెఱువుమత్తడిపైజనుల్చేరియాడ
రంగువలయాలపండుగల్రాగఝరులు!
కొంగుబంగారమేమ్రొక్కికోర్కెలడుగ!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
76*
చేరిపాఠాలుబడియందుచెఱువునందు
నీదులాటలుపాటలునేటియాది!
భద్రతేగానికొఱవడ్డబ్రతుకులేదు!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
77*
ఉత్తరమునందుమామిడితోపుపండ్ల
తోటలీదులుకంచెలుతాటివనము!
సెలవుదినములన్పిల్లలనెలవులనగ!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
78*
భవితమరచెచింతామణిబావినీరు!
భద్రిపోషమ్మబోనముల్భద్రతొసగ-
చల్లగాసాగెపిల్లలచదువుబడులు!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
79*
ధీమచిరుధాన్యములతిండిసేమమొసగ
కల్తిమాటెరుగకబ్రత్కుచల్తిసాగె!
సేద్యబేపారములలబ్ధిచెన్నుమీరె!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
80*
చింతమామిడినిమ్మలుచిట్టిరేగు
గంగరేణివృక్షంబులుకలియవేప
వేపమ్రానులక్రీనీడవెళ్ళెబ్రతుకు!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
81*
కష్టకాలమేగెనునాటికరువుదరిగె!
పశులసంపదమరుగయ్యెపరగయంత్ర
సాయసహకారమునకృషిసాగుచుండె!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
82*
అన్నిటనునూత్నమార్పులమన్నికగను
పల్లెపట్నమై – పట్నపువాడపల్లె-
జానపదమంతటనునిండెజాగృతముగ!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
83*
విశ్వమరచేతియవ్వారవిషయమయ్యె!
పల్లెలుగ్లోబలువిలేజిపథకమమరె!
భక్తియేసనాతనముగాబరగుచుండె!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
84*
మూడుశతకార్పణలమదిముదమునొంది-
వరుసశతకచతుర్థినివాళిజేసి-
పద్యగుచ్ఛంబునర్పించుపటిమనొసగు!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
85*
ఎవరుజదివెదరనితోటిఏవగింప-
చాలుపనిలేదునీకనిసాటిముడువ
విక్రమాదిత్యడనెభక్తివిశ్వరూప!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
86*
శతకరత్నాళికొందఱుసరియననగ
శతకలహరితిర్నాహరిసగమునచ్చు
పడగనీరీతిఎఫ్బిలోప్రచురితంబు!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
87*
దేవదేవపరబ్రహ్మ! దివ్యప్రేమ-
శక్తిరూప! కృతజ్ఞుడ! స్మరణజేసి-
ధన్యవాదనమస్కారదారిజనెద!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
88*
వెలయుగోవర్ధనగిరినివ్రేలినెత్తి!
మాయలనుమాన్పికాళీయమర్ధనముగ-
పడగపైనృత్యమాడినపభుడ! కృష్ణ!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
89*
బాల్యమునగోకులమందుబహువిధాల-
మాయఛేదించికంసునిమట్టగించి-
బాధలనుబాపిబ్రోచినభానుతేజ!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
90*
భక్తినీలీలవెలయించుభాగవతము!
బలిమితెలివినిరూపించుభారతమ్ము!
కలిమిదేవరనీసతికమలనయన!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
91*
బండ్లుఓడలైయోడలుబండ్లుగాగ-
కాలచక్రంబుదిరుగునానీలమేఘ-
శామకొందరియెడనుత్తసామెతగున?
వావిలాలరఘువరనివాళిగొనుమ!
92*
నీటిమీదనోడలు- బండ్లునేలమీద
జనుపరస్పరంబుగతగుసాయమొంది
గమ్యమునుజేరువిధులందుకలుగుక్రమము!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
93*
అనుభవముగొప్పసంపదయవనియందు
తాకితేపడు – కప్పునుతడిసినపుడె!
మొదటెనిష్కామకర్మంబునింకమేలు!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
94*
కానికాలానకష్టాలకడలినున్న
భక్తుదరిజేర్చుభారంబుప్రభుడనీదె!
ఫలితమేదైననీకృపపాపహరమె!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
95*
వైద్యనారాయణుడవీవువాసుదేవ!
రుగ్మతలుబాపిరక్షించురుక్మిణీశ!
ప్రాప్తలేశంబునకుతృప్తిపడగనిమ్ము!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
96*
ఆపదలమ్రొక్కిసంపదనాదమరచి
మాటదప్పినభక్తులమరలమ్రొక్కు
వీలుగల్పించిమన్నించువిభుడవీవు!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
97*
రాముడవునీవెకృష్ణసామ్రాట్టునీవె
బంధువులలోనపరమాత్మబంధువీవె!
ప్రకృతిపావనాకృతులందుపరగనీవె!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
98*
శివుడ! కేశవ! పరబ్రహ్మ! చిన్మయేశ!
ఆదిదేవజగత్పిత! అఘవిదూర!
విశ్వరూప! గీతాధాత! విజయమిత్ర!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
99*
ప్రకృతిపంచభూతాత్మకపటిమమనిషి
పిదపపాంచీకరణమొందిప్రకృతిగలియు!
ఆత్మనీభాగమైచేరినంతముక్తి!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
100*
నారమేముఖ్యభూమికనరునిజన్మ-
నీవునారాయణుండవునయమొసంగు!
కరముజలనిల్వలిడుతెలఁగాణనిధుల!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
101*(సంపూర్ణం)
కరినిబట్టుమకరినీటకదలకుండ!
గట్టుపైకుక్కకోడియుకొట్టువడును!
దేశకాలపాత్రలశక్తితేజమొందు!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
102*
సంయమనమునకర్మయుసడలునంద్రు
పరగదానమేతపముగాఫలమొసంగు!
నలరుకాలతీర్పునగల్గునయముజయము!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
103*
ఎన్నిప్రశ్నలుసంధించెనెలమినరుడు
తమరిగీతార్థమైసాగెతగుజవాబు!
ఎన్నిమార్లువిన్ననుప్రశ్నలేయెదనుమ్రోగు!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
104*
సమతయోగమేమాకిలచాలుతండ్రి!
భక్తియోగానశరణన్నఫలమొసంగు!
హార్ధికముగకృష్ణార్పణమన్నబ్రోవు!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
105*
భక్తివిధులుకాలక్షేపయుక్తులగున-
ప్రజ్ఞజూపింపకీర్తనల్పాడదగున!
మార్పుగననియాడంబరమంతవృధయె!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
106*
భక్తినంకితభావంబుబలపడంగ
నియమనిష్ఠలనెమ్మదినిశ్చలాత్మ
సాగవలెసమారాధన-స్వామిశరణు!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
107*
నీతిగ్రహణంబుజేసియునీతివర్త
నంబునభ్యాసమొనరించినమ్రతెసగ
ధన్యవాదపూర్వకపూజదనరమేలు!
వావిలాలరఘువరనివాళిగొనుమ!
108*
శుభముగురుశిష్యసంబంధసూత్రములకు
శుభమునాబాలగోపాలశ్రోతలకును!
శుభముశతకాభిమానికిశుభముశుభము!
వావిలాలరఘువరనివాళిగొనుమ!