
శ్రీ వావి లాల శ్రీగోపాల బాలకృష్ణ శతకము-2
(తే.గీ.)
1*
శ్రీశ!గోవింద మాథవా! చిత్ర సింహ!
ఆదరముజూపుమో వేణునాద బ్రహ్మ!
భక్త మునిజన సన్నుత భర్గ సఖుడ!
వావిలాల శ్రీనందగో బాలకృష్ణ!
2*
అన్న పూర్ణసంతుకునాకలనదు గాక
దైవ సోయి మనున? ధనపిశాచి!
పేటికలునింపి పాతియు వట్టి చేత
వెళ్ళుగాక సదపకీర్తి వెలయ భువిని
వావిలాల శ్రీనందగో బాలకృష్ణ!
3*
భరత సంస్కృతి వదలము భక్తి విడము!
వేషభాషమాత్రమె పరదేశ బమలు!
అచట నీనామకీర్తనె అలరుచుండె!
వావిలాల శ్రీనందగో బాలకృష్ణ!
4*
చదువు సంస్కార సంసృతి సాగు దేశ
ఉమ్మడికుటుంబ పరిపాల ఊడ్చి పోయ-
ఎవరికిని వారె ప్రైవసి సవరణయ్యె!
వావిలాల శ్రీనందగో బాలకృష్ణ!
5*
ఆశ్రమములు వెలసెవృద్ధ లాశ్రయింప
పిల్లలకువసతిగృహం పెద్ద చదువు!
అంటు బాసెనాత్మీయత! కుంటు బడియె!
వావిలాల శ్రీనందగో బాలకృష్ణ!
7*
రోగి సేవనర్సింగ్హోము రొక్క మయ్యె!
చరమ సంస్కారమునుబాపె చెడుకరోన!
చూడ భూకంప జీవుల పూడికయ్యె!
వావిలాల శ్రీనందగో బాలకృష్ణ!
8*
ఎవరికి వారె యామున తీరమట్లు-
వెనకముందుగా పునరపి జననమరణ-
గతులు మార్చేది నీలీల! గరుఢ గమన!
వావిలాల శ్రీనందగో బాలకృష్ణ!
9*
కంచె చేనుమేసినకథల్ కన్నవారె!
పరువు హత్యలతెగబడు పంతమాయె!
తరచ తరతమ బేధాలు తళుకు మీరె!
వావిలాల శ్రీనందగో బాలకృష్ణ!
10*
లబ్ధి నష్టఖాతల హెచ్చె లుబ్ధ బుద్ధి
మానవాళి సంబంధాలు మంటగలిపె!
బతకు బేపారమై మంచి యతుకులూడె!
వావిలాల శ్రీనందగో బాలకృష్ణ!
11*
నందనందనా!శౌరి గోవింద! రంగ!
అంద చందాల మునిజన సన్నుతాంగ!
రాజ నీతికోవిద! ఖగరాట్తురంగ!
వావిలాల శ్రీ నందగో బాలకృష్ణ!
12*
చదువు సంపూర్ణ సంపాద సాధనలకె!
పదవి వంతున జనధన పంపకాలె!
రక్ష గెలుపు నిరీక్షల రంది మొదలె-
నాయకులను పీడించనో నాగశయన!
వావిలాల శ్రీనందగో బాలకృష్ణ!
13*
పారమార్థికచింతనల్ పదవిగోరి
ఇహమునకుపరి మితమయ్యె హితవు గాని
జోలిగామారెనుపరము! చోద్య భక్తి
ముక్తి గోరువారల సంఖ్య ముందుదరిగె!
వావిలాల శ్రీనందగో బాలకృష్ణ!
14*
డబ్బు పదవుల సాధన జబ్బుగాగ
పోటి ఘనమయ్యె చీలికల్ పోట్లగిత్త
బుద్ధి పొటమరించగ మది వృద్ధి యయ్యె!
కఠిన మతిగతి బహునాయ కత్వ సడులె!
వావిలాల శ్రీనందగో బాలకృష్ణ!
15*
దేశ మునుఏలి యార్జించి తేజమొంది
స్వార్థ తేగంబు వీడుటే ధ్యేయమయ్యె!
బురదచేతల పరస్పర బురద ముఖులె!
మంచి వారిని పీడించు మార్గమయ్యె!
వావిలాల శ్రీనందగో బాలకృష్ణ!
16*
మొదట సేవజేసియుమంచి నెదుట నిల్పి
పేరు కీర్తులగన్నవారేరి నేడు!
గెలుపులలవోక డబ్బుల కొలువులయ్యె!
వావిలాల శ్రీనందగో బాలకృష్ణ!
17*
కింది వారి జేదెడు ఘన క్రియలు లేవు
పైన నున్నవారినిలాగు పనులె మెండు!
వరుస గనునెన్ని కలలోన వారి పోరె-
సామ్యవాదరాముని రాజ్య సామెతేది!
వావిలాల శ్రీనందగో బాలకృష్ణ!
18*
వింత సంపదలొనగూరు వీలుగలిగె-
నేటి సాంకేతికపువృద్ధి నేర్పు మీరె!
అందు బాటైన కృషియందె యలసిసొలసె!
పల్లెపట్టురైతులచేత పాత హలమె!
వావిలాల శ్రీనందగో బాలకృష్ణ!
19*
ఈర్ష్య విద్వేషము ప్రేమ నీసడించె!
డబ్బు విషపూరితము జేసి డాబుపెంచె!
జబ్బుదప్పని బతుకులె జగతి సాగె!
వావిలాల శ్రీనందగో బాలకృష్ణ!
20*
బతుకు శాంతినికేతన బాటనడుపు!
వితరణాత్మక నరబుద్ధి విస్తరించు!
పుట్టు జీవాళి సమసుఖ పుష్టిగొనగ-
శ్రేష్ఠ జీవి మానవ జాతి చేష్ట నిలుపు!
వావిలాల శ్రీనందగో బాలకృష్ణ!
(1. పాహివావిలాల బాలకృష్ణ!(ఆ. వె)
21*
తిండి వెంటదేహ తీరుతెన్నులు మారు
ఆత్మయుప్పెనేయ అన్నిదీరు!
పాపపుణ్యపాట పరగుమా జన్మలు-
ముక్తిమార్గశోధ ముందుబోధ
గీత సూక్తి నీది గేహమే దేహమై
ఆత్మ సాగజేయు ఆదిదేవ!
వాస్తవమ్మె మిగులు వసుధ జీవన్ముక్తి!
పాహివావిలాల బాలకృష్ణ!
(2.పాహి వావిలాలనిలయ! బాలకృష్ణ!(తే.గీ)
22*
పుట్టు నేలలో జీవాత్మ పుణ్యమణుచు
మెట్టు నేలనో ధరమీద గుట్టుగనక
చిట్లు నేలనో పాపాల పుట్ల మునిగి
పాహి వావిలాల నిలయ బాలకృష్ణ!
(3.వావిలాలయశోలీల!బాలకృష్ణ! (తే. గీ.)
23*
మారుమూలపల్లియ మానేటి తరగాల
మారుమ్రోగు నీ వేణువే, మధర రుచుల!
వరుస జలము పంపు వందురు నేలకే
మెట్ట బతుకు తుట్టి మేకగళపు చన్ను!
అరయ నెగసాయపడు వాడు నయ్యయవారు!
అమ్ముకొనియు పరులుగొని యమ్మితినగ
తాండవమునాపి దయజూడు దనుజవైరి!
వావిలాల యశోలీల! బాలకృష్ణ!
(4.వావిలాల నిలయ! బాలకృష్ణ! (ఆ. వె.)
24*
తేలిపోయె బతుకు తెల్సితెల్వనినాడె
రాలిపోయె కీర్తి రక్షనిడక!
నీదు పాదరజమె నిలిచెనా నుదిటిపై
వావిలాల నిలయ బాలకృష్ణ!
(5.వావిలాల నందయశోద బాలకృష్ణ! (తే.గీ)
25*
ఎవరు తెగడినా పొగడినా యెదను ముళ్లు
చాటు పరదహాస్యపు సలహ చట్టుబండె!
దారివెంబటి నీధ్యాసె దాపు ప్రాపు!
చంకజోలె వేసుకుతిర్గ చక్కి కరువె!
పట్టెడన్నంబు గల్పించు ప్రభుడవీవె!
వావిలాల నంద యశోద బాలకృష్ణ!
(6.వామదేవ వినుతశీల! బాలకృష్ణ!(తే. గీ.)
26*
కాళియపడగలను కాలియందెలు మోగె
వైరి వైరసాళియు గాసివడియెనాడె!
ఇల్లు మునిగితేలెను కదా! ఇకను రుజల-
దాటు బలమిమ్ము! పరమాత్మ! దారిజూపు!
ఓషధీనయగుణమున ఒడిని జేర్చు!
వామదేవ వినుతశీల బాలకృష్ణ!
(7.వామదేవ వినుత! బాలకృష్ణ! (ఆ. వె)
27*
తగ్గి హెచ్చు తనువు తత్వవేదన తాల్మి
శక్తి నాత్మకొసగు సూక్తి నడుపు!
కృపను మదిని నిల్పు కృతిసుకృతము సల్పు!
వామదేవ వినుత బాలకృష్ణ!
(8.వావిలాల కీర్తన హరి! బాలకృష్ణ! (తే. గీ.)
28*
మరుపు రానియాదిగ నీదు మధుర నామ
భజన ననుమేలుకొల్పునో పద్మనాభ!
బతుకుదెరువు నిచట పాదుకొల్పితివాయె!
ఆత్మ గుడిజేర్చియర్చింతు ఆదివిష్ణు!
సఖ్యభక్తివికాసమై శతకశతిని!
హరి! చరాచర వర్తివి అందుకొనుమ!
వావిలాల కీర్తనహరి! బాలకృష్ణ!
(9.వావిలాల ఈశ! బాలకృష్ణ! (ఆ. వె.)
29*
చితికినమది పుష్ఫ సిరులొల్కె నీదయా
బతికి చెడియు బడికి పంతులైతి!
శతక శతిని భక్తి పదయోగమున నీకు
అంకితంబునిడగ నరయు చుంటి!
ఆత్మ బంధు! గూర్చు ఆయురారోగ్యంబు!
వావిలాల ఈశ! బాలకృష్ణ!
30*
తిరుణహరివంశ మునబుట్టి కరుణ కిరణ
నిరత తిరునామ మునబెర్గి నిష్ఠగొంటి!
గురుడు తిరువెంగళాత్తాను గుట్టు దెలుప-
నీదు పాదరజంబున నెగ్గి వచ్చి
భాగ్య నగరాన జేరితి బాలకృష్ణ!
31*
నాలలాక్రమించి నడికట్టుఇలుగట్టి
నీరునుప్పెనేయ నెట్టి తిట్టి
తెర్లవార్లు సాగె సెల్లార్ల జనబాధ
చెప్ప వశమె మాటలొప్పుగతుల
తప్పు దెలిసి ఈతి తప్పుకొనగ జేయి!
వావిలాల నంద బాలకృష్ణ!
32*
మెట్టభూమి జనుల కెట్టుయాదికిగల్గగు
తరతరాలలోతు తలపుబాధ!
లోపమెరిగి బతుకు లోతట్టు వారల-
పహరహుష్షారు పట్టుబడదు!
పైనపైన బతుకు పబ్బంబు మరునాట-
బెండు వడి తరతమ బేధవాక్కు!
వెసన వాదులిలను వెసగ మారరుకదా!
వావిలాల నంద బాలకృష్ణ!
*
33*
పడిన కుంభవర్ష పాటుగా పదిహేను
దుక్కుల వరుషంబు దు:ఖపెట్టె!
సడకుపైనసాగె పడవప్రయాణాలు!
పొలములందు చెర్లు పొరలెను చేపలు-
రైతు కనులకొలను రంగరిల్లె స్వామి
వావిలాల నంద బాలకృష్ణ!
34*
ఎంత ఘోష! ఇపుడు పంతగించినముప్పు
వస్తు రాదు వెలితి బడిన బతుకు
పదటగలియు వేళ పలవరింతల మాని!
నీదు శరణువేడ నినదించు భక్తాళి
సాయమైన జేయు సమయమునకు!
వావిలాల నంద బాలకృష్ణ!
35*
శాపనార్థమునకు చట్టాలు మారునా
తిట్ట నాల్క గోళ సట్టుబండ!
దీవెనార్థి పొందు దివ్యలబ్ధిని శుభం!
వెళ్లి నట్టి జీవి మళ్లిరాదు!
ఉన్నవారి సేవ పుణ్య వెచ్ఛముముక్తి!
వావిలాల నంద బాలకృష్ణ!
36*
గాసిజేసె ఈతి గతజల సేతుబం
ధనము గాగ కరొన ధనపు లోటు!
అలుముకొన్న అలుగు అనుకోని కష్టాలు!
ముందుజాగ్రతమది ముడివేయ జేయుమా!
వావిలాల నంద బాలకృష్ణ!
37*
పల్లె పంటగాసి పట్నభవంతుల
కాల్వపైపునాది నిల్వనీట
జరిగి నట్టి గాసి జనజీవనం బోసి!
ఆకలైతె ముద్ధ ఔషధం వేదన
మాన్పుతీరు మరచు మాటయోధులజూడు!
వావిలాల నంద బాలకృష్ణ!
38*
సత్పురుషుల చేత సాయమందించుమో
మంచివారిసలహ మాకొసంగు! జమున విషము నాపి జనుల గాసినయట్లు
కాళీయ విషవైర కణము నణచు!
అందు నీదు కృపను అధికవిరాళాలు!
వావిలాల నంద బాలకృష్ణ!
*
39*
విశ్వరూప! సకల విశ్వంబు నీదాయె
మానవాళి సేవ మాధవుండ!
నీదుసేవయట్లు నిపుణత మాకిమ్ము!
వితరణాత్మకములను విస్తరించు-
పుణ్యనిధుల మనిషి పూరించు వేగమే
ఏకమయ్యెను యెడతెరపిలేని
దుష్టచింతనంబు దుడిచిశాంతమునిమ్ము!
వావిలాల నంద బాలకృష్ణ!
40*
శౌరి నీదుయాజ్ఞ సీరినాగలిబట్టె
యమునయొడ్డు జీల్చి సమయమునకు
బ్రోచె జనులనాడు! వేచియుంటిమి మేము!
వావిలాల నంద బాలకృష్ణ!
1*వావిలాల రాధాకృష్ణ వసమతీశ!
(తే. గీ.)
41*
సేవజేతామన్న మానవ- సేవ నీది!
నీదు నైవేద్యమే భుక్తి నిఖిలమునకు!
సజ్జనత్వంబాయె నాడె కృష్ణా ర్పనంబు!
కలత వెసనపీడితు నరు గావు మయ్య!
తాత జీవన మూల్యంబు తగనొసంగు!
వావిలాల రాధాకృష్ణ వసమతీశ!
2*వావిలాల కృష్ణ వసమతీశ! (ఆ. వె.)
42*
జీవమున్న పల్లె జిడ్డు కంపదియంద్రు-
కెమికలంటనపట్టి కెంపు పల్లె!
పాలు పెరుగు వెన్న పంట సిరులే!
రేడ! నీదుకాన్క రేపల్లె మాపల్లె!
పల్లె పట్న చెట్ట పట్టాల పయణాలు
ఏకమాయె! మరొక లోకమాయె!
కలష కరొన దారి కదలె కట్టడి మరి!
సంస్కరించు మయ్య కంసవైరి!
అభయమైన శుభ్ర తాహార వెవహార
వావిలాల కృష్ణ వసమతీశ!
43*
3*వంశి నాదలోలా యదు వంశి కృష్ణ! (తే.
గీ.)
పాట వినినకొలది మది ప్రాణ శక్తి
ఆటగనిన కొలది నాత్మ మీటు భక్తి
కన్న కాళీయ మర్ధన! గలరె నిన్ను-
గాంచి తాననె తాండవ! గరళగళుడు!
వంశి నాదలోలాయదు వంవంశి కృష్ణ!
*
4*వంశి లోల వైష్ణవాంశ కృష్ణ (ఆ. వె.)
44*
నీదుగానరవళి నిమిషంబు వీడినా
మనసు మరలబడును మాటవినదు!
పంచ ఇంద్రియాల పై స్వారి వెడలును!
ఆత్మనొంటి జేసి యలరు చుండు!
వేద వీధుల నిల్ప ఊదవా ఒకసారి!
వంశిలోల! వైష్ణవాంశ! ! కృష్ణ!
*
5*వావిలాల సత్కీర్తి నివాళి కృష్ణ!(తే. గీ.)
45*
చెదరె! బతుకుచింతామణీ చెలగు బావి
నుండి వెడలె నీశిల్పముద్దండ రుచుల!
మరల నిల్పిన దాదిగా మంచిజరిగె!
కలివశంబున కల్మశ కాటుమాన్పు!
విధివశంబున సద్గతి నిధుల జేర్చు!
అఖిలభారత దేవజగదాఖ్య గురుడ!
వాసుదేవ గీతాచార్య! వరద! రక్ష!
వావిలాల సత్కీర్తి నివాళి కృష్ణ!
*
6*వావిలాల వినుత వసుధ కష్ణ!
46*
ఎంతకాలమేగె ఎందరేగిరి యెదను
సుంతయైన భక్తి సురగలేదు!
కల్తి విషమె నిండె కలియావరించగా
కట్టడాయె! ఇంటి పట్టులాయె!
ఇంకముందు ముందు లెంకలేవైరసో
బంకలాంటి కలుష బాధబాపు!
అర్తులదయ గాంచి ఆర్థికాలనుపెంచి
తెలుగు తేజంబు టీకయె వెలుగుగాగ-
కరొన వైరసణచు కరుణకిరణ!
వావిలాల వినుత వసుధ కృష్ణ!
47*
రాజ్యమలును బోయె రాజ్యాలు మారెను
అతిజనాభాలు ఆశ్రయించె!
వెన్న బెట్టిపెంచు-వెన్నెలబతికించు
నరుని మిన్నజేసి నడుపు మరల
వావిలాల వినుత వసుధ కృష్ణ!
48*
కులములెల్ల గలియుగోకుల గోలోక
మగును భరతదేశమనుగడంత!
ఆయురాదివేద ఆరోగ్యమగుతిడి
మందుమాకొసంగి మనిషి గెలుపు-
మానవాళి సేవాభక్తిమార్గంబు బట్టించు
వావిలాల వినుత వసుధ కృష్ణ!
49*
అరసి సైన్సు గైన్సు లాధ్యాత్మికామృత
గుట్టు నూత్నగీత గూర్చుమేలు!
సమతయోగమెసగ సంసార సాగరం
నీదు నియమ నిష్ఠ నిలిపి నడుపు!
రోగమంటనట్టి రొక్కతిండిని గూర్చు!
వావిలాల వినుత వసుధ కృష్ణ!
50*
భాగవతము, రామాయణ భారతాళి
తుదకు ధర్మ తేజము గెల్చె! ముదమె మిగిలె!
కలిని మిగిలింది విషకణ కల్మశంబె!
నేడు ఏదైన దుర్ధల్ నెట్టె మనిషి-
కలియు గాంతపు దశదిశ కదలుచుండె!
కల్కి వై వత్తువో గాక కాలగతుల
చిల్కెదవొ? శాంతిపన్నీటి సిరుల సుఖము!
సర్వమును నీదు మయమైన జగతి సామి!
గర్వమునువంచు పనియేల గరుఢ గమన!
ఖర్వమొనరించు కోవిదు గాసిబాపు!
పుట్టు ప్రతిజీవి సౌక్యార్థి పుడమినందు-
వావిలాల దాసవినత వాసుదేవ!
51*
కవిత గలిగె మొదట కాల్వ శ్రీరాంపూర-
లక్ష్మినరస గురు సులక్షణాల!
ప్రాథమోన్నత చదువాయె వర్ణామాల!
వావిలాల మధుర బాలకృష్ణ!
52*
ఉన్నతబడి గురుడు అన్నలక్మీనర
సయ్యదెలిపె నందచందయుగళి!
సంగతివివరించె డింగరి నరసింహ
చార్యగురుడు రామ చారిగలిపె!
పిదప తెలుగు చదుపు- ప్రీతిపాత్రము జేసె!
వెసన బాధలణగె వేడ్క గలిగె!
వావిలాల మధుర బాలకృష్ణ!
53*
స్తుతిని జేసిరంత సూచన ప్రాయమై
ఆంజనేయ నుతుల- అంజలింపు!
వీరగౌని భాయి! వివరించె తరువాయి!
మరలి పోతినేను మంత్ర పురికి-
ప్రోత్సహించె నాడె పొరుగున గనుకోట
పాపయాఖ్యశర్మ భక్తి వెంట!
బావి బ్రహ్మ శతక పద్యాలు వికసించె!
తాత చక్రపాణి తత్వ మొసగె!
కలముబడితి వాగు గడ్డగుడిని!
వావిలాల మధుర బాలకృష్ణ!
54*
కర్నె చిరుకవివరు కవితాస్తులు వెడలె
భక్తి పొంగె బతుకు యుక్తి పొంగె!
పొత్తమచ్చుబడగ పొసగ రాయ-
నాగమల్లన శతి సాగె పిదప!
యనుచు రచనజేయు యాదికుండెను దేవ-
వినుము నాటా పద్య వినయ ఘటన!
మదిని భక్తిభావమునంత పదిలమాయె!
వావిలాల మధుర బాలకృష్ణ!
55*
ఎవరు జెప్పగలరు- ఎకసక్కెమాడేరు
ఒక్క పద్యమైన నొక్కదెందు!
పండితకవులును, కవిపండితులు పెక్కు!
నేడు, పద్యవిద్య నేర్తురెవరు!
కూటి చదువె నేడు కోటికై పడగెత్తె!
వైద్యమింజనీర్లు – వైరసెదిగె!
జనులె పోషకులిపుడనుట మేలు!
వావిలాల మధుర బాలకృష్ణ!
*
56*
అన్నియుండవలయు అంగసౌష్ఠవశోభ
పోల్చబాధ గలుగు బోదెకాలు-
జగతిలోన లోటు జరుగ నీయవుకదా!
వృద్ధి గాక సున్న సుద్ధి సిద్ధి!
పద్య శతులు నీతి పాదపమై పూచె!
విషయ సేకరణయు వీలుగలిగె!
తేనె టీగనైతి తెలుగుశతక తెట్టె!
వావిలాల మధుర బాలకృష్ణ!
*
57*
చూచి రాయ కున్న చుక్కోలె గుదురునా
పాత జదవకున్న పట్టుబడున-
కాపి జేతలిపుడె కంప్యూటరైజయ్యె!
కృషియె ముఖ్యము నర కృతులకెల్ల!
కుకవి నిందలాపి కూర్మిపేర్మినిజూపు-
సాధు సజ్జనాళి చదువ కున్న-
చొప్పదంటు నింద సోమకాసురబాధ!
మత్స్యరూప! శరణు! మనుగడొసగు!
వసుధ వాసుదేవ! వసుదేవ నందనా!
వావిలాల మధుర బాలకృష్ణ!
58*
నీతులెన్నియైన నినదింప సేమంబు!
గోతితీయు పనులు గొప్పగావు!
కలిసి చదువవలయు కరొనపాఠాలెల్ల-
టీకదారి మెట్టి ఏకముగను!
మొదట కట్టుబాటు మొదలయ్య గడపలో
తిండి సేమయ్యె సొంత తీరువంట-
మాస్కు రక్షిత కవఛ మానవాళియుసాగె
వావిలాల మధుర బాలకృష్ణ!
59*
ఆయువిచ్చు ముందు ఆరోగ్య భాగ్యమై
చిరుత ధాన్య సేద్య సిరులు మేలు!
కొల్లగకవితాళి కోకిలగానాళి
జల్లువారవలయు పల్లెపల్లె!
వావిలాల మధర బాలకృష్ణ!
60*
మకుట నిధిగొనియు మరవొద్దు శిశువులూ!
తెలుగు గురుని మాట చెల్ల జేయ-
కలము గళమునెత్తి కల్పన సేయంగ-
పాత్రధారి బ్రోచు సూత్రధారి!
సకల చిత్తశాంతి సంధాన కర్తహే
వావిలాల మధుర బాలకృష్ణ!
61*
నాడు లేవు నీళ్లు! నానావిధంబుల
త్రాగునీటి బెడద తడియె కరువు!
తండ్రియాతనగన దండిధైర్యము విన
వెల్లబోసె శ్రమలు! వేదవేద్య!
చెమట చుక్కలట్లు సేకరించిననీరు-
చాలదాయె! తపన చల్లబడగ!
నేడు నిండుకుండ నెలమూడు వర్షాలు!
వావిలాల రేడ! బాలకృష్ణ!
62*
సాగునీట తడుప జాలని మెట్టపై
ఆరుగాలకష్ట మాడె తాను!
పొట్టతిప్పలెంత పొర్లించు మనుషినీ!
వావిలాల రేడ! బాలకృష్ణ!
63*
నిలువనీట నాచు నిల్చి వెక్కిరినిక్కు
నట్లు బతుకుసాగగనాటు పోట్లు మెండు-
చిట్లిపోద మనసు చెట్టోలె కూలదా!
కాతపూతగనని కష్టమేల?
జీవ జవములేక జీవిక సాగునా!
వావిలాల రేడ! బాలకృష్ణ!
64*
కదల వలయు నరుడు కాలానుగుణముగా
నీటిధార రాతి నిగ్గులరసి-
అరిగి పోవుకొలది అందాల చందాలు-
ప్రోదిజేసుకొనుట పొసగమేలు!
నాచు లేనిచోట నయమౌను జయమౌను!
కాసు గల్గుచోట కష్టాలు గట్టుకెక్కు-
వావిలాల రేడ! బాలకృష్ణ!
65*
సాల గ్రామ మగుచు సరిపూజలొందగా
సామినీదు దయయె! సన్నెకల్లు-
గంధసిరుల గలియు కాయసేవల జేరు!
అరుగుదలయె నునుపు నలరుతనువు!
ఏటి నీరు శుభ్రమేయెన్ని తెఱగుల
దలప జలగత జీవన దారి మాది!
ముందు జాగరూకత లేమి! ముప్పుగూర్చు!
నీటి కరువు నోప పాటియగునె!
నయముగూర్చు మీయనావృష్టి నదుపు జేయి!
వావిలాల రేడ! బాలకృష్ణ!
*
2.వావిలాల కోవెలరేడ! బాలకృష్ణ! (తే. గీ.)
*
66*
తెల్ల తెలవార కుండనె మెల్లగాను-
గుడిని -బావినీటినితోడి గుప్పి యూడ్చి-
గడప శుద్ధి దిద్ధియు ముగ్గు గర్రలేసి-
మొక్కి పనిలోకి జనువేళ- ముదము. తృప్తి!
వచ్చు పుణ్యాల రాశియే వరుస జూడ!
శుచియు శుభ్రంపు ఫలితాలె సూక్తి నీడ!
సాగవలె భక్తి పుణ్యప్రసాద జాడ!
వావిలాల కోవెల రేడ! బాలకృష్ణ!
67*
నీరసించి తిండియు నీరు నిత్య కరువు
దూలి ధూళిధూ సరితంపు దుడుకు తనువు!
ప్రేమరహిత విద్వేషాగ్ని ప్రేరణొసగు!
సాగునా నిత్య కృత్యముల్ శ్రమకు నోప-
జాలునా నిశ్చలత ముక్తి జతన క్రియల!
అతియు సర్వత్ర వర్జింపు ఆత్మ కింపు-
దేవరా రమ్ము! దయసేయు తేజ దీప్తి!
వావిలాల కోవెలరేడ! బాలకృష్ణ!
68*
చిత్త చాంచల్య మునలేదు చిత్త శాంతి-
శాంతిలేక సర్వస్వము భ్రాంతి మయమె!
భ్రాంతి దొలగక జీవన క్రాంతి లేదు!
క్రాంతి రహితసంక్రాంతులే-గడపగడప-
అతియనావృష్టి బాధల ననిపి, సాను-
కూలకాలాన్ని మావెంట గూర్చి, పంట-
సిరుల జాతర సేయించు పద్మనాభ!
వావిలాల కోవెలరేడ! బాలకృష్ణ!
69*
బావులెండియునెండ మావునిండె!
మురుగుకాల్వ బొంగులుదారి ముప్పు గూర్చె!
ఆదుకొనరమ్ము! చేయూత సేదదీర్చి- ప్రళయ జలఘోషలార్పుము పంకజాక్ష!
చాలు నోపలేము!నోమునోచగలేము!
నెమ్మదినిగూర్చు! పురజన సమ్మతముగ-
బతుకు సాగింప జేయుమా! బ్రహ్మ జనక!
వావిలాల కోవెలరేడ! బాలకృష్ణ!
70*
భారమితి- సమశీతోష్ణభారతంబు-
అస్త వెస్తతుఫానుల ఆపదొందె!
ప్రాణి ప్రాణరక్షణ కవఛ ప్రజ్ఞ నొసగు-
మానవాళిలో ఈవిని మసలజేసి-
దీక్ష పట్టించు – ఆపన్నరక్షకుడవు!
వావిలాల కోవెలరేడ! బాలకృష్ణ!
71*
ఎన్ని పండుగల్ పబ్బాలు ఏడుగడగ
ఎన్ని జాతరసేవలు యెదలుమురియ!
చిన్న పెద్దల సంతృప్తి చిత్త వృత్తి
నిత్య సంతోష తీరమే నిశ్చలాత్మ!
ఆత్మ పరమాత్మ గావెల్గు ఆత్మలింగ!
వంచకులవంచు దివ్య కోటంచ నృహరి!
వావిలాలవల్లభ హరి! బాలకృష్ణ!
72*
బ్రహ్మ వరసమానము ఎడ్ల బండియాత్ర
నేడు నార్టీసి బస్బేలు వేడుకొసగె!
ఎట్టు చేరినా గుంపులో గుట్టు మాస్కు
కట్టు బాటున కదలెడు కలియుగంబె!
తనువు రక్షణ కవఛమై తరలునాత్మ!
వెలయు నీరామ రక్షణ కలుగగొలుతు!
భక్తి సామ్రాజ్య వరజీవ శక్తిధాత!
వావిలాల వల్లభ హరి! బాలకృష్ణ!
73*
చేరి మ్రొక్కెద యాదాద్రి నారసింహ
ప్రభుడ! పంచమూర్తులగాంచి పరవశించి-
అపర కోటంచె యాదాద్రి తాతలట్లు-
భక్తి దేలిపోయెద! నిహబాధలుడుగ!
విస్తరింపెగుడి బడియు విశ్వరూప!
నీవు లేనిదెక్కడ సామి నీరజాక్ష!
పూర్వయాదాద్రి దర్శింతు పుణ్యమలర!
వావిలాల వల్లభ సిరి బాలకృష్ణ!
74*
వేయినోముల వాడ శ్రీవేములాడ!
వేదనలు మాన్పి శుభమిడె వేల్పు శివుడ!
హరిహరాత్మ పరబ్రహ్మ! హారతిదిగొ!
నిన్ను నమ్మిన భక్తుల కీవె శరణు!
వైరసాటంకముల్ ద్రోసి వసుధ నిలుపు!
వరద బీభత్సమునుడిపి వరములొసగు!
వాసుదేవ ప్రియ! సదయ! వామదేవ!
వావిలాల వల్లభ సిరి బాలకృష్ణ!
75*
ధరను దురితంబు వదలగగా దైవభీతి!
గుట్టుదెలిసియు మెదలగా గురుని భయము!
సజ్జనత్వంబు గూర్చగా సఖ్య భక్తి!
జగతి జనసామ్య సుఖముకై శతకగీతి!
భక్తి నీతిసూత్రాసక్తి ఫలసమర్ప-
నంబుజేసియు నీకృపనందుకొంటి!
సాగి జన్మనీదగ మేలు సామి శరణు!
వావిలాల వల్లభ శౌరి! బాలకృష్ణ!
76*
ఆశవదలిపెట్టి ఆరోగ్య కోశాన
వాయులీలగతుల బతుకునెఱపి-
ప్రాణశక్తి నింపి పరమగురుని బోధ-
సూక్ష్మ పోషకాహారమే దీక్ష తిండి
అవసరానికి తినువస్తువానతిమ్ము!
సుఖముశాంతి పంట చూడనెంచి!
అమరిపోతి వైద్య ఆయువృద్ధినిగూర్చు!
వావిలాల విభుడ! బాలకృష్ణ!
77*
అన్ని వైద్యములను అలసిసొలసె మది
కొన్నిగుణమునయ్యె కొడినిగట్టి
జీవ శక్తి వెలుగు దీవెల జతజేసె-
వావిలాల విభుడ! బాలకృష్ణ!
78*
తెలిసి తిందు తిండి తెర్లుపదార్థమూ
పరిహరింతు రుచియు పచియుననక!
బతుకడాన్కి తిండి అతుకాయె మెతుకాయె
మూడుబాళ్ళ నీరె ముదముగూర్చె!
ఊబచెత్త వెసన దుబ్బార వెచ్చింపు-
ఊసిపోయె కొంత ఊసుమిగిలె!
యోగ సిద్ధిదాక నోపిక గాపాడు-
వావిలాల విభుడ! బాలకృష్ణ!
79*
అవని మూగు చుండు అక్కఱకేరాని
మూగమదినియాశ! ముండ్లకంప!
సాగనీక యోగ సంధానమొనరింతు-
నీదు పదములందె-నిష్ఠవెలయ-
భక్తి యోగ సిద్ధి పండించు సన్ముక్తి!
వావిలాల విభుడ! బాలకృష్ణ!
80*
పరగ సంస్కరించు పౌండేషనై ఈశ!
దారివెంట గురుల దండి వాక్కు-
శుద్ధి గలుగ జేయు సూత్రార్త సంభూత-
పిదపనాత్మ భావ ప్రీతి ముద్ర!
గమన కక్ష్యవేరు గమ్యంబు నేకమై-
సాగిపోవు నాధ్యాత్మిక సౌరు జూపు!
మంచి గలిగించు సర్వత్ర! మాధవుండ!
వావిలాల విభుడ! బాలకృష్ణ!
81*
మందు దినగ ప్రక్క మారి దోషములంట-
నీకనాయు వేద నిష్ఠ గుళిక
మేలుగాద వైద్య మేలనంబున జూడ!
వావిలాల విభుడ! బాలకృష్ణ!
82*
సకలవైద్య విధులు సంగటితముగాగ
మేలు పోట్లగిత్త పోటి కీడు!
జన్మనిచ్చె సామి!జగతివైద్యులజేసి
పెజకు బతుకునిడగ ప్రేరణొసగె!
ధనముగాదు కీర్తి ధనమె ధనము-
సంపదెదిగి రుజచె సంతు సతుకు-
గాన ముందు మ్రోగె గానగీత!
వావిలాల విభుడ! బాలకృష్ణ!
83*
రాజ కీయవృద్ధి రాహతో సరిపడు
సంఘసేవ వృత్తి సాగుమరొక
దేశరక్షగాగ తేజంబు హెచ్చించు-
నీదు సైన్యమగుచు నిగ్గు గూర్చు!
చదువు సంస్కరింపు పదవి నీతియుసాగు-
సైన్సు నాత్మ శాస్త్ర సంయమనము!
సాగు ధార్మిక నరు సవ్యసాచినిజేసి
వృద్ధి దిశను దేశముద్ధరించు!
పెద్దమాట పెరుగు సద్దన్న మందించు-
వావిలాల విభుడ! బాలకృష్ణ!
84*
మాటి మాటికొక్క మాటలగారడి
చేతచేతకొక్క చేతనంబు-
మంచిదారిగలుగ మరియాదయేకదా!
గూటిగువ్వ బతుకు గుట్టు వేరు!
ఉండిలేమి ఊసు పుండేల నారోగ్య-
భాగ్యవరమొసంగు! బ్రహ్మ జనక!
సేద్య వైద్య విద్య చెమటోడ్చు విధి మంచి-
గలుగుదోవమేలు! గరుడగమన!
శిథిల దేహ పాత్ర చిందేసి యాడునా?
వావిలాల విభుడ! బాలకృష్ణ!
85*
పలుకు తీపి తెలుగు పల్లెజీవులయుల్కు
అర్థమయెడి బాష లరసి తెల్పి-
చిటికె లోన బోధ శ్రీకారమొందనీ-
చిత్త శుద్ధి గలుగు శిశుల నొసగు!
మాటకోటి సేయు మానవతాధర్మ-
బాట సాగ భరత బావి పౌర-
శ్రేయసెదగు తోట సెక్యులరైతేనె
తేజరిల్లు కీర్తి రాజ చక్రి!
సమతయోగాన మమ్మెల్ల సంస్కరించు-
వావిలాల విభుడ! బాలకృష్ణ!
*
86*
ఏమిదెల్యకున్న ఎకసక్కె మాడేరు-
గంతు దెల్యకున్న వింతయడుగు-
లేయజూచినట్లు-లేచింది లోకమ్ము!
వెనకకేడు అడుగులేసె నేడు!
పాడు కరొన బీతి పీడ సదాక్రొత్త-
సాగ వీలులేదు, సత్యసూక్తి!
తెలిసి నాకొల్ది మరియేమి తెలియదనుచు-
తెలియవచ్చె దేవ! తేల్చితెల్పు!
జీవి సేవ జీవి దీవెన మాకిమ్ము!
వావిలాల విభుడ! బాలకృష్ణ!
87*
సూరుజెక్కబడియె సూక్తిముక్తావళి
ఆత్మ శోధకథలు అటకనెక్కె!
ఉన్నదేదిలేని ఉద్ధండవాదాల
సద్దుమణగదాయె సరికరోన!
చేసెమేలుకొంత-చెల్లెనుకలుషంబు-
మార్పుగలుగు తీర్పు మరలనీదె!
శుభము సుఖము శాంతి సూత్రమిమ్ము!
వావిలాల విభుడ! బాలకృష్ణ!
88*
కలిని మార్పు గలుగు కాలానుగుణముగ
సానుకూల ప్రేమ సాగనిమ్ము!
మనసుమనసు దూరమందుగలియజేసి
రక్షితంపు దూర రాహనడుపు!
జగతి యార్థికాల జరుగువితరణాళి
భరతమాతయొడిని బడగజేసి
ప్రజల బతుకు దెరువు భవితకాపాదించు!
వావిలాల విభుడ! బాలకృష్ణ!
89*
ఉన్నపాటునొచ్చె ఘోరసమస్యయై
కోవిదు వైరసు నరకోత సాగె!
బంధిజేసె పొరుగు-భారతసంగ్రామ-
మావహించె మందు మాకు టీక-
చౌకనిధుల భరత జనవాహినికిగూర్చు-
సూక్ష్మ మందె రుజల మోక్షమొసగు!
ప్రజల మదిని పీడ భావంబు తొలగించు-
గుండె ధైర్య మొసగు గొప్ప గురుడ!
నీకునచ్చినట్లె నిలబెట్టుమీభువి-
వావిలాల విభుడ! బాలకృష్ణ!
90*
రాధికామనోహర! విరాజరాజపూజ్య!
రుక్మిణీవరుండ! రుక్కుశోధ!
ఉపనిషత్తు సారబోధక! ఉర్విగీత-
గాన తత్వరుచుల గడిగినావు!
ఇంక వైర సేల సంకట పరచేను-
నిన్నుమరచి బతుకు నేడువలదు!
సర్వమానవాళి సంధించు భద్రత-
వావిలాల విభుడ! బాలకృష్ణ!
91*
కన్న ఊరు తల్లి ఉన్నూరు పెంపుడు
తల్లి వలెనె బోలు తఱచిచూడ!
ప్రీతిగొప్పదైన పిల్లజెల్లల వృద్ధి-
విద్య వైద్య సిద్ధి వీలుపడగ-
విశ్వరూప! కరొన విషకాలమునబ్రోవు!
వావిలాల రామ! బాలకృష్ణ!
92*
గతము గడిచె భవిత వర్తమానములందు
బతుకునూహసాగె! బలమునుడిగె!
ధ్యానలింగ శరణు దారి శోధనసాగె!
హరిహరేంద్ర నాధ ఆది దేవ!
గురువుకన్న మిన్న గూర్చుసద్గురువాక్కు!
గీతసూక్తులట్లు ప్రీతిగొల్పు!
రాతమార్చి మరల పూతపుణ్యము నిచ్చు!
వావిలాల రామ! బాలకృష్ణ!
93*
తనువు మరవవలదు ధర్మసాధన పరి
కరముగాగ దాన కర్మసాగె!
మనసు మరవకున్న మరియూబి లోకీడ్చు-
వావిలాల రామ! బాలకృష్ణ!
94*
తనువు నాదిగాదు మనసునాకువినదు!
ఆత్మనేనటంచు ఆర్తిగాంచి-
అందులోననిన్ను అందుకో జూచేను
వావిలాల రామ! బాలకృష్ణ!
95*
రామ యనగ తనువు ధామంబు నిర్మలం-
రామయనగ దురిత రయము జరుగు!
రక్తి భక్తులందు రామతారకమొప్పు!
ధర్మనిష్ట రూప దశకమందు!
కలసివచ్చుననెను కాస్మికు కిరణాలు-
ప్రాణ శక్తి రామ పాదపంబు!
రాజరాజ శివుడు రామశంభువుకదా!
వావిలాల రామ! బాలకృష్ణ!
96*
మంచి గూర్చుకొఱకు మించె దేవుని గుళ్ళు
ఇష్టమైన మతమె ఇంపుగూర్ప-
సాగె భక్తినిష్ఠ సత్కార్య ఫలదీక్ష!
వావిలాల రామ! బాలకృష్ణ!
97*
వేడ్క లిచ్చు కొఱకె వేవేలవేల్పులు
నీప్రసాదతీర్థ నిధులు గలుగు!
మనసు నిల్పుకొఱకె మంచి మార్గము భక్తి
భక్తియోగసిద్ధి పరమ పదవి!
వసుధ నరుడు శాంతి వాసుడై తరియించు-
శాంతిలేక సుఖము చట్టుబండె!
తిరుణహరికి శాంతి తీరుతెన్నులుజూపు!
వావిలాల రామ! బాలకృష్ణ!
98*
మంచిగూర్చు వాదమై మానవతవెల్గె-
సంచితార్థ పుణ్య సరుకు గల్గె!
చెడుగు దులుప చిత్త చేతనత్వము గల్గె-
దానివెంట ధర్మ ధార మ్రోగె!
జన్మ రహితముక్తి తేజమార్గపు భక్తి!
పరిధి నితరకోర్కె ఫలమేమి పుడమిపై-
వావిలాల రామ! బాలకృష్ణ!
99*
రాతరాయు బ్రహ్మ రాడుదీవెనలీయ
బోధసేయు గురుడు బ్రోవరాడు!
చేదుగక్కినాక చేయూత నిచ్చేవు-
ఆర్తి జనుల గాచు అయ్యవీవె!
భక్తదారి గమ్య పదమునీ సన్నిధే!
విశ్వమతవిహార విశ్వరూప!
ఐకమత్యముననె ఐశ్వర్య ముదయించు-
వావిలాల రామ! బాలకృష్ణ!
100*
గతము మరుపు నిచ్చి కలతబాపుము దేవ!
బాధలీదు తపన భక్తు కేల?
భవితలూహ రిత్త చవిదప్పి మృగ్యమౌ
వర్తమానమందు వరలనిమ్ము!
సత్యదాసపోష! సత్సంగమున నడ్పు-
వావిలాల రామ! బాలకృష్ణ!
101*(సంపూర్ణం)
సత్యమేవజయతిగా సాహిత్య మందు-
భక్తి సాహితే విజృంబ బాటసాగె!
కూర్మి శతక కృతియు పాలకురికి ప్రథమ
కృతిగ వెలసె వృషాధిప! శతకమనగ!
పిదప కొనసాగె కావ్యముల్ ప్రీతిగొలిపె!
వావిలాల కోవెలవాస! బాలకృష్ణ!
102*
వెసన పుట్టల వెలువడి వెసగ జనులు
చీమలట్లుగ నలిగిరి సేమమనక!
వారి చేదరిద్రము గల్గె వారసులకు-
దారి భత్తెంపు జీవిక తమదె తండ్రి!
కాంక్షలిలదీర్చు! కలనైన కవిగమెచ్చు!
వావిలాల కోవెలవాస! బాలకృష్ణ!
103*
రూఢియే బతుకున వృద్ధాప్య రుగ్మతాళి
దాడిజేయక తప్పదు తనువు మనసు-
నష్ట పడకదప్పదుసృష్టి పుష్టి కర్త!
కర్మ కరిగింప జేయుమా కర్మసాక్షి!
నీవునేర్పిన విద్యయే నీరజాక్ష!
వావిలాల కోవెలవాస! బాలకృష్ణ!
104*
జరుగ నున్నదే జరిగెనో జగతియందు
జరుగరానిదో కలిమాయ జతన మగునొ-
పరుగు పందెమై జీవిత బాట గతుల-
కల్మశము పేరుకొనె జగతి కరడుగట్టె-
మరల జగతిని నిలబెట్టు మహిమ నీదె!
వావిలాల కోవెలవాస! బాలకృష్ణ!
105*
భక్తి వారథిగా ముక్తి బాటసాగు
సాధన సుళువు యోగాల జతలయందు!
మధుర భక్తికీర్తన పద్య-మైన నీదు-
ఆజ్ఞ పాలనే కంసారి! ప్రజ్ఞనొసగు!
వావిలాల కోవెలవాస! బాలకృష్ణ!
106*
ఒకటి రెండు వత్సరముల రోకు టీక
లేకనే కరోనయు బాయు లెక్క గలిగె!
ముతక వైరసు లొచ్చునో ముందు ముందు-
రాచగుణ మిచ్చు వైద్యనారాయణుడవు!
మంచికాలచక్రము దిప్పు మాధవుండ!
వావిలాల కోవెలవాస! బాలకృష్ణ!
107*
తిరుణహరి వంశ సంజాత తెలుగు కవిని
వేంకటయ్య సీతమ్మల వేడ్క సుతుడ!
శతక సుమసమర్పణ నీకె సత్య ప్రియుడ!
రుక్మిణీమనోహర ! హరి రుద్ర వినుత!
భాగవతబంధు! నవవిధ భక్తలోల!
వావిలాల కోవెలవాస! బాలకృష్ణ!
108*
శుభము శతకపాఠకులకు శ్రోతలకును
శుభము పూర్వాధునికకవివిభులకెల్ల
శుభము సద్విమర్శల బుద్ధి సూక్ష్మమనకు
శుభము బంధుమిత్రాదులౌ సోదరులకు!
శుభము అభయహస్తముగాగ సుఖము శాంతి!
వావిలాల నిలయ శౌరి బాలకృష్ణ!