
శ్రీఅయ్యప్పనివాళి శతకము
(తే.గీ.)
1*
శ్రీహరిహరాత్మజస్వామి! చిద్విలాస!
విశ్వమోహినీవరపుత్ర! వీరశాస్త్ర!
లోకనాథశ్రీనక్షత్రజోతిరూప!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
2*
శరణుషణ్ముఖసోదరా! శరణుసామి!
శరణుఅయ్యప్పయనిభక్తశరణుఘోష!
భక్తసందోహముప్పొంగుపంచగిరుల!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
3*
కడలిరారాజశేఖరా! కంబుకంఠ!
కలిని-కలిమాయబేధించుకాలపురుష!
వాయువాహనా! వజ్రాంగ!వరద! శరణు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
4*
చింతమాన్పగజాలునీచింతనంబు!
మనసునిల్పుదీక్షనుగూర్చు-మంజులేశ!
శోకకారకమెడబాపుసోమరూప!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
5*
ఓమహాశాస్త్రపండితఓమహేశ!
భక్తజనరక్ష – నీదీక్షపాశహస్త!
కాంక్షదీర్చునీకరుణాకటాక్షమహిమ!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
6*
కఠినరాక్షససంహార! ఖఢ్గపాణి!
కరువుకాటకమునుబాపుకవచధారి!
పచ్చదనముప్రకృతిసిరిపంచగిరుల!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
7*
కులముమతమనకనుసామికూటములను-
కలతవడకుండదరిజేర్చు- కరుణకిరణ!
నియమనిష్ఠాగరిష్టతనిచ్చిబ్రోవు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
8*
తారతమ్యంబుగనరానితాత్వికంబు!
నీదువ్రతమందునెలకొనినిగ్గుదేల్చు!
దర్శనంబుదాకనునిష్ఠదనరుచుండు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
9*
దివ్యకరుణాకరా! దేవ! దీనబంధు!
జీవకారుణ్యమూర్తివోదేవపూజ్య!
బ్రతుకుభద్రతనీభక్తిబాటవెంట!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
10*
దీక్షనియమాలజగతిసుభిక్షమగును!
ఆయురారోగ్యమైశ్వర్యమైనయాత్ర-
జన్మతరియించుదారియైసాగుచుండె!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
11*
దీక్షలకునెల్లతమదీక్షదివ్యదీక్ష!
మాలధారణ-నియమాళిమరొకయెత్తు!
జగతిజపమంత్రమీనామశరణుఘోష!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
12*
స్వేచ్ఛభక్తియు, పడిపూజలిచ్చుతృప్తి!
దేహిమాలిన్యములుబాసిదేహివెలుగు!
దేహిదర్శింపనీభక్తితేజరిల్లు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
13*
గురులబోధచేసద్భక్తిగుదురుకొనగ-
సాగునలుబదిదినములసాధనముగ-
ఇర్గపొర్గుసహాయమునింకమేలు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
14*
యోగములభక్తియోగమేమోదమిచ్చు!
దీక్షలనునీదువ్రతదీక్షదీనజనుల-
సుళభముక్తిసోపానమైశుభమొసంగు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
15*
మతములేవైన-బోధించుమానవతనె!
యవనియారోగ్యభాగ్యమేయాస్తిపాస్తి!
గాకనేమున్నఫలమేమిలోకమందు
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
16*
సామిశరణన్నగీతార్థసమతఫలము!
మానవతవెల్గునీయాత్రమార్గగతుల-
సాగునీనోములిహపరసాధనములు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
17*
దీక్షలైహికజీవితమ్తీర్చిదిద్ధు!
భక్తిపరలోకపదవికిబాటవేయు!
నియమనిష్ఠజీవనశ్రేష్ఠనియతిసాగు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
18*
మునిపురాణాలుముక్కంటిమూర్తికథలు-
ముక్తిజన్నజన్మలపుణ్యమూలకంబు!
పుణ్యధనముకైనీదీక్షబూనుజగతి!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
19*
పుణ్యవెచ్చంబునకెజన్మబూనునాత్మ!
ముదముతోజన్మరాహిత్యముక్తికొఱకు-
వసుధజీవజీవన్ముక్తివ్రతముసాగు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
20*
దీక్షభక్తియోగములోనిదివ్యఫలము-
నడుమవీడిన-తగుతుల్యమైనలబ్ధి!
వెంటగల్గునుపుణ్యాత్ములింటజన్మ!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
21*
తరముగాదనకను-దీక్షదరలివచ్చు-
తగుగనియమాలుపాటించితన్మయమున-
భజనసాగించువారికిభద్రతొసగు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
22*
కరుణకిరణమమునడిపిదరినిజేర్చి-
సాయమొనరించుసంసారసాగరాన-
శోకరహితజీవనయాత్ర-చొప్పుదెలుపు!.శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
23*
పూనినీదీక్షసాగించుపుణ్యయాత్ర-
నియమనిష్ఠపాటించగానిండుతృప్తి!
రాజుపేదనకతదేకరాహవెలయు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
24*
సాధునియమాలుతినుతిండిసాత్వికంబు!
భజనసందడిసద్భక్తిబాటసాగు!
ప్రొద్దుమాపునీధ్యాసలోపొసగుబ్రతుకు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
25*
గురుడు-కన్నసామియువెంటకూటమిగను
కత్తి-గంట-గదాసామి, కదలిరాగ!
నింపుగావచ్చుగుంపులునిన్నుజూడ!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
26*
నిశ్చలాత్మదోచగబూనునియమనిష్ఠ-
వెసులుబాటుసందునులేకవెలయుదీక్ష!
సామినీదర్శనమునకైసాగుచుండు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
27*
సాత్వికాహారమొకపూట – సాగుసౌఖ్య-
వర్జనమె-బ్రహ్మచర్యమున్ – వసుధశయ్య-
నిద్ర! శీతలస్నానంబునిష్ఠశ్రద్ధ!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
28*
అసితవస్త్రధారణకండువ-స్వామిశరణు!
శరణుఘోషయువ్రతదీక్షసరణిసాగు!
భక్తిపరిపూర్ణవితరణశక్తికొలది!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
29*
అంగదక్షిణ-త్యాగమునాత్మశోధ-
మమత-నహమరిషడ్వర్గమణచుక్రియలు!
నీదుభారమైమండలంనిట్లెసాగు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
30*
పట్టుదలశుచిశుభ్రతకట్టుబాట్లు-
భక్తిప్రాకటమ్ముగవేషబాషలలర-
తనువెకాన్కగాతరియించుతమరిదీక్ష!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
31*
తలనుయిరుముడెత్తియుయాత్రతరలి-తనువు-
ఇంద్రియాలణచియహమువిధిగవీడి-
గురువునాధ్వర్యమునసాగుగొప్పదీక్ష!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
32*
స్వామి-తానెనీవుగనెంచిసాగుదీక్ష!
పుణ్యకాలము – కార్తీకపుష్యమిలను-
ఉత్తరాయణమున, మంచినొసగుతిథులు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
33*
రాకపోకయుయాత్రికరక్షణంబు-
సాములేబాధ్యులుగజేసితమరుబిలువ-
మార్గరక్షకుడేప్రతిమాలధారి!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
34*
వేకువనెమేలుకొనినిష్ఠవెలయనంత-
సిద్ధపడకున్నకూటమిఛీత్కరించు-
గురువునొప్పించుమదిభక్తిగుదురుదాక!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
35*
మాలధారణాత్మకనియమాలబాట-
తగినచేతనంబునుబొందుతనువునాత్మ-
లౌకికము, పారలౌకికలబ్ధిప్రదము!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
36*
మకరసంక్రమణజ్యోతిమార్గ-నింగి
వెల్గునక్షత్రమైభక్తవేడ్కసాగు!
లక్ష్యముగపల్లెమకరవిలక్కుమంట!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
37*
రాజరాజేశ్వరాత్మజరాజమౌళి!
సకలలోకసదార్చితసాధువినుత-
సకలదేవతాస్వరూపస్వామిశరణు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
38*
పూలుపత్రిసమర్పించిపూజజేసి
పాదధూళినిదలదాల్చిపరవశింప-
నీదుయాత్రసాగినభావమొదవుమదిని!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
39*
చేతగాకున్నశరణన్నచేదుకొనుము!
బ్రతుకుచేయూతనందించిబాటనడుపు-
భక్తినావలోదరిజేర్చిముక్తినొసగు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
40*
శక్తికొలదియర్పించి, హేస్వామిశరణు!
శరణుశరణన్నదయజూచుశంభుపుత్ర!
భక్తిగలిగించిదరిజేర్చుభవవినాశ!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
41*
వైష్ణవము-శైవమార్గముల్వైదికములు-
నియమనిష్ఠలాచారముల్నీదుదీక్ష-
సప్తవర్ణచక్రకిరణసరణినొప్పు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
42*
రంగులేడునుకిరణాంతరమునవెలయు!
పరగతనువాత్మసద్భక్తిపట్టకమున-
వివిధమేకమైవిడిపోవువిధముదోచు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
43*
విశ్వమోహినీవరపుత్ర! విజ్ఞవరద!
సామిశివకేశవాత్మజసారసాక్ష!
అసురమహిషినోడించినయసమనేత్ర!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
44*
పుణ్యజీవనమునుగూర్చుపూర్ణధవళ!
పూనిమండలముకొనసాగుపురముపల్లె-
శరణుఘోషలమార్మోగుశక్తిమేర!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
45*
భూతహితవు-సనాతనపూనికగను-
రక్షసాగించి-కలిమాయరాక్షసమును
సదమదముజేసితివయ్యసామిశరణు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
46*
నేడుసాగెనీసద్భక్తియేడుగడగ-
దురలవాటుమాన్పించగాదురితమణచ-
భక్తివిస్తరించెనుమార్పుప్రాతిపదిక!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
47*
నీతివెన్నెలసంస్కృతినేటిభరత-
పుత్రరక్షణకవతారపురుషజన్మ!
ధరణిధర్మోద్ధరణ-హరిహరసుపుత్ర!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
48*
మాయమహిషిమారణహోమమాపివేసి-
మానవాళిరక్ష-భరతమాతయొడిని
జీవకారుణ్యవ్రతదీప్తినీవెసామి!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
49*
భువిపరోపకారమెభక్తిపూర్వకముగ-
వేదఘోషలుమిన్నంటె-వేయినోళ్ళ-
పుణ్యసాంప్రదాయపువెన్నపుష్టిగలిగె!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
50*
వేదశాస్త్రనక్షత్రఋగ్వేదరూప!
ఆత్మబలమిచ్చునీభక్తిఅగ్నినేత్ర!
మానవత్వంబునిల్పినమాన్యచరిత!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
51*
వేటచాలించిమహరాజువెళ్ళుదోవ-
సర్ఫమునుగాంచెనాశ్చర్యచకితుడయ్యె!
దానినీడలోనినుగాంచిధన్యుడయ్యె!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
52*
కంఠమణిహారమును – వెల్గెకానలందు-
వింతశిశువుగానీవుండచెంతజేరె!
భాగ్యమనిబందలప్రభూభక్తిమ్రొక్కె!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
53*
సంతులేనిరాజుకుగల్గెసంతసంబు!
రాణిముదమొందబొగడిరిరాజ్యప్రజలు!
మంచిశకునములనువార్తబంచుకొనిరి!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
54*
దేశదేశవార్తగజేరవేసిమంత్రి-
సాధు, సామంతులనుబిల్చెసంతసమున!
దండిపండుగవేడుకల్దనరజేసె!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
55*
వేదమూర్తులబిలిపించివేగరాజు-
నయముయోచించె – మణికంఠనామముంచె!
కలియుగానకారణజన్ముగాగదలచె!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
56*
నీదుపదములంటినసిరుల్నిండె! సస్య-
సంపదలుపొంగె-జనవృద్ధిసాగె – పుత్ర-
సంతతినిబొందిమహరాజుసంతసించె!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
57*
బాల్యచేష్టలనీదీప్తిబారజూసి-
దురితులొదిగిరి-జాగ్రతదుష్టమంత్రి-
గూడనంత:పురపుకుట్ర-కుంపటయ్యె!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
58*
నీదుపట్టాభిషేకంబునిలిపివేయ-
వారసుడనాథయనునూత్నవాదుమెఱసె!
తానుసేవింపననెమంత్రితార్కికముగ!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
59*
రాజ్యపాలనవిధిగకర్తవ్యమెంచి-
నీదుసహకారమునతండ్రినిలిచిగెలువ-
ఆటలిహసాగవనిమంత్రి-యలిగితొలగె!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
60*
కలియుమంత్రినావేశించెకథనునడుప-
మాంత్రికులచేత-నినురూపుమాపదలచె!
వ్యాథిగొల్పుపన్నాగముల్వరుసజేసె!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
61*
ధవళవర్ణముశ్యామలతనువుగాగ-
పొక్కులునుదేలె! బంగరుత్వక్కుకందె!
జనులుజడువగానరుదెంచెజంగమయ్య!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
62*
భీకరుండయ్యెరుద్రుండుబిడ్డగాంచి-
ప్రీతిచేస్ఫర్శతద్దోషపీడబాపె!
డమరుకముదుష్టశక్తులడంభమణచె!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
63*
పుణ్యశంకారవముజేసెపురహరుండు!
శివకటాక్షంబుకర్తవ్యచిత్తవృత్తి-
జన్మకారణమునుదెల్సె – జగతిమేలు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
64*
నాటిదనుజమూకలెకలినాశ్రయించి-
పుడమిబుట్టిరిధర్మంపుపుట్టిముంచ!
వారినుండిజాగ్రత్తలవరుసదెలిసె!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
65*
క్షుద్రశక్తినుపాసించుకుటిలమంత్రి
తొలగెపట్టాభిషేకసంతోషమొదవె!
జనులజేజేలుమినుముట్టెజగతిమురిసె!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
66*
ఇంటగెల్చిరాజ్యమునేలియింపుగూర్చి
బయటకలిమాయవారింపప్రతినబూని-
కదలితివికానలకుదీక్షకవఛధారి!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
67*
దుష్టశక్తులదునుమాడిదురితమార్పి-
పుణ్యజనులసంరక్షణపూర్వకముగ-
కలినికట్టడిజేసితోకంచుకంఠ!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
68*
మహిషివరగర్వియైమాయమంత్రశక్తి-
లోకహింసబూనియుసాగశోకజలధి-
ప్రకృతిజీవులుగొల్లెత్తె-పాహియనుచు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
69*
మహిషిభంజింపతగమార్గమైనదీక్ష-
శబరిగిరిజేరితివి, బ్రహ్మచర్యమొప్ప!
అదియె! అయ్యప్ప – దీక్షగానవనివెలసె!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
70*
శివ,శివాంశసంభూత!విశేషదీక్ష-
శిష్టరక్షక! మణికంఠ! చిద్విలాస!
దుష్టశిక్షక! కలియుగదురితదూర!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి
71*
హంసపాలనాయమునీదిహరిసుపుత్ర!
సన్నుతింపజాలనిమహాశక్తిరూప!
ధర్మశాస్తవైశాసింపధరణిమురిసె!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
72*
వృత్రసోదరు,మహిషుప్రవృత్తి-హింస-
జనులభయకంపితులజేసె-శరణనంగ!
ఎదరులేనినీశరఘాతికెరయునయ్యె
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
73*
సజ్జనవిరోధశక్తులుసద్దుమణగె
కలియువెఱగొందిబారెను-ఖఢ్గపాణి!
పాడుమహిషుపీడయుదొలగెబ్రహ్మచారి!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
74*
సమయమగుదాకసాధనజపతపంబు!
నొక్కవేటునశత్రులనుక్కడంచ-
మూడుభువనాలుకీర్తించెముక్తిధాత!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
75*
కానకేగునాడిరుముడిగట్టినావు!
అదియెసాంప్రదాయనియమపథముగాగ-
దిద్దుబాటుసామాజికదీక్షయయ్యె!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
76*
ప్రజలుప్రశ్నింపవరముక్తిపథముగాగవెల్లడించిననీదీక్షవిలువబెంచ-
వేల్పులకువేల్పుగానిన్నువేడుకొనిరి!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
77*
నేడుకొనసాగెనీభక్తియేడుగడగ-
నీదువాక్కులేతలదాల్చినియమనిష్ఠ-
పాత్రధారులనడిపించుసూత్రధారి!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
78*
సామిపేరటపాటించుసంయమనము-
జన్మరాహిత్యమగుముక్తిజనులకాంక్ష-
పాదచారులైయిరుమేనిబాటసాగు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
79*
అసితవస్త్రాలమాలిన్యమంతదొలగు-
తనువునర్పింపనాత్మీయదర్శనంబు!
ఆత్మలోనినుపొడగాంచునమ్మకంబు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
80*
చిత్రమగుమార్గమిదియెనక్షత్రరూప!
సులభమగుయోగమిదిముక్తిసూచిగాను-
పాత్రధారులుతరియించుపవిత్రమతము!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
81*
దివ్యశబరికైలాసమైదీక్షపరులు
రాకపోకజాతరభక్తరక్షసాగె!
ప్రజలజాగృతమొనరించుప్రభుతకృషియు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
82*
మకరజోతినక్షత్రముమరివిళక్కు-
వెల్గులుత్సాహమునుగూర్పవెలయుభక్త-
కూటములకునీనామమేకూర్మిపేర్మి!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
83*
శ్రేష్ఠమానవనీతిప్రతిష్ఠ – నిష్ఠ-
నియమతోరణపరిధిలోనిన్నుజేరు-
దీక్షసాములదీవించుధీమనొసగి!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
84*
తుచ్ఛభోగాలవర్జన-తోడమేలు
నియమతోరణానుసరణనిజసుఖమ్ము!
బ్రతుకు – నర్థమైయారోగ్యభాగ్యమొసగు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
85*
భక్తికాలాంబరముకట్టుబాటువెంట-
మండలదినములునుసాగుమంచిదీక్ష-
దురలవాటుప్రభావముల్దూరమగును!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
86*
దీక్షనలువదిరోజులభిక్షతిండి
దినమునేకభుక్తముపూజతీరుతెన్ను-
మూఢవిజ్ఞవాదనలేనిముందటడుగు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
87*
వెలయునియమాళికఠినమేవిశ్వసింప- సంసృతికిదూరజీవనమ్సాధువృత్తి!
దేహమునదేహిదీప్తినిదెలియుతపన!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
88*
భక్తిశరణాగతియుదీక్షపట్టుగొమ్మ!
జన్మపావనమగుదారిజరుగుభజన-
నిత్యవిధులనేకాగ్రతనీతిబాట!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
89*
బ్రతుకులేమినిమరపించువ్రతవిధమ్ము!
దేహియన్నభిక్షనుగూర్చుదేశజనులు!
పాహియన్నదాపుగనిల్చుప్రభుతవిధులు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
90*
స్వాములందరుజతగూడిసాగుయాత్ర-
గురునియాధ్వర్యమునసాగుకూటవసతి!
నిన్నుగనుదాకకొనసాగునిష్ఠకొలది!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
91*
మూడుపూటలజలకంబులాడునీరు!
తిండిసమకూర్చుప్రకృతిదివ్యభరిణె!
దేశదేశాలప్రజమెచ్చుదేశమిదియె!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
92*
ప్రముఖవాక్కులప్రతులందుప్రాకటముగ-
కోరుపరదేశియిటబుట్టకొసరిమ్రొక్కు!
యాత్రికుల్ధన్యమనిగొనియాడుచుండ!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
93*
వాస్తవముగభారతజన్మవసుధమేలు-
అన్నిబంచిసైన్సునుదెచ్చుకొన్నదనెడు-
నేటినిపుణమతులమాటలెంచిచూడ!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
94*
జనులసద్భక్తిముఖ్యమైజగతిమెప్పు-
కలుగువాదవివాదాలకడకు – భక్తి
గెల్చు-గెల్పించతాతలుతెల్పిజనిరి!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
95*
భక్తిప్రగతిమార్గముమంచిబ్రతుకుదారి!
నేరశాతమ్ముతగ్గించు- పేరుకీర్తి-
విశ్వజనులకాధ్యాత్మికవిద్యనొసగు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
96*
కోటివిద్యలునాడాయెకూటికొఱకు-
కూటివిద్యలునేడాయెకోటికొఱకు-
బ్రతుకుశాంతికిమార్గముబ్రహ్మవిద్య!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
97*
పరులమేలుభావించుసద్భక్తిబాట-జనులుతమకుతాముతరించుజాగృతంబు!
పోటిలోకంబునకురక్షపొన్నయప్ప!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
98*
నియమనిష్ఠయుగురునిపైనిండుభక్తి-
బంధుమిత్రులతిథులందుబరగుభక్తి-
దేవదేవ- నీభక్తినితేటపరచు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
99*
శరణు!శనిదృష్టిమరలించుసామినీవు!
పంచభూతాత్మకంబులేపంచగిరులు!
నీదుకథవిన్నదు:ఖముల్నిమ్మలించు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
100*
జీవసకలచరాచరసృష్టిదీప!
కర్త-భర్త-హర్తవునీవెకాలకంఠ!
వెలయునోంకారనాదఋగ్వేదరూప!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
101*
సర్ఫభూష! కలిపురుషదర్ఫభంగ!
శ్రితజనార్చితచరణసంక్షేమధాత!
కృతినిగొనితిరుణాహరిన్కృపనుజూడు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
102*
పదియునెన్మిదిమెట్లపైపదిలమైన-ముక్తిధాతశ్రీఘనయోగముద్రధారి!
పద్మపీఠానవెలుగొందుపద్మరూప!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
103*
దక్షిణాదికైలాసమైదనరె! శబరి-
గిరియుదీపించె, నీపేరకీర్తిప్రభల!
పుణ్యతీర్థమైక్షేత్రమైపుడమివెలసె!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
104*
దీక్షసామిశరణుపంపతీరవాస!
యాత్రమార్గానజాతరసత్రవసతి-
జనులుసేదదీరగపలుజాగ్రతలును!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
105*
విఘ్నరాజు, వావరుమ్రొక్కివిడిదిసేసి-
వనజనాధిపజాతరన్వరుపగాను-
చోద్యముగదోచుకన్నులచూపుమేర!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
106*
తారకప్రభూ! శరణంటితప్పుదిద్దు!
శతకమునుగొనిపాఠకజనులబ్రోవు!
షణ్ముఖానుజ! గలిగించుసాటిమెప్పు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
107*
సత్యమునుభూతహితవగుశబ్ధబ్రహ్మ!
భక్తిపద్యగానముగూర్చుశక్తముక్తి!
భక్తిగలిగించిబ్రతుకునభద్రతొసగు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!
108*
శుభమునీదీక్షజనులకుశుభముదంబు!
శుభముశతకాభిమానికిశుభయశంబు!
శుభముభక్తలోకానికియభయప్రదంబు!
శబరిగిరివాస! అయ్యప్ప! శుభనివాళి!